"ఆపరేషన్ చీతా" - రెండు గంటల్లో ఐదు లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

Written By:

మైసూర్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కేవలం రెండు గంటల్లో 5 లక్షల రుపాయలు జరిమానా వసూలు చేశారు. అంటే రోడ్డు మరియు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారి సంఖ్య ఏ మేరకు ఉందో తెలిసిపోతుంది.

ట్రాఫిక్ పోలీసులు

హెల్మెట్, డిఎల్, ఆర్‌సి, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. అయితే, కేవలం రెండు గంటల్లోనే ఐదు లక్షల రుపాయల జరిమానాలు వసూలు చేయడమేంటనేది ఆశ్చర్యం కలిగించే విషయం.

Recommended Video - Watch Now!
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
ట్రాఫిక్ పోలీసులు

రోడ్డు నియమాలు ఉల్లంఘించే వారికి కొదవే ఉండదు. పోలీసులు ఫైన్ బుక్ పట్టుకుని రోడ్డెక్కితే చాలు కలెక్షన్లే కలక్షన్లు. మైసూరు సిటీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా ఆపరేషన్ చీతా అనే డ్రైవ్ నిర్వహించి భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు.

ట్రాఫిక్ పోలీసులు

పోలీసు ఆజ్ఞలు మరియు చట్టపరమైన నియమాలను పాటిస్తూనే "ఆపరేషన్ చీతా" ప్రోగ్రాం నిర్వహించి భారీ మొత్తంలో ఫైన్లను రాబట్టారు. మైసూర్ సిటీ మొత్తం మీద ఉన్న ప్రధాన కూడళ్లలో 12 నుండి 2.30 గంటల మధ్య ఒకే సారి డ్రైవ్ నిర్వహించి 4,504 కేసులు నమోదు చేశారు.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్లు జర హుషార్: ఈ తప్పు చేస్తే మీ బైకుకూ ఇదే గతి...!!

ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్

ట్రాఫిక్ పోలీసులు

ఇంతకూ ఎక్కువ మంది ఏ కేసుల్లో బుక్కయ్యారో తెలుసా...? వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం. దీని తరువాత ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయని వెహికల్స్, హెల్మెట్ లేకుండా రైడ్ చేడం, తప్పుడు రిజిస్ట్రేషన్ ప్లేట్ గల వాహనాలను నడపడం వంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి.

ట్రాఫిక్ పోలీసులు

పైన తెలిపిన కేసులతో పాటు సింగ్నల్ జంప్ చేయడం, నో పార్కింగ్ పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేయడం వంటి కేసుల కారణంగా రూ. 5.02 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు పేర్కొన్నాడు.

ట్రాఫిక్ పోలీసులు

సిటీ మొత్తం మూకుమ్మడిగా డ్రైవ్ నిర్వహించడంతో కేవలం రెండు గంటల్లో ఎంత మంది రోడ్డు మరియు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తునారనే విషయం తెలిసింది. ఇక మీదట ఆపరేషన్ చీతా కార్యక్రమంలో భాగంగా తరచూ డ్రైవ్ నిర్వహిస్తామని మైసూరు సిటీ పోలీస్ కమీషనర్ సుబ్రమణ్యేశ్వర ఓ ప్రకటనలో తెలిపారు.

English summary
Read In Telugu: Traffic police collect Rs 5 lakh in fines in 150 minutes

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark