భారీ ప్రణాళికతో సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ సిద్దం చేస్తున్న టయోటా

Written By:

టయోటా మోటార్స్ ఇండియాలో శక్తివంతమైన వాహన తయారీ సంస్థగా ఎదిగే మరో ఎస్‌యూవీ తీసుకొస్తోంది. ఇప్పటికే మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న టయోటా ఇప్పుడు నూతన డిజైన్ శైలిలో ఉన్న సిహెచ్-ఆర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ధర విషయానికి వస్తే దీని అత్యంత అగ్రెసివ్ డిజైన్‌కు అనుగుణంగా ధరను నిర్ణయించనుంది.

ఆటోకార్ ఇండియా ప్రకటించిన కథనం మేరకు జపాన్‌లో విడుదలైన ఈ వాహనాన్ని హైబ్రిడ్ పరిజ్ఞానంతో ఇండియాలోకి విడుదల చేయడానికి టయోటా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

క్రెటా ఎస్‌యూవీ శ్రేణి లోని టాప్ ఎండ్ మరియు టక్సన్ ఎస్‌యువిలోని ఎంట్రీ లెవల్ వేరియంట్ ను పోలిన ధరలతో వచ్చే అవకాశం ఉంది. సుమారుగా రూ. 15 లక్షల ప్రారంభ ధరతో రానున్నట్లు సమాచారం.

సి-హెచ్ఆర్ అనగా కూపే హై రైడర్ అని అర్థం. టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ వేదిక మీద దీనిని అభివృద్ది చేయడం జరిగింది. ఇదే వేదిక ఆధారంగా సరికొత్త టయోటా ప్రియస్ ను డెవలప్ చేయడం జరుగుతోంది.

టయోటా యొక్క టిఎన్‌జిఎ నిర్మాణ వేదిక మీద అభివృద్ది చేయబడిన మొదటి వాహనం కూడా సి-హెచ్ఆర్. కాబట్టి టయోటా యొక్క నూతన నిర్మాణ వేదిక డిజైన్ పరంగా అవలంభిస్తున్న అంశాలు ఇందులో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. టయోటా లైనప్‌లోని ఇతర వాహనాలకు ఇది చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు.

సరికొత్త సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అవి, 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ మరియు 1.5, 1.8 మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌లు.

వీటిలో 1.8-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో లభిస్తోంది. సి-హెచ్ఆర్ లోని నాలుగు ఇంజన్‌లకు కూడా 6-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

సి-హెచ్ఆర్ ఎస్‌యూవీలో డీజల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవడం కాస్త నిరాశన మిగిల్చే అవకాశం ఉంది. సి-హెచ్ఆర్ యొక్క అద్బుతమైన ఎక్ట్సీరియర్ డిజైన్ ఇండియాలో ఉన్న యువతను టార్గెట్ చేయనుంది.

సి-హెచ్ఆర్ వాహనం విపణిలోకి ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదలవుతున్నప్పటికీ దీనికి యొక్క అద్బుతమైన అధునాతన ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు భవిష్యత్తును సూచించే ఇంటీరియర్ డిజైన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టయోటా లైనప్‌లో ఉన్న మిగతా అన్ని వాహనాలకు చాలా భిన్నంగా ఉంది.

కూపే తరహాలో ఉన్న ఈ సి-హెచ్ఆర్ ఎస్‌యువి టయోటా ఇండియాకు మంచి అమ్మకాలను సాధించపెట్టనుంది.

హ్యాచ్‌బ్యాక్ కారును కోనే ఆలోచనలో ఉన్నారా...? మారుతి సుజుకి అంతర్జాతీయ శైలిలో క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫీచర్లు మరియు ఎంపిక చేసుకోదగ్గ ఆప్షన్‌లతో పరిచయం చేసిన ఇగ్నిస్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు.

 

English summary
Stunning Toyota C-HR Set To Enter India — Is This Your Future SUV?
Story first published: Friday, February 3, 2017, 13:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos