దొంగల బారి నుండి కార్లను రక్షించుకునేందుకు పది చిట్కాలు

Written By:

కారు ఓనర్లు తాము ఎంతో ఇష్టపడి ఎంచుకున్న కారును చాలా అపురూపంగా చూసుకుంటారు. కారు మీద చిన్న గీత పడితే విలవిల్లాడిపోతారు, అదే కారు దొంగతనానికి గురైతే ఇంకేమైనా ఉందా...? అయితే కారు పోయిందని కంప్లైట్ ఇవ్వడం ద్వారానో... లేదంటే ఇన్సూరెన్స్ ద్వారానో.. మళ్లీ అదే కారును దక్కించుకోవచ్చు.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

పోయిన కారుకు సంభందించిన సమాచారం పోలీసుల దగ్గర నుండి వచ్చే వరకు, ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త కారును ఇచ్చే వరకు యజమానులు వేచి ఉండరు. అసలు అలాంటి సంధర్భమే రాకుడదనుకునే వారు చాలా మంది ఉంటారు. దొంగలు బారి నుండి మీ కారును రక్షించుకునేందుకు డ్రైవ్‌స్పార్క్ కొన్ని సింపుల్ చిట్కాలను అందిస్తోంది. నేటి కథనంలోని 10 సింపుల్ చిట్కాలను పాటించి దొంగలబారి నుండి మీ కారును రక్షించుకోండి...

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

1. సురక్షితమైన ప్రదేశాల్లోనే పార్క్ చేయండి

షాపింగ్ కోసం లేదంటే ఏదైనా పని మీద కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు ఎక్కువ మంది సంచరించే ప్రాంతాల్లో లేదంటే సెక్యూరిటీ గల సెల్లార్‌లో పార్క్ చేయడం ఎంతో ఉత్తమం. జనవాసాల్లో దొంగలు కార్ల తలుపులను తెరవడానికి వెనకాడతారు.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

2. మెయింటెన్స్ మరియు క్లీనింగ్ తప్పనిసరి

మీ కారు మంచి కండీషన్‌లో లేనపుడు, శుభ్రంగా ఉంచుకోకపోయినట్లయితే, దొంగలు మీ కారును దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నపుడు రిపేరి చేస్తున్నారులే అని ఇతరులు అనుకుంటారు. అదే మీ కారు మంచి కండీషన్‌లో శుభ్రంగా ఉంచితే దొంగలు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని చుట్టుప్రక్కల ఉన్నవారు పసిగడతారు.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

3. గేర్ లాక్ చేయించండి

మీ కారుకు రహస్యంగా ఓ గేర్‌లాక్ మెకానిజమ్ ఏర్పాటు చేయించుకోండి. తద్వారా కారులోకి ప్రవేశించిన దొంగలు కారును నడపడం అసాధ్యం. కాబట్టి మీ కారు కోసం వచ్చిన దొంగలు నిరాశతో అక్కడే వదిలేసి వెళ్లిపోవడం ఖాయం.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

4. స్టీరింగ్ లాక్ చేయించుకోండి

దొంగలబారి నుండి కారును కాపాడుకోవడానికి కార్ల కంపెనీలు ఇంజన్ ఇమ్మొబిలైజర్ పరికరాన్ని అందిస్తున్నాయి. అయితే అనుభవం గడించిన దొంగలకు ఇంజన్ ఇమ్మొబిలైజర్‌ను తొలగించడం పెద్ద సంగతేం కాదు. కాబట్టి కారులో ఏ పార్టుకు ఆ పార్టుని లాక్ చేయడం ద్వారా దొంగలకు నిరాశే మిగులుతుంది. కాబట్టి ఓ మంచి స్టీరింగ్ లాక్ చేయించుకోండి.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

5. సురక్షితమైన పార్కింగ్ స్పేస్

మెట్రో సిటీల్లో నివసించే వారు, తమ కారుకు పార్కింగ్ స్పేస్ పొందడం అందని ద్రాక్షే అని చెప్పాలి. కారు కొనడానికి చూపించే ఇంట్రెస్ట్, ఆ కారును పార్క్ చేయడానికి కావాల్సిన సురక్షితమైన పార్కింగ్ స్పేస్ విషయంలో ఆసక్తి చూపరు. సురక్షితం కాని ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం ద్వారానే ఎక్కువ కార్లు చోరీకి గురవుతున్నాయి.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

6. విలువైన వస్తువులను కారులో ఉంచకండి

పార్క్ చేసి ఉంచిన కారులో కనబడే విలువైన వస్తువులను దోచుకోవడానికి దొంగలు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కుదరితే కారునే ఎత్తుకెళతారు. ఒక వేళ విలువైన వస్తువులను మీ వెంట తీసుకెళ్లడం కుదరకపోతే కారులో ఉన్న లాకర్లలో బయటకు కనబడకుండా ఉంచండి.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

7. పార్కింగ్ బ్రేక్ వేయడం మరవకండి

పార్క్ చేసి ఉంచిన ప్రదేశంలోనే కారు అద్దాలను పగలగొట్టి కారును ఎత్తుకెళ్లరు. ఎవరూ లేని ప్రదేశం వరకు కారును మెల్లగా తోసుకుంటూ వెళ్లి నకిలీ తాళాలతో కారు తలుపులు తీసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి పార్కింగ్ బ్రేక్ మరియు స్టీరింగ్ లాక్ ఉండటం ద్వారా కారును ఒక్క ఇంచు కూడా కదపలేరు.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

8. కారు లాక్ మరియు విండోలను క్లోజ్ చేయడం మరువకండి

కారును పార్కింగ్ చేసిన తరువాత కారును లాక్ చేయడం మరిచిపోతుంటారు. ఇలా చేసారంటే కార్ల దొంగలకు మీరే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఎంత చిన్న పనికైనా పార్కింగ్ చేసిన కారు విండోలను క్లోజ్ చేయడం మరియు కార్ లాక్ చేయడం మరవకండి. అయితే వేసవి కాలంలో కారు అద్దాలను స్వల్పంగా తెరవడం మంచిది.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

9. My car is protected అనే టెక్ట్స్ ఉన్న స్టిక్కర్ కారు మీద అంటించండి

కారు మీద అందరికీ కనబడే విధంగా My car is protected అనే టెక్ట్స్ ఉన్న స్టిక్కర్ అంటించడం ద్వారా, ఇలాంటి కార్లను దొంగతనం చేయడం అసాధ్యం అనే భావన దొంగల్లో కలుగుతుంది. ఈ సిస్టమ్ మీ కారులో ఉన్నా, లేకున్నా స్టిక్కర్ అంటించడం బెస్ట్.

దొంగల బారి నుండి కారును రక్షించే చిట్కాలు

10. కారు లోపల మరియు డోర్ మ్యాట్ క్రింద కారు కీస్ ఉంచే అలవాటు ఉంటే మానుకోండి

చాలా మంచి కార్లలో ఎందో ఒక ప్రదేశంలో కారు తాళాలు వదిలి వెళుతుంటారు. అయితే మీరు కారు కీస్ ఎక్కడ ఉంచుతున్నారనే విషయాన్ని అక్కడే ఉన్న ఇతరులు గుర్తిస్తుంటారు(ప్రత్యేకించి దొంగలు). వారి చేతికి తాళాలు దొరికితే మీరు దొంగలకు అవకాశమిచ్చిన వారవుతారు. కాబట్టి కారు లాక్ చేసి కీస్ మీ వెంటే తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం.

English summary
Read In Telugu: 10 Tips To Prevent Car Theft

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark