టయోటా ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ సేల్స్

Written By:

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా జూలై 2017 లో అత్యత్తమ విక్రయాలు సాధించింది. జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చిన నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి కూడా టయోటా సేల్స్‌కు కలిసొచ్చింది. టయోటా ఇండియా దేశవ్యాప్తంగా 17,750 యూనిట్లను విక్రయించి 43 శాతం వద్దిని నమోదు చేసుకుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టయోటా కిర్లోస్కర్ రికార్డ్ సేల్స్

జూలై 2017 లో 9,300 యూనిట్ల ఇన్నోవా క్రిస్టా వాహనాలను మరియు 3,400 యూనిట్ల ఫార్చ్యూనర్ వాహనాలను విక్రయించింది. ప్రతి నెలా జరిగే సగటు విక్రయాలతో పోల్చితే ఈ రెండింటి విక్రయాలు రెండింతలు పెరిగాయి.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
టయోటా కిర్లోస్కర్ రికార్డ్ సేల్స్

వీటితో పాటు 1,723 యూనిట్ల ఎటియోస్ సిరీస్ కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. జూలై 2016 విక్రయ గణాంకాలను పరిశీలిస్తే 12,404 యూనిట్లు దేశీయంగా అమ్ముడుపోగా, 1,344 యూనిట్ల ఎటియోస్ సిరీస్ కార్లు ఎగుమతి అయ్యాయి.

టయోటా కిర్లోస్కర్ రికార్డ్ సేల్స్

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా మాట్లాడుతూ, "ఒకే దేశం ఒకే ట్యాక్స్ అంటూ ప్రవేశపెట్టిన కొత్త ట్యాక్స్ విధానం ద్వారా మార్కెట్లో రెండంకెల వృద్ది సాద్యమైందని, ఇందుకు భారత ప్రభుత్వానికి ధన్యావాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు."

టయోటా కిర్లోస్కర్ రికార్డ్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేంద్ర ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టిని అమలు చేసిన వెంటనే, తమ ఉత్పత్తుల మీద జిఎస్‌టి ప్రతిఫలాలను ప్రకటించింది. దీంతో ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీల మీద ధరలు విపరీతంగా తగ్గడంతో కొనుగోలుదారులు అధిక ఆసక్తిని కనబరిచారు. తద్వారా టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారీ సేల్స్ బాట పట్టింది.

English summary
Read In Telugu: Toyota India Achieves Best Ever Monthly Sales In July 2017
Story first published: Thursday, August 3, 2017, 13:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark