విజయవాడలో ఘోర బస్సు ప్రమాదం

Written By:

విజయవాడలో బస్సు మీదకు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఏపిఎస్ఆర్‌టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది.

విజయవాడ బస్సు ప్రమాదం

రాజధానిలో ఓ ఆర్‌టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనాదారులను తొక్కించుకుంటూ వెళ్లింది. ఈ ఘోర ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Recommended Video - Watch Now!
[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
విజయవాడ బస్సు ప్రమాదం

బస్సు వాంబే కాలనీ మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు వచ్చే మార్గంలో సరిగ్గా అజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుర్షిద్(32), అశ్రత్(12) మరణించగా, మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

విజయవాడ బస్సు ప్రమాదం

ఏపిఎస్ ఆర్‌టిసికి చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా ఉన్న రిక్షా మరియు టూ వీలర్లను ఎక్కించుకుంటూ ముందున్న టిప్పర్‌ను ఢీకొని ఆగిపోయింది.

విజయవాడ బస్సు ప్రమాదం

ఈ రోడ్డు చాలా పాతది మరియు రద్దీతో కూడుకున్నది కావడంతో బస్సులు వెళ్లడం అంత సురక్షితం కాదు, అయినప్పటికీ బస్సులు ఇదే మార్గంలో వెళుతున్నాయని పోలీసులు తెలిపారు.

బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని ముందే పసిగట్టే చిట్కాలు

బ్రేక్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలా...? మార్చకపోతే ఏమవుతుంది....?

విజయవాడ బస్సు ప్రమాదం

కుర్దిష్ మరియు అశ్రిత్ సిటీలోని తమ బంధువుల ఇంటికి వెళుతుంటే అకాల మృత్యువు వారిద్దరినీ తీసుకెళ్లింది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే బాగుటుంది.

ప్రమాదం జరిగిన తీరును అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజిని వీడియోలో చూడగలరు.

English summary
Read In Telugu: Three killed as APSRTC bus runs amok in Vijayawada
Story first published: Friday, October 27, 2017, 20:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark