జనవరి 2017 కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా ?

Written By:

ఇండియన్ మార్కెట్లో కార్ల తయారీ సంస్థలకు కొదవే లేదు. అత్యధికంగా అమ్మకాలు సాగించే టాప్ 10 కార్ల తయారీ జాబితాలో తయారీదారుడికి రెండు చెప్పున ఈ జాతిలోకి వచ్చినా మొత్తం ఐదు విభిన్న కార్ల తయారీ సంస్థలు ఉండాల్సింది. కాని ఇందుకు భిన్నంగా మొత్తం పదింటిలో మారుతి సుజుకికి చెందినవే 8 కార్లు ఉన్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

మొత్తం ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి 50 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది . 2017 జనవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

10. మారుతి సుజుకి ఓమిని

10. మారుతి సుజుకి ఓమిని

చాలా కాలం తరువాత మారుతి సుజుకి సంస్థకు చెందిన అతి చిన్న ఉత్పత్తి ఓమిని టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో 10 వ స్థానంలో నిలిచింది. చాల కాలం తరువాతమ ఓమిన్ టాప్ 10 జాబితాలోకి మళ్లీ ప్రవేశించింది. గడిచిన జనవరి 2017 లో 8,723 యూనిట్ల ఓమిని వాహనాలు అమ్ముడుపోయాయి.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

మారుతి ప్రస్తుతం ప్యాసింజర్ మరియు కార్గో తరహాలో ఓమిని వాహనాన్ని అందుబాటులో ఉంచింది. ఇందులో 796సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 34.2బిహెచ్‌పి పవర్ మరియు 59ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

9. మారుతి సుజుకి వితారా బ్రిజా

9. మారుతి సుజుకి వితారా బ్రిజా

ప్రస్తుతం ఇండియన్ ప్యాసింజర్ కార్ల విభాగంలోని కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలు బాగా జోరందుకున్నాయి. అందులో సెగ్మెంట్ లీడర్‌గా నిలిచిన వితారా బ్రిజాకు నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం లేకుండా భారీ అమ్మకాలు నమోదు చేసుకుంది. గడిచిన జనవరి 2017 లో 8,923 యూనిట్ల అమ్ముడయ్యాయి.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. బాక్సీ ఆకారంలో ఉన్న ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

8. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

8. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

జనవరి 2017 లో టాప్ 10 జాబితాలో మరో ఎకైక సంస్థ హ్యుందాయ్ మాత్రమే ఇందులో చోటు సాధించింది. హ్యుందాయ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 10,010 యూనిట్ల అమ్మకాలు జరిపి ఈ జాబితాలో 8 వ స్థానంలో నిలిచింది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

ప్రస్తుతం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 1.2-లీటర్ మరియు 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్లు కలవు. వీటిలో పెట్రోల్ ఆప్షన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు డీజల్ ఆప్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో అందుబాటులో ఉన్నాయి.

7. మారుతి సుజుకి బాలెనో

7. మారుతి సుజుకి బాలెనో

టాప్ 10 జాబితాలోకి చేరిన మరో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి బాలెనో. గడిచిన జనవరి 2017 మారుతి ఏకంగా 10,470 యూనిట్ల విక్రయాలు చేపట్టింది. ఈ సెగ్మెంట్లో ప్రత్యక్ష పోటీగా ఉన్న ఐ20 కన్నా 460 యూనిట్ల అమ్మకాలు ఎక్కువగా చేపట్టింది. గత ఏడాదితో పోల్చుకుంటే విక్రయాల్లో 36 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

కేవలం నెక్సా విక్రయ కేంద్రాల ద్వారా మాత్రమే లభించే ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం కలిగి ఉంది. అదే విధంగా 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.

6. మారుతి సుజుకి సెలెరియో

6. మారుతి సుజుకి సెలెరియో

భారతీయులకు మొట్టమొదటి సారిగా ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసిన కారు మారుతి సుజుకి సెలెరియో. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో మంచి ఫలితాలను సాధిస్తున్న సెలెరియో గడిచిన జనవరి 2017లో 10,870 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2016 తో పోల్చుకుంటే 52 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

సాంకేతికంగా ఇందులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు. పెట్రోల్ వేరియంట్ 998సీసీ సామర్థ్యంతో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభిస్తుంది. ఇక ఇందులోని 793సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్‌ను భవిష్యత్తులో తొలగించనుంది. సెలెరియో పెట్రోల్‌తో పాటు సిఎన్‌జి వేరియంట్లో కూడా లభిస్తోంది.

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

గడిచిన జనవరి 2017 లో అత్యుత్తమ అమ్మకాలు సాగించిన వాటిలో హ్యుందాయ్ నుండి మరో ఉత్పత్తి గ్రాండ్ ఐ10 ఐదవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ గ్రాండ్ విడుదలయిన సమయం నుండి నిలకడగా ఫలితాలను సాధిస్తూనే ఉన్నాయి. గడిచిన జనవరి 2017 లో 13,010 యూనిట్ల అమ్ముడయ్యాయి.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 ను ఫేస్‌లిప్ట్ రూపంలో 4.58 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. సరికొత్త గ్రాండ్ ఐ10 వేరియంట్ 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ డీజల్ వేరియంట్లో అదే విధంగా డీజల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

04. మారుతి సుజుకి స్విఫ్ట్

04. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి చరిత్రలో భారీ విజయాన్ని అందుకున్న మోడళ్లలో స్విప్ట్ ఒకటి. గడిచిన జనవరి లో 3 శాతం వృద్దిని సాధించి టాప్ 10 జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది. మారుతి జనవరిలో మొత్తం 14,540 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. మరియు అన్ని వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలిగి ఉన్నాయి.

3. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

3. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి లైనప్‌లో ఎవర్‌గ్రీన్ మోడల్‌గా కొనసాగుతున్న వాటిలో వ్యాగన్ఆర్ ఒకటి. కారు పాత మోడల్ అయినప్పటికీ అమ్మకాల్లో వృద్ది ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. గడిచిన జనవరి 2017 లో 14,900 యూనిట్లు విక్రయించబడ్డాయి. గతంతో పోల్చుకుంటే ఏకంగా 17 శాతం వృద్ది నమోదైంది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

వ్యాగన్ఆర్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభించును. ఇందులోని 1.0-లీటర్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ ఫ్లాట్‌ఫామ్ మీద మారుతి అభివృద్ది చేసిన డిజైర్ ఇప్పుడు స్విప్ట్ కన్న భారీ విజయాన్ని అందుకుంది. గడిచిన జనవరి 2017 లో 18,000 యూనిట్ల అమ్ముడుపోయాయి. గతంతో పోల్చుకుంటే మూడు శాతం వృద్దిని సాధించిన ఇది టాప్ 10 జాబితాలో 2 స్థానంలో వెలుగొందుతోంది.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

ప్రస్తుతం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అన్ని ఇంజన్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఈ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ వేరియంట్లో 4-మ్యాన్యువల్ మరియు డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆల్టో కారు స్థానాన్ని మరే కారు, మరే సంస్థ కూడా చెరిపివేయలేకపోయింది. మారుతి సుజుకి ఇండియాకు భారీ విజయాన్ని సాధించిన పెట్టిన ఆల్టో 1.0-లీటర్ మరియు 0.8-లీటర్ సామర్థ్యం ఉన్న రెండు పెట్రోల్ వేరియంట్లలో లభించును.

జనవరి 2017 లో కార్ల అమ్మకాలు

గడిచిన జనవరి 2017 లో దేశవ్యాప్తంగా మొత్తం 22,990 యూనిట్ల కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. మునుపటి ఏడాది ఇదే మాసంతో పోల్చుకుంటే విక్రయాల్లో 7 శాతం వృద్ది నమోదైంది. 1.0-లీటర్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

 
English summary
Top 10 Selling Cars In January 2017 — Maruti’s Old Brand Makes A Comeback
Story first published: Tuesday, February 7, 2017, 18:09 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark