ట్రాక్టర్ల మీద జిఎస్‌టి రేట్ల తగ్గింపును డిమాండ్ చేస్తున్న తయారీదారులు

Written By:

నూతన పన్ను విధానం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)ని జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే ట్రాక్టర్ల మీద ప్రకటించిన ట్యాక్స్ రేట్లతో ట్రాక్టర్ల తయారీ సంస్థలు అసంతృప్తితో ఉన్నాయి. ట్రాక్టర్ల మీద జిఎస్‌టి రేట్లను తగ్గించడానికి ట్రాక్టర్ తయారీదారులు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ట్రాక్టర్ల మీద జిఎస్‌టి తగ్గింపుకు డిమాండ్

జిఎస్‌టి లోని స్లాబుల ప్రకారం, ట్రాక్టర్ల మీద ట్యాక్స్ 28 శాతం ఉంది, నిర్మాణం రంగంలో వినియోగించే వాహనాల మీద ట్యాక్స్ 18 శాతం ఉంది. రైతులకు ఉపయోపడే ట్రాక్టర్లతో పోల్చితే వీటి మీద ట్యాక్స్ చాలా తక్కువగా ఉంది.

ట్రాక్టర్ల మీద జిఎస్‌టి తగ్గింపుకు డిమాండ్

ప్రస్తుతం ప్రకటించిన 28 శాతాన్ని 18 కి తగ్గించాలని ట్రాక్టర్స్ తయారీ సంస్థలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నిర్మాణ మరియు వ్యవసాయ రంగంలో వినియోగించే వాహనాలు ఒకే విధమైన ఉద్గారాలు వెదజల్లుతాయి. రెండు రంగాలలో వినియోగించే వాహనాల ట్యాక్స్‌లో చాలా వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ట్రాక్టర్ల మీద జిఎస్‌టి తగ్గింపుకు డిమాండ్

ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(TMA) విడుదల చేసిన ఓ ప్రకటనలో, " ట్రాక్టర్ విడి భాగాలు మరియు పనిముట్ల మీద 28 శాతం ట్యాక్స్ ప్రకటించిన కేంద్రం, తయారీ రంగంలో వినియోగించే వాహనాల మీద తక్కువ ట్యాక్స్ ప్రకటించింది. అది 80హార్స్ పవర్ ఉన్న చిన్న ట్రాక్టర్ల మీద ఉన్న 18 శాతం ట్యాక్స్‌కు సమానంగా జిఎస్‌టిలో ఉందని తెలిపింది."

ట్రాక్టర్ల మీద జిఎస్‌టి తగ్గింపుకు డిమాండ్

అంతే కాకుండా, ట్రాక్టర్ విడి భాగాలు, పనిముట్లు మరియు వ్యవసాయంలో వాటి వినియోగాన్ని సులభంగా గుర్తించవచ్చు. మరియు వ్యవసాయంలో వినియోగించే ఉపకరణాలను ఇతర అవసరాలకు ఏ విధంగాను వినియోగించే అవకాశం లేదు. అలాంటి వాటి మీద కేంద్రం అధిక ట్యాక్స్ నిర్ణయించిందని తెలిపాయి.

ట్రాక్టర్ల మీద జిఎస్‌టి తగ్గింపుకు డిమాండ్

ట్యాక్స్ మార్పులకు సతమతమవుతున్నాయి ట్రాక్టర్ తయారీ సంస్థలు. జిఎస్‌టి అమలు కావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, ఈ తరుణంలో తయారీ యూనిట్లు మరియు డీలర్ల వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడం మరింత భారంగా మారుతోంది. కొత్త ట్యాక్స్ అమలైతే, ట్రాక్టర్ ధరలు 30,000 నుండి 34,000 వరకు పెరగనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వ్యవసాయ రంగంలోని వాహనాల విషయానికి వస్తే, జిఎస్‌టి స్లాబుల్లోని ట్యాక్స్ వ్యవసాయదారులకు ఇబ్బదులు తెచ్చిపెడుతోందని చెప్పవచ్చు. లగ్జరీ కార్ల మీద తక్కువ, వ్యవసాయ వాహనాల మీద ఎక్కువ ట్యాక్స్ నిర్ణయించింది కేంద్రం. రైతాంగానికి మేలు కలిగించడానికి కేంద్రం జిఎస్‌‌టి పాలసీలో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu Tractor Makers Demand To Cut GST Rates

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark