ఓల్డ్ ఈస్ గోల్డ్ అని నిరూపించుకున్న 1988 నాటి అంబాసిడర్

Written By:

ఇప్పట్లో అంటే ఆధునిక డిజైన్ ఫిలాసఫీలతో అనేక కార్ల తయారీ సంస్థలు కుప్పలు తెప్పలుగా కార్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఒకానొక కాలంలో అంబాసిడర్‌కు ఉన్న క్రేజే వేరు. మార్కెట్ నుండి శాశ్వతంగా అమ్మకాలకు దూరమైపోయినా.... దానిని ప్రేమించే ప్రేమికుల నుండి దూరం కాలేకపోయింది. అందుకు ఓ ఉదాహరణ నేటి కథనంలో మీకు పరిచయం చేస్తున్న 1988 నాటి అంబాసిడర్.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ఎన్ని కొత్త కార్లు వచ్చినా అంబాసిండర్ స్థానాన్ని మరేది కూడా భర్తీ చేయలేదు. తరం మారినా దీనిని ఇష్టపడేవారిలో ఏ మాత్రం మార్పు రాలేదు. హిందుస్తాన్ మోటార్స్‌కు చెందిన 1988 మోడల్ అంబాసిడర్‌ చూడండి. మళ్లీ పుట్టి ఓల్డ్ ఈస్ గోల్డ్ అని నిరూపించుకుంది.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

అంబాసిడర్ కార్లు ఇప్పుడు చూద్దాం అనుకున్నా కూడా కనబడవు, కానీ కలకత్తాలో ట్యాక్సీ రూపంలో ఇప్పటికీ బ్రతికే ఉంది ఈ అంబాసిడర్. అద్బుతమైన సస్పెన్షన్ మరియు సిటి రైడింగ్‌కు బాగా సెట్ అయిపోవ పాటు విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉండటం, ఇప్పటికీ వీటిని వదల్లేకపోతున్నారని చెప్పవచ్చు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ప్రతి అంబాసిడర్‌ అభిమాని కూడా ఎంచుకోవాలనుకునే రీతిలో తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిష్కళంకిత అంబాసిడర్ కారును తమిళనాడులోని కోయంబత్తూరు ఆధారిత కిట్ అప్ ఆటోమేటివ్ బృందం చేత మోడిఫై చేయించుకున్నాడు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

పూర్తి స్థాయిలో మోడిఫికేషన్ అనంతరం ముందు సగ భాగం భారత దేశపు అలనాటికి ఆటోమోటివ్ పరిశ్రమను మరియు వెనుక సగ భాగం ప్రీమియర్ పద్మినీని తలపిస్తోంది.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ఇప్పటి ఆధునిక డిజైన్ ఫిలాసఫీలకు గురైన కార్లతో పోల్చుకుంటే కార్లన్నింటికి అంబాసిడర్ రారాజు అని చెప్పాలి. బోలుగా ఉన్న క్యాబిన్, సోఫా తరహాలో ఉన్న వెనుక సీటు, అన్నింటికన్నా ధృడమైన శరీరా నిర్మాణం వంటి గుణాలకు ఇప్పటికీ భారీ అభిమానులున్నారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

తుప్పుపట్టిన దానిని అలాగే వదిలేయకుండా ఓ అంబాసిడర్ ఓనర్ ఇదిగో ఇలా మోడిఫై చేయించుకున్నాడు. శరీర బాహ్యభాగాలన్నింటిని పూర్తిగా స్టెల్త్ ఫ్రాజెన్ మిడ్‌నైట్ బ్లాక్ పెయింట్ చేసారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

చక్రాలకు కూడా నల్లటి పెయింట్‌ను అందించి, నాలుగు చక్రాలకు కూడా పాత కాలం పద్దతిలో గుండ్రటి కంచాలను చక్రాలకు మధ్యలో అందించి ఈ మోడిఫైడ్ అంబాసిడర్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ఎక్ట్సీరియర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ హెచ్‌ఎమ్ అంబాసిడర్ ఇంటీరియర్‌ను మోడిఫై చేశారు. తాన్ తోలు (లెథర్)తో సీట్లు, డోర్ ప్యానల్స్ లోపలి వైపును అలంకరించారు. డ్యాష్ బోర్డ్ మొత్తాన్ని తాన్ తోలు రంగులోకి మార్చేసారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

అంబాసిడర్ క్యాబిన్ ఇంటీరియర్‌లోని అప్‌హోల్‌స్ట్రేని నల్లటి ఫ్యాబ్రిక్‌తో తీర్చిదిద్దారు. క్యాబిన్ పై భాగంలో మొత్తం ఆరు ఎల్ఇడి లైట్లను ఇముడింపజేశారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ప్రొడక్షన్ ప్లాంటులో తయారైన కారుకు ఏ మాత్రం తీసుపోకుండా ఈ పురాతణ అంబాసిడర్‌ను మోడిఫై చేసారు. ఒక అంగుళం కూడా వదలకుండా వీలైనన్ని చోట్ల అసలైన రూపానికి ఆటంకం కలగకుండా కిట్ అప్ ఆటోమోటివ్ బృందం చేసిన మోడిఫికేషన్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

నూతన హెడ్ లైట్లు, పార్కింగ్, ఇండికేటింగ్ లైట్లతో పాటు కారులోని మొత్తం ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను పూర్తిగా ఓవర్‌హాలింగ్ చేశారు.

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా ఇందులో ఉన్న అదే 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. (హిందుస్తాన్ మోటార్స్ ఈ పెట్రోల్ ఇంజన్‌ను ఇసుజు మోటార్స్ నుండి సేకరించింది).

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

మీ టియువి300 ని కోటి రుపాయల విలువైన గ్రాండ్ చిరోకీ తరహాలో మార్చుకోండి...

సుమారుగా 80 లక్షలు విలువైన జీపు వాహనాన్ని పోలి ఉండేవిధంగా కేవలం రూ. 1.50 లక్షలతో టియువి300 ను మోడిఫై చేసారు. పూర్తి వివరాలు....

హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్

కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!

ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా కు కారు కొనమని సలహా ఇచ్చాడు.... అయితే దిగ్గజ వ్యాపారవేత్త ఏకంగా ఆ కార్లు తయారు చేసే కంపెనీనే కొనేశాడు.

 
English summary
This impeccably restored HM Ambassador proves that old is gold
Story first published: Saturday, January 28, 2017, 15:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos