హోండా బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఉన్న సిటి సెడాన్‌ను కూల్చేసిన డబ్ల్యూఆర్-వి

Written By:

హోండా ఇండియా లైనప్‌లో సిటి సెడాన్ కారు హోండాకు ఎంతో కాలంగా బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉండేది. అయితే హోండా చివరగా విపణిలోకి ప్రవేశపెట్టిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ విక్రయాలు సిటి కారును అధిగమించేసి, హోండా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

సేల్స్ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన జూలై 2017 లో హోండా కార్స్ ఇండియా దేశవ్యాప్తంగా 17,085 యూనిట్ల కార్లను విక్రయించింది. జూలై 2016 విక్రయాలతో పోల్చుకుంటే జూలై 2017లో 3,052 యూనిట్లు అధికంగా అమ్ముడయ్యి 22 శాతం వృద్ది నమోదయ్యింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

ఈ సేల్స్ రిపోర్ట్స్‌లో ఉన్న మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ? హోండా ఇండియా లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచే సిటి సెడాన్ ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. దీనికి కారణం సిటి కన్నా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ సేల్స్ అధికంగా నమోదయ్యాయి.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

జూలై 2017 లో దేశవ్యాప్తంగా 4,854 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇదే కాలంలో 4,894 యూనిట్ల డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. జూలై 1, 2017 నుండి నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి అమలు కావడంతో, జిఎస్‌టి ప్రతి ఫలాలను ప్రకటించడం జరిగింది దీంతో విక్రయాల్లో సానుకూల వృద్ది సాధ్యమైందని హోండా తెలిపింది.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

భవిష్యత్తులో మార్కెట్ అవకాశాలు గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ యోఇచిరో యుఎనో మాట్లాడుతూ, సానుకూల వర్షాభావ పరిస్థితులు మరియు అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆగష్టు నుండి విక్రయాలు మరింత పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేసాడు."

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

"డబ్ల్యూఆర్-వి మీద వెయిటింగ్ పీరియడ్ తగ్గించి కస్టమర్లకు త్వరగా డెలివరీ ఇచ్చే ఉద్దేశ్యంతో గత నెలలోనే ప్రొడక్షన్‌ను పెంచినట్లు" ఆయన చెప్పుకొచ్చాడు. గత ఆర్థిక సంవత్సరంలో హోండా 45,880 కార్లను విక్రయించగా, ఏప్రిల్-జూలై 2017 ఆర్థిక సంవత్సరంలో 55,647 యూనిట్లను విక్రయించి 21 శాతం వృద్దిని సాధించింది.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

జూలై 2017 లో హోండా కార్ల విక్రయాల్లో తొలి రెండు స్థానాల్లో వరుసగా డబ్ల్యూఆర్-వి మరియు సిటి సెడాన్ కార్లు ఉన్నాయి. వీటి తరువాత 2,971 యూనిట్లతో జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మూడవ స్థానంలో, 2,913 యూనిట్ల సేల్స్‌తో అమేజ్ కాంపాక్ట్ సెడాన్ నాలుగవ స్థానంలో నిలిచాయి.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

హోండా బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ 1,042 యూనిట్లతో ఐదవ స్థానంలో, బ్రియో హ్యాచ్‌బ్యాక్ 396 యూనిట్లతో ఆరవ స్థానంలో మరియు సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీ 15 యూనిట్లతో ఏడవ స్థానంలో నిలిచాయి.

సిటి సెడాన్‌నువెనక్కి నెట్టిన డబ్ల్యూఆర్-వి

హోండా కార్స్ ఇండియా బ్రియో, జాజ్, అమేజ్, సిటి, డబ్ల్యూఆర్-వి, బిఆర్-వి మరియు సిఆర్-వి కార్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. అయితే అకార్డ్ హైబ్రిడ్ కారును దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. జిఎస్‌టి అమలుతో హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో ఒక్క అకార్డ్ హైబ్రిడ్ కారు కూడా అమ్ముడుపోలేదు.

English summary
Read In Telugu: Top-Selling Honda Car In India In July — And It's Not The Honda City
Story first published: Thursday, August 3, 2017, 18:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark