డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి కులం పేరుతో తప్పించుకున్న తెలంగాణ పొలిటీషియన్

Written By:

పదవి మరియు అధికారం ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్ అంటే ఏం చెప్తాం... సందర్భాన్ని బట్టి ఒక్కోసారి అధికారం నెగ్గితే... మరో సారి పదవి నెగ్గుతుంది. అయితే పతం నెగ్గేందుకు పదవి మరియు అధికార మద్య వాదన కొన్ని సందర్భాల్లో తారా స్థాయికి చేరుతుంది. అందుకు నిదర్శనం నేటి కథనం...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డ్రంక్ అండ్ డ్రైవ్

మద్యం తాగి వాహనం నడుపుతున్న రాజకీయ నాయకుడిని పరీక్షించేందుకు పోలీసు బృందం ఎంత ప్రయత్నించిందో... అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆ పొలిటీషియన్ కూడా అంతే ప్రయత్నించాడు.

Recommended Video
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
డ్రంక్ అండ్ డ్రైవ్

అభివృద్ది చెందిన సమాజంలో ఇలాంటి నాయకులు ఇంకా ఉన్నారా... అని తెలుగు పౌరుడు సిగ్గుపడే ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. రోడ్డు మీద విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ, సిఐ మరియు తోటి సిబ్బందిని తన రాజకీయ అండతో గజమాయించిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయ్యింది.

డ్రంక్ అండ్ డ్రైవ్

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసు విభాగం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే, అందులో పట్టుపడిన ఓ నాయకుడు వారి విధులను అడ్డుకున్నాడు. నేనెవరో తెలుసా...? అంటూ పోలీసులకు సవాల్ విసురుతూ... నీ చేతనేమైతే అది చేసుకో అని నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్

పోలీసులకు మరియు పట్టుబడిన వ్యక్తికి మద్య వాగ్వాదం జరుగుతుంటే అంతలో ఓ అధికార పార్టీ నాయకుడు తన గన్‌మెన్‌తో సహా ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులను అడ్డుకున్నాడు. మేమెవరో తెలుసా...? అతను ఏమీ చేయలేదు, అతను మా వ్యక్తి వదిలే అని వాగ్వాదానికి దిగాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్

మీరు ఎవరైనా సరే సార్.... మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని "నేను నగర కార్పోరేటర్‌ను అంటూ పదవీ దుర్వినియోగం చేస్తున్న ఆ రాజకీయ నాయకుడికి" ధీటైన సమాదానం ఇచ్చారు. అతను ఏ తప్పు చేయకపోతే వదిలేస్తాం... మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నాము అని వివరణ ఇచ్చారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

ఇతను తాగకపోతే బ్రీత్ అనలైజర్‍లో ఊదడానికి ప్రాబ్లం ఏమిటని ప్రశ్నించారు. ఇలా పోలీసులు తమ విధులు నిర్వర్తించుకోవడానికి రాజకీయ నాయకుడిని బ్రతిమాలడం నవ సమాజానికి ఎంతో సిగ్గుచేటు. నలుగురైదుగురు ఉన్నత స్థాయి పోలీసు ఉద్యోగుల విధులకు ఇద్దరు నాయకులు భంగం కలిగించారు.

Trending On DriveSpark Telugu:

ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి జీతం ఏంతో తెలుసా....?

మెగాస్టార్ ఫ్యామిలీ కార్ కలెక్షన్!!

పైలట్ మరియు ఎయిర్‌హోస్టెస్ చేసే 20 చీకటి పనులు

డ్రంక్ అండ్ డ్రైవ్

చివరికి, మేము అణగారిన వర్గానికి చెందిన వారిమనే మా మీద కక్ష సాధిస్తున్నారని ఆ వ్యక్తులు పోలీసుల మీద తిరగబడ్డారు. ఓయ్ సిఐ గారు... మేము దళితులమనా... మేము తక్కువ కులస్థలుమనా మీ అరాచకం అంటూ పోలీసుల మీద చిందులేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

ఈ తతంగం మొత్తాన్ని పోలీసులు వీడియో తీసి ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేశారు. ఈ సంఘటన మీద నెటిజన్లు ఘాటుగానే స్పందించారు. తప్పు చేసి కులాన్ని అడ్డుపెట్టుకోవడమేంటని ప్రశ్నించారు.

పై ఫోటో మీద క్లిక్ చేసి వీడియో చూడగలరు. మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి....!!

English summary
Read In Telugu: Telangana police Vs telangana drunk politician
Please Wait while comments are loading...

Latest Photos