సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన టెస్లా మోడల్ ఎస్

Written By:

కార్ల మైలేజ్ గురించి చర్చించుకుంటే మహా అయితే 30కిమీలు దాటవు. కానీ కొన్ని వందల కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయనే కార్ల గురించి ఎప్పుడైనా విన్నారా...? టెస్లా కంపెనీ తమ మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కారును స్వయంగా పరీక్షించి, ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్‌తో 900కిలోమీటర్లు ప్రయాణించిందని నిరూపించింది. ఇవాళ్టి కథనంలో దీని గురించి మరింత సమాచారం.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టెస్లాది ప్రత్యేక స్థానం. ఈ తరుణంలో తనకంటూ కొన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక్క సారి ఛార్జింగ్‌తో గరిష్ట దూరం ప్రయాణించడానికి ప్రయత్నాలు చేయగా, విజయవంతంగా 900కిలోమీటర్ల మేర ప్రయాణించింది.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

సుమారుగా 24 గంటల పాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని, ముందస్తుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం టెస్లా తమ మోడల్ ఎస్ కారుతో ఈ రికార్డును సృష్టించింది.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

ప్రతి కిలోమీటర్‌కు తక్కువ పవర్ వినియోగించుకునేలో స్టీవెన్ పీటర్స్ మరియు జ్యోరి కూల్ అనే వ్యక్తులు టెస్లా మోడల్ ఎస్ పి100డి కారును డ్రైవ్ చేశారు. ఒక్కో కిలోమీటర్‌కు 88Wh పవర్ వినియోగించుకున్నట్లు తెలిపారు.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

అధిక వేగంతో ప్రయాణిస్తే ఆశించిన మైలేజ్ రాదనే సంగతి తెలిసిందే. గంటకు 40కిమీల వేగంతో ప్రయాణిస్తే, మంచి మైలేజ్ పొందడమే కాకుండా, ఇలాంటి రికార్డులను కూడా నెలకొల్పవచ్చని ఈ కారును నడిపిన డ్రైవర్లు నిరూపించారు.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

మైలేజ్ లేదా హైస్పీడ్ రికార్డులను నెలకొల్పేందుకు మలుపుల్లేని రోడ్లను ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. కానీ టెస్లా ఈ కారును అన్ని రకాల రహదారుల మీదుగా నడిపింది.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

ఈ టెస్ట్ ద్వారా విభిన్న ఉష్ణోగ్రతల వద్ద కారును ఎలా డ్రైవింగ్ చేయాలో అని తెలుసుకున్నామని డ్రైవర్లు పేర్కొన్నారు. మొత్తానికి 23 గంటల 45 నిమిషాల పాటు దాదాపు ఒక రోజు దీనిని డ్రైవ్ చేశారు.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

స్పేస్ఎక్స్ కంపెనీ సిఇఒ మరియు టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ 2017 నాటికి ఒక్కసారి ఛార్జింగ్‌తో 950కిమీల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తామని 2015 లో తెలిపాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా నిజమయ్యాయని చెప్పవచ్చు.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

గత ఏడాది టెస్లా పరీక్షించిన ఓ కారు ఒక్కసారి ఛార్జింగ్‌తో 885కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ రికార్డును తిరగరాస్తూ ఈ యేడు 900కిలోమీటర్ల దూరాన్ని సాధించింది టెస్లా.

సింగల్ ఛార్జింగ్‌తో 900కిమీలు ప్రయాణించిన కారు

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టెస్లా మంచి ఫలితాలను సాధిస్తోంది. కానీ ఇప్పుడు ఒక్కసారి ఛార్జింగ్‌తో గంటకు 800, 900కిలోమీటర్లు ప్రయాణించే కార్లను ఇంకా పరీక్షిస్తూనే ఉంది. అయితే భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ కార్లు రోడ్డెక్కడం ఖాయం.

English summary
Read In Telugu Tesla Model S Sets New Hepermiling Record Over 900km On Single Charge
Story first published: Friday, June 23, 2017, 11:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark