ప్రపంచ వ్యాప్తంగా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్: మళ్లీ ఎయిర్ బ్యాగులతోనే సమస్య

Written By:

టయోటా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 2.9 మిలియన్ల కరోలా ఆల్టిస్ కార్లను రీకాల్ చేసింది. జపాన్, చైనా మరియు ఇతర రీజియన్లతో పాటు ఇండియాలో కూడా పెద్ద ఎత్తున కరోలా ఆల్టిస్ సెడాన్ కారును వెనక్కి పిలిచింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

జపాన్‌లో మాత్రమే సుమారుగా 1.16 మిలియన్ కార్లను వెనక్కి కపిలిచినట్లు సమాచారం. మధ్య ఆసియాతో పాటు ఓసియేనియా వంటి దేశాలలో కూడా భారీ ఎత్తున్న రీకాల్‌కు గురైనట్లు సమాచారం.

టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

టయోటా తమ కరోలా ఆల్టిస్ సెడాన్ కార్లలో వినియోగించిన టకాటా సంస్థ యొక్క ఎయిర్ బ్యాగులలో సమస్య కారణంగా రీకాల్ చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంలో కీలకంగా వ్యవహరించే ఇన్‌ఫ్లాయేటర్స్‌లో లోపాన్ని గుర్తించినట్లు తెలిసింది.

టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

దేశీయంగా రీకాల్‌కు గురైన కార్ల విషయానికి వస్తే, 2010 మరియు 2012 మధ్య ఉత్పత్తి అయిన వాటిలో సుమారుగా 23,000 యూనిట్ల కరోలా ఆల్టిస్ కార్ల వరకు ఉన్నట్లు తెలిసింది. వినియోగదారులు తమ కార్లలో ఈ సమస్యను గుర్తించినట్లయితే సంభందిత డీలర్ల వద్ద ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

దిగ్గజ ఎయిర్ బ్యాగుల సంస్థ టకాటా అందించిన ఎయిర్ బ్యాగులలో అమ్మోనియం నైట్రేట్ ను ఎక్కువగా వినియోగించినట్లు తెలిసింది. ఈ రసాయనం ఎక్కువగా వినియోగించడం ద్వారా ఎయిర్ బ్యాగులు పనితీరుకు అంతగా ఉండదు.

టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

ఇప్పటి వరకు సుమారుగా 100 మిలియన్లకు పైగా ఎయిర్ బ్యాగులు మార్కెట్లోకి వచ్చాయి. కేవలం టయోటా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కార్ల తయారీ సంస్థలు తమ కార్లలో అందించే ఎయిర్ బ్యాగులతో ఇలాంటి సమస్యలే పునరావృతం అవుతున్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్ భారీ రీకాల్

కాబట్టి, మీ వద్ద 2010 నుండి 2012 తయారైన టయోటా కరోలా ఆల్టిస్ కార్లు ఉంటే ఓ సారి సమీప టయోటా డీలర్ వద్ద చెక్ చేసుకోండి.

English summary
Toyota Corolla Altis Recalled In India — Is Yours On The List?
Story first published: Saturday, April 1, 2017, 17:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark