అక్టోబర్ 2017లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు

భారత ఆటోమొబైల్ తయారీగదారుల సంఘం(SIAM) గణాంకాల ప్రకారం, గత అక్టోబర్ 2017 సేల్స్ పరిశీలిస్తే, టాప్ 10 జాబితాలో ఆరు కార్లు మారుతివే ఉన్నాయి.

By Anil

ఇండియాలో ప్యాసింజర్ కార్ల కొనుగోలుదారుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కస్టమర్ల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా ఎన్నో కొత్త మోడళ్లు విడుదలవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని కార్లు మార్కెట్ లీడర్ మారుతి సుజుకిను ఎదుర్కోలేక చతికిలపడిపోతుంటే... మరికొన్ని కార్లు మారుతికి సరాసరి పోటీనిస్తున్నాయి.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

భారత ఆటోమొబైల్ తయారీగదారుల సంఘం(SIAM) గణాంకాల ప్రకారం, గత అక్టోబర్ 2017 సేల్స్ పరిశీలిస్తే, టాప్ 10 జాబితాలో ఆరు కార్లు మారుతివే ఉన్నాయి. మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో వచ్చిన మోడళ్లు కూడా ఇప్పుడు టాప్ 10 కార్ల లిస్టులో చేరిపోయాయి. మరి గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆ పది కార్లు ఏవో చూద్దాం రండి.

Recommended Video

[Telugu] Suzuki Intruder 150 Launched In India
అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

10. టాటా టియాగో

టాటా మోటార్స్ కొన్ని సంవత్సరాల తరువాత ఈ జాబితాలోకి అడుగుపెట్టింది. పేరుకు ఇండియన్ కంపెనీనే అయినా టాటాకు ఇప్పటి వరకు భారీ సంఖ్యలో సేల్స్ సాధించి పెట్టే మోడల్ ఒకటి కూడా రాలేదు. అయితే, చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేసి భారీ విజయాన్ని అందుకుంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

టాటా ఈ మధ్యనే లక్ష టియాగో కార్ల ప్రొడక్షన్ మైలురాయిని చేధించినందుకు సనంద్ ప్రొడక్షన్ ప్లాంటులో సెలబ్రేషన్ నిర్వహించింది. అత్యధికంగా వేగంగా అమ్ముడవుతున్న టాటా ప్యాసింజర్ కారు టియాగో గడిచిన అక్టోబరు 2017 లో 6,990 యూనిట్ల సేల్స్ సాధించింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

09. రెనో క్విడ్

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారుతి ఆల్టోకు పోటీనిస్తూ ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో 2015 లో క్విడ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

రెనోకు డీలర్‌షిప్ నెట్‌వర్క్ తక్కువగానే ఉన్నప్పటికీ ఆల్టో సేల్స్‌ను క్విడ్ రూపంలో తినేయడం మొదలు పెట్టింది. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో 9 వ స్థానంలో నిలిచిన రెనో క్విడ్ గత అక్టోబరులో 8,136 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

08. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి తొలి కారును పరిచయం చేసిన కంపెనీ దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్. తొలుత ఐ20 పేరుతో పరిచయం చేసి, తరువాత ప్రీమియమ్ డిజైన్ మరియు ఫీచర్లను అందించి ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

గడిచిన అక్టోబరు 2017 లో దేశవ్యాప్తంగా 9,484 యూనిట్ల హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్లు అమ్ముడయ్యాయి. ఇదే సెగ్మెంట్లో ఉన్న మారుతి బాలెనో మరియు హోండా జాజ్ కార్లకు ఎలైట్ ఐ20 ధీటైన పోటీనిస్తూ నిలకడైన ఫలితాలు సాధిస్తోంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

07. మారుతి సుజుతి స్విఫ్ట్

భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరుపొందిన మారుతి స్విఫ్ట్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం విపణిలో ఉన్న స్విఫ్ట్‌కు ఐదేళ్లు పూర్తయ్యాయి. డిజైన్, ఇంజన్, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయకపోయినా ఐదేళ్లపాటు ప్రతి నెలలా మారుతికి అత్యుత్తమ ఫలితాలు సాధించిపెట్టింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

వచ్చే ఏడాది కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుత స్విఫ్ట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ప్రతి నెలా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో తొలి మూడు స్థానాలలో నిలిచే స్విఫ్ట్ ఇప్పుడు 12,057 యూనిట్ల సేల్స్‌తో 7వ స్థానానికి పరిమితమైంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

06. మారుతి సుజుకి సెలెరియో

ఆల్టో మరియు స్విఫ్ట్ మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేస్తూ మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును పరిచయం చేసింది. తొలుత పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో పరిచయమైనప్పటికీ, ఇప్పుడు కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

గడిచిన అక్టోబర్ 2017లో మారుతి సుజుకి సెలెరియో 12,209 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. సెలెరియో ధరలో శ్రేణిలో ఎన్నో కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడంతో సెలెరియో సేల్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా ధరకు తగ్గ విలువలతో పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లో లభిస్తున్న టాటా టియాగో.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

05. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

టాల్ బాయ్ డిజైన్‌లో ఉన్న వ్యాగన్ఆర్‌ కారుకు ఇప్పటి వరకు పోటీ అనేదే రాలేదు. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ దీని సొంతం కావడంతో కుటుంబ తరహా అవసరాలకు అత్యధికంగా ఎంచుకుంటున్నారు.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

అక్టోబరు 2017 లో దేశవ్యాప్తంగా 13,043 యూనిట్ల మారుతి వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారును విడుదల చేసి సుమారుగా 15 ఏళ్లు దాటిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో వ్యాగన్ఆర్ స్థానం దక్కించుకుంటూనే ఉంది. ఇప్పటి వరకు 20 లక్షల వ్యాగన్ఆర్ కార్లు ఇండియన్ రోడ్ల మీద ఉన్నాయి.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

04. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ ఐ10 కారుకు కొనసాగింపుగా తీసుకొచ్చిన గ్రాండ్ ఐ10 బాగా విజయవంతమైంది. స్విఫ్ట్, సెలెరియో, వ్యాగన్ఆర్ కార్లను వెనక్కి నెట్టి వాటి ముందు స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

భద్రత, ధరకు విలువలు, ప్రపంచ స్థాయి నిర్మాణం, ప్రీమియమ్ ఇంటీరియర్ మరియు ఫీచర్లు దీని సక్సెస్‌కు ప్రదాన కారణాలుగా చెప్పుకోవచ్చు. గడిచిన అక్టోబరు 2017లో దేశవ్యాప్తంగా 14,417 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుని టాప్ 10 జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

03. మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి 2015లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారును టార్గెట్ చేస్తూ బాలెనో కారును విడుదల చేసింది. అనతి కాలంలో బాలెనోను మంచి ఆదరణ లభించింది. దీంతో ఆ తరువాత మోస్ట్ పవర్ ఫుల్ వెర్ష్ బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

ఐ20 మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనిస్తున్న బాలెనో గత అక్టోబరులో 14,538 యూనిట్ల సేల్స్ సాధించి 3 స్థానంలో నిలిచింది. డిజైన్, లగ్జరీ ఫీల్ కలిగించే ఇంటీరియర్ మరియు అధునాతన ఫీచర్లు బాలెనోలో ప్రత్యేకంగా ఉన్నాయి.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

02. మారుతి సుజుకి ఆల్టో

భారతదేశపు బెస్ట్ రెండవ బెస్ట్ సెల్లింగ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మారుతి ఆల్టో కొన్ని సంవత్సరాలు పాటు తొలి స్థానంలో నిలిచినప్పటికీ, ఇటీవల విడుదలైన న్యూ డిజైర్ సేల్స్ కారణంగా రెండవ స్థానానికి పరిమితమైంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

800 పేరుతో పరిచయమై ఆల్టో పేరుతో కొనసాగుతున్న మారుతి తొలి కారు ఇది. ప్రతి మధ్య తరగతి కుటుంబం యొక్క ఫేవరెట్ కారుగా నిలిచిన ఆల్టో అక్టోబరు 2017లో 19,947 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

01. మారుతి సుజుకి డిజైర్

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు కొనసాగింపుగా మారుతి అభివృద్ది చేసిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారు స్విఫ్ట్ కన్నా మంచి ఆదరణ పొందింది. మారుతి ఇటీవల విడుదల చేసిన న్యూ డిజైర్‌కు భారీ డిమాండ్ లభించింది. ఈ కారణంగానే భారీ సేల్స్‌తో మొదటి స్థానంలో ఉన్న ఆల్టోను వెనక్కి నెట్టేసింది.

అక్టోబర్ 2017 లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

అక్టోబరు 2017లో 20,610 న్యూ డిజైర్ కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. సరికొత్త ఇంజన్ వేరియంట్లు, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్, ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, మరియు ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఇంటీరియర్ న్యూ డిజైన్ సొంతం. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఇందులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 10 Selling Cars In October 2017 In India
Story first published: Thursday, November 16, 2017, 15:30 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X