మొదటిసారి రోడ్డెక్కిన టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలో సరికొత్త ఎక్స్451 కారును అభివృద్ది చేస్తోంది. ఇది మార్కెట్లో ఉన్న బాలెనో, ఎలైట్ ఐ20 మరియు జాజ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

By Anil

టాటా మోటార్స్ ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళుతోంది. చిన్న కార్ల సెగ్మెంట్లో టియాగో, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో టిగోర్, ఎస్‌యూవీ శ్రేణిలో హెక్సా మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో నెక్సాన్ విడుదలతో మంచి సక్సెస్ అందుకుంది.

ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక సక్సెస్‌ఫుల్ మోడల్ కోసం చూస్తున్న టాటా ఇప్పుడు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోని బాలెనో మరియు ఐ20 కార్లకు పోటీగా సరికొత్త మోడల్‌ను సిద్దం చేస్తోంది. ఎక్స్451 అనే పేరుతో తొలిసారిగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. దీని గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

విపణిలో ఉన్న ప్రతి మారుతి సుజుకి కారుకు మరియు ప్రతి భారీ విజయాన్ని అందుకుంటున్న ప్రతి కారుకు పోటీని సృష్టించే పనిలో టాటా నిమగ్నమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు పోటీగా టాటా ఎక్స్451 అనే కోడ్ పేరుతో సరికొత్త మోడల్‌ను అభివృద్ది చేసింది.

 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా భారత్ రోడ్ల మీద రహదారి పరీక్షలు నిర్వహిస్తున్న ఈ కారు ఇంకా అభవృద్ది దశలోనే ఉంది. డిజైన్, ఫీచర్లు మరియు ఇది ఏ కంపెనీ కారో అని గుర్తించడానికి వీల్లేకుండా నలుపు తెలుపు రంగు చారలున్న పేపర్‌తో దట్టంగా కప్పేశారు.

Recommended Video

Tata Nexon Review: Specs
 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఇంజన్ మరియు పనితీరును పరీక్షిస్తున్న టాటా ఇందులో స్టీల్ వీల్స్, తాత్కాలిక ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ మరియు రియర్ టెయిల్ ల్యాంప్స్ అందించింది. తుది దశ డిజైన్‌లో స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్ రానున్నాయి.

 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా వారి సరికొత్త ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ మీద ఎక్స్451 కారును నిర్మిస్తోంది. ఈ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ స్వల్పంగా టాటా నెక్సాన్‌ను పోలి ఉంటుంది. సాంకేతికంగా నెక్సాన్‌లో ఉన్న అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ అంటే ఇంటీరియర్‌లో అధికంగా ప్రీమియమ్ ఫీచర్లను అందించాల్సి ఉంటుంది. అందుకు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి లైట్లతో ప్రస్తుతం టాటా లైనప్‌లో ఉన్న బోల్ట్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

 టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ ఇదే ఎక్స్451 కాన్సెప్ట్ ఆధారంగా సెడాన్ సెగ్మెంట్లో ఉన్న హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ కార్లకు పోటీగా సరికొత్త సెడాన్ కారును అభివృద్ది చేస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ తమ నూతన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా లాంచ్ చేసిన అన్ని కార్ల కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇదే ఊపు మీదున్న టాటా అన్ని సెగ్మెంట్లో తమ అడుగులు వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ సెగ్మెంట్లలోకి నూతన మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu: The Tata X451 premium hatchback has been spotted testing on Indian roads for the very first time
Story first published: Friday, October 13, 2017, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X