ఫార్చ్యూనర్‌ను తొలిసారిగా విభిన్న మోడల్‌లో విడుదల చేసిన టయోటా: నమ్మశక్యం గానీ ప్రత్యేకతలు

Written By:

టయోటా మోటార్స్ విపణిలోకి ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ప్రీమియమ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 31.01 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు టయోటా ప్రతినిధులు తెలిపారు.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

జర్మన్‌కు చెందిన బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి లగ్జరీ కార్లతో పోటీపడుతూ, ఇండియాలో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని టయోటా గత ఏడాది సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. దీంతో ఫార్చ్యూనర్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది సరిగ్గా పండుగ సీజన్ సందర్భంగా ఫార్చ్యూనర్ టిఆర్‌టి స్పోర్టివో మోడల్‌ పేరుతో ప్రవేశపెట్టింది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

టిఆర్‌డి స్పోర్టివో అంటే ఏమిటి ?

టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్(TRD) బృందం ఈ సరికొత్త ఫార్చ్యూనర్‌ను రూపొందించింది. ఈ TRD పేరును సేకరించి స్పోర్ట్స్ లక్షణాలతో రూపొందించారనే కారణంతో టిఆర్‌డి స్పోర్టివో(TRD Sportivo) అనే మోడల్‌తో ఫార్చ్యూనర్‌ను విడుదల చేశారు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టయోటా ద్వారా పండుగ సీజన్‌లో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిరు ప్రయత్నంగా 4x2 డ్రైవ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ మరియు పర్ల్ వైట్ కలర్‌లో ఆవిష్కరించింది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

బుకింగ్స్....?

టయోటా ఇండియా విభాగం సెప్టెంబర్ 21, 2017 నుండి దేశవ్యాప్తంగా ఉన్న టయోటా విక్రయ కేంద్రాలలో ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో మీద బుకింగ్స్ ప్రారంభించింది. మరియు ఢిల్లీ, ముంబాయ్, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, జలందర్, అహ్మదాబాద్, పూనే, ఛంఢీఘర్, లూధియానా మరియు లక్నో నగరాల్లో ఉన్న డీలర్ల వద్ద ప్రదర్శనకు ఉంచింది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివ్ డిజైన్ ప్రత్యేకతలు

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఎస్‌యూవీలో సరికొత్త స్పోర్టి ఫ్రంట్ మరియు రియర్ బంపర్, స్పాయిలర్, ఆర్18 టిఆర్‌డి అల్లాయ్ వీల్స్, టిఆర్‌డి రేడియేటర్ గ్రిల్, లోయర్ గ్రిల్ కవర్, టిఆర్‌డి ప్రేరిత ఎక్ట్సీరియర్, టిఆర్‌డి బ్యాడ్జ్ పేరు గల ఇంటీరియర్స్ ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఇంజన్, గేర్‌బాక్స్ మరియు శక్తిసామర్థ్యాలు...

సాంకేతికంగా టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఖరీదైన ప్రీమియమ్‌ ఎస్‌యూవీలో 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. పడల్ షిఫ్ట్ ఆధారిత 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 175బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఇంటీరియర్ ఫీచర్లు

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో ఎస్‌యూవీలో 7-అంగుళాల పరిమాణం ఉన్న ట్యాబ్లెట్ ఆధారిత టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్యాక్ మానిటర్ మరియు రియర్ సెన్సార్లు గల పార్క్అసిస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఇతర ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో భద్రత ఫీచర్లు

ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని ఎక్కువ మంది ఎంచుకోవడానికి ప్రధాన కారణాల్లో సేఫ్టీ ఒక అంశం. టయోటా ఇప్పుడు తమ సరికొత్త ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో వాహనంలో 7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, ఎమర్జీ లాక్ మరియు స్పీడ్ ఆటో లాక్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మరియు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివోలో అదనంగా, పగటి పూట వెలిగే లైట్లున్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ టెయిల్ గేట్, ఫుల్లీ ఆటోమేటిక్ పవర్ బ్యాక్ డోర్, హైట్ అడ్జెస్ట్ మరియు జామ్ ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫార్చ్యూనర్ తిరుగులేని విక్రయాలు జరుపుతోంది. ఫార్చ్యూనర్‌లోని అన్ని వేరియంట్లు ఒకే రూపంలో ఉంటాయి. అయితే, టిఆర్‌డి స్పోర్టివో వీటన్నింటికి చాలా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే వారు భిన్నమైన రూపంలో వాహనానికే మొగ్గుచూపే అవకాశం ఉంది.

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో

టయోటా చాలా ప్లాన్‌గాకేవలం ఒక్క వేరింయట్లోనే టిఆర్‌డి స్పోర్టివోను పరిచయం చేసింది. ఫార్చూనర్‌లోని 2.8-లీటర్ 4X2 ఆటోమేటిక్ బేస్ వేరియంట్ ఆధారంగా టిఆర్‌ిడ స్పోర్టివోను రూపొందించింది. మరియు ధర కూడా రెండింటి మధ్య వ్యత్యాసం 1.45 లక్షలే, దీనికి తోడు ఇందులో భారీ ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

English summary
Read In Telugu: Toyota Fortuner TRD Sportivo launched in india. launch price, specifications, images and get more details aboout Toyota Fortuner TRD Sportivo
Story first published: Friday, September 22, 2017, 11:12 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark