భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల విడుదలపై టయోటా ప్రణాళికలు ఇవే...!!

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలను వెల్లడించింది. కంపెనీ తాజాగా తెలిపిన ప్రకటన మేరకు, ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల విడుదల మీద పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టయోటా ఎలక్ట్రిక్ కార్లు

నిజమే, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, విడుదల చేయడానికి ముందు, ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగితే బాగుంటుందని తెలిపాడు.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

టయోటా కర్లోస్కర్ మోటార్ వైస్ ఛైర్మన్ మరియు డైరక్టర్ శేకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ, "ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపాడు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగితే తప్ప ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాదని వెల్లడించారు."

Recommended Video
Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టయోటా ఎలక్ట్రిక్ కార్లు

విశ్వనాథన్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ చాలా సింపుల్ మరియు ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలోకి ప్రవేశపెట్టడం అంత కష్టమేమీ కాదని తెలిపాడు. టయోటా కిర్లోస్కర్ ఇండియా ఒక వేళ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని భావిస్తే స్వల్పకాలిక ప్రకటన అనంతరం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించాడు.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

టయోటా వద్ద ఇది వరకే ఎలక్ట్రిక్ వెహికల్ తమ హైబ్రిడ్ వెహికల్ పరిజ్ఞానంలో భాగంగా ఉంది. హైబ్రిడ్ వెహికల్‌లోని అంతర్గతంగా ఉన్న ఇంజన్ తొలగిస్తే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా మారిపోతుంది.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్ ప్రభుత్వం ధృడ లక్ష్యంతో ఉంది. ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా వివిధ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహన పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి.

టయోటా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా ఎట్టకేలకు భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కారు ప్రణాళికలను వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్ లేకపోయినా... భవిష్యత్తులో అనుకున్నదే తడవుగా ఎలక్ట్రిక్ కార్లను చిన్న ప్రకటన చేసి వెను వెంటనే విపణిలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం టయోటాకు ఉందని తాజా ప్రకనటల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి టయోటా కూడా 2030 నాటికి ఎలజక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Read In Telugu: Toyota Reveals Its Electric Car Plans In India
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark