ఆ కారు దెబ్బకు గగ్గోలుపెడుతున్న ఆల్టో మరియు క్విడ్

Written By:

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లోని ఆల్టో మరియు క్విడ్ ఒకదానికొకటి పోటీపడుతూ వచ్చాయి. అయితే గత జూన్ 2017 విక్రయాల్లో క్విడ్ భారీ పతనాన్ని చవిచూసింది. అయితే ఇందుకు ఆల్టో ఏ మాత్రం కారణం కాదు. ఎందుకంటే క్విడ్ సేల్స్ టాటా టియాగో తినేసింది. మార్కెట్ వర్గాలన్నీ ఆశ్చర్యపరిచే రీతిలో టియాగో సేల్స్ నమోదయ్యాయి.

టాటా టియాగో సేల్స్

భారత ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి అమలు విషయాన్ని జూన్ లోనే లేవనెత్తడంతో, జూన్ మొత్తం కార్ల విక్రయాలు ధరల ఆటు పోట్ల మధ్యే సాగాయి. జిఎస్‌టి అయోమయంతో అనేక మంది జిఎస్‌టి అమలు కోసం వేచి చూడటంతో కొన్ని సంస్థలకు ఆశించిన మేర విక్రయాలు జరగలేదు.

టాటా టియాగో సేల్స్

ఇందులో జూన్ విక్రయాలు చూసుకుంటే, మారుతి సుజుతి, హోండా కార్స్ ఇండియా అమ్మకాల్లో వ్యతిరేక వృద్దిని నమోదు చేసుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, 'జిఎస్‌టి అమలయ్యాక కార్ల ధరలు భారీగా దిగివస్తాయని కొనుగోలు దారులు సంయమనం పాటించడం' అని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

టాటా టియాగో సేల్స్

అయితే గత నెల మొత్తం సేల్స్ వివరాలను పరిశీలిస్తే, రెనో క్విడ్ విక్రయాలు భారీగా పడిపోయాయి. 43 శాతం వృద్దిని కోల్పోయి కేవలం 5,439 యూనిట్ల క్విడ్ కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అయితే అనుకోకుండా టాటా టియాగో 5,438 యూనిట్ల విక్రయాలు జరిపింది, క్విడ్ కన్నా ఒక్క యూనిట్ మాత్రమే తక్కువ.

టాటా టియాగో సేల్స్

మొదటిసారి కారును ఎంచుకునే వారు చిన్న హ్యాచ్‌బ్యాక్ కాకుండా టియాగో వంటి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఎంచుకోవడం ఇందుకు మరో కారణం. ఏదేమయినప్పటికీ టాటా మోటార్స్ తలరాతను టియాగో పూర్తిగా చెరిపేస్తోంది. ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో టాటా మోటార్స్‌కు ఒక కొత్త రూపాన్ని తీసుకొస్తున్న టియాగో ఈ మధ్యనే లక్ష యూనిట్ల సేల్స్ మైలు రాయిని దాటింది.

టాటా టియాగో సేల్స్

టాప్ 10 సెల్లింగ్ కార్ల జాబితాలో జూన్ 2017 గణాంకాల ప్రకారం చూసుకుంటే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మూడవ స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది జూన్‌తో పోల్చుకుంటే తొమ్మిదవ స్థానంలో ఉన్న బాలెనో ఈ ఏడు ఐదవ స్థానానికి చేరుకుంది. 10 నుండి 7 వ స్థానానికి చేరింది వితారా బ్రిజా. అయితే ఆల్టో మరియు క్రెటా యధావిధిగా అవే స్థానాల్లో ఉన్నాయి.

టాటా టియాగో సేల్స్

దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో టాటా టియాగో భారీ వృద్దిని నమోదు చేసుకుంది. ధరకు తగ్గ విలువలతో ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో డిజైన్ చేయబడటంతో దాదాపు అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది. టియాగో పరంపర ఇలాగే కొనసాగనుంది.

English summary
Read In Telugu: Renault Kwid Has A New Rival, And It's Not The Alto
Story first published: Saturday, July 8, 2017, 15:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark