ఈ రెండు కార్లు అత్యంత సురక్షితమైనవి

Written By:

టయోటా కార్లు ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన కార్లుగా పేరుగాంచాయి. బుల్లెట్ ప్రూఫ్ లాంటి సామర్థ్యం మరియు అత్యుత్తమ నిర్మాణ విలువలతో పాటు ప్రమాదం జరిగినపుడు కూడా ఇవి సురక్షితమని పలుమార్లు నిరూపించబడ్డాయి.

అయితే తమ కార్లలో ఉన్న సేఫ్టీ గురించి కొనుగోలుదారుల్లో అవగాహన తెచ్చేందుకు టయోటా ఎటియోస్ శ్రేణి కార్లతో ఎక్స్పీరియన్షియల్ డ్రైవ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకు డ్రైవ్‍‌స్పార్క్ తెలుగును కూడా ఆహ్వానించింది. ఎటియోస్ కార్ల భద్రత గురించి నేటి కథనంలో చూద్దాం రండి....

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

జపాన్ ప్యాసింజర్ కార్ల దిగ్గజం టయోటా కిర్లోస్కర్ గత ఏడాది ప్లాటినమ్ మరియు ఎటియోస్ లివా కార్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు నిర్వహించకుండా, సరికొత్త కాస్మాటిక్ రంగుల్లో విడుదల చేసింది. అన్నింటికి మించి భద్రత ఫీచర్లను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

టయోటా ప్లాటినమ్ ఎటియోస్ సెడాన్ మరియు ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కార్లలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఇబిడి), డ్యూయల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు వెనుక సీటు ప్రయాణికుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లను ఆప్షనల్‌గా కాకుండా తప్పనిసరిగా అందించింది.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

అంతేకాకుండా అన్నింటికీ మించి, టయోటా ఎటియోస్ కార్లు ఇంపాక్ట్ అబ్జార్వింగ్ బాడీ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. అంటే ప్రక్కవైపుల నుండి ఏదైనా ఢీకొన్నపుడు జరిగే ప్రమాద తీవ్రతను తగ్గించడం. తమ కార్లలో భద్రత ప్రాథమిక లక్ష్యంగా రెండు ఐఎస్ఐ ఫిక్స్ చైల్డ్ సీట్ లాకులు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ఆప్షనల్‌గా అందించింది.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

టయోటా ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లలో అందించిన భద్రత ఫీచర్లను గురించి వివరిస్తూ, కఠినమైన ట్రాక్‌లలో ఈ కార్ల పనితీరును స్వయంగా అనుభవం పొందడానికి టయోటా ఎక్స్పీరియన్షల్ డ్రైవ్ క్యాంపెయిన్ నిర్వహించి మీడియా మరియు కస్టమర్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన డ్రైవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో కస్టమర్లను తీసుకెళ్లే ఫీచర్ల వివరణ మరియు వాటి పనితీరును వివరించారు.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

ఈవెంట్ మొత్తాన్ని విభిన్నమైన జోన్లుగా విభజించారు. ఇందులో తొలి మూడు జోన్లలో ప్రదర్శనకు ఉంచిన కార్లను గురించి డైవర్లు సేఫ్టీ వర్క్‌షాప్ ఆధ్వర్యంలో కస్టమర్లకు, మీడియాకు వివరించారు. తరువాత ఉన్న రెండు జోన్లలో కారులోని ఏబిఎస్ మరియు ఇబిడి పనితీరును ప్రదర్షించేందుకు తడి మరియు ఇసుకతో ఉన్న రెండు ప్రత్యేక ట్రాకులను ఏర్పాటు చేశారు.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

తర్వాత వచ్చిన స్పీడ్ బంప్ సెక్షన్‌ పిల్లల భద్రత కోసం ఐఎస్ఒ ఫిక్స్ మౌంట్స్ ప్రాముఖ్యత మరియు వాటి అవసరాన్ని తెలిపింది. టయోటా నిర్వహించిన కార్యక్రమంలో, తమ కార్లలో ఉన్న భద్రత ఫీచర్లు ఎలా పనిచేస్తాయి, వాటి అవసరం ఎంత మేరకు ఉంది వంటి వాటిని వివరించి సేఫ్టీ ఫీచర్ల పట్ల కస్టమర్లలకు అవగాహన కల్పించింది.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

ఇతర జోన్లలో అనేక కార్యక్రమాలను టయోటా నిర్వహించింది. ఇందులో, సేఫ్టీ క్విజ్, ఫ్యామిలీ గేమ్స్, సేఫ్టీ కాంటెస్ట్ మరియు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా గ్లోబల్ ఎన్‌సిఎపి వేదిక మీద క్రాష్ పరీక్షలకు గురైన కారును కూడా ప్రదర్శనలో ఉంచారు.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

భద్రత ఫీచర్లతో నిండిన ఎటియోస్ కార్లకు, భద్రత ఫీచర్లు లేని కార్లకు మధ్య ఉన్న డ్రైవింగ్ అనుభవంలోని తేడాను వివరించేందుకు రెండు కార్లను కూడా కస్టమర్లతో డ్రైవ్ చేయించింది టయోటా టీమ్. ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు సేఫ్టీ పరంగా క్రాష్ పరీక్షల్లో గ్లోబల్ ఎన్‌సిఎపి నుండి ఐదుకు గాను నాలుగు స్టార్ల రేటింగ్ లభించింది.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఎటియోస్ సిరీస్‌లోని ఈ కార్లు బెస్ట్ కార్లని చెప్పవచ్చు. డిజైన్ పరంగా, సేఫ్టీ విషయంలో, నిర్మాణ నాణ్యత మరియు ఫీచర్ల విషయంలో రాజీపడకుండా టయోటా వీటిని నిర్మించింది. అయినప్పటికీ టయోటా సిరీస్ కార్లు ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించలేదు.

 ప్లాటినమ్ ఎటియోస్ మరియు ఎటియోస్ లివా కార్లు

అయితే, ఈ కార్లలో ఉన్న సేఫ్టీ ఫీచర్లను మరియు వీటిలో ఉన్న ప్రత్యేకతలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతోంది కాబట్టి, భద్రతను పరిగణలోకి తీసుకుని కార్లను ఎంచుకునే వారిని ఎటియోస్ సిరీస్ కార్లు చేరువకానున్నాయి. ప్రస్తుతం టయోటా ఇండియా విపణిలో ఇన్నోవా, ఫార్చ్యూనర్, కరోలా ఆల్టిస్ వంటి కార్లు మంచి విక్రయాలు జరుపుతున్నాయి.

English summary
Read In Telugu: Toyota Demonstrates The Etios’ 4-Star Global NCAP Safety Rating Through Experiential Drive

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark