ఈ దీపావళి కోసం మార్కెట్లోకి విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

Written By:
Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు

కాంతులీనే పండుగ అనగా మనకు ముందు గుర్తొచ్చేది దీపావళి. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా భారతీయులు మొత్తం దీపావళితో పండుగ వాతావరణాన్ని నింపుకుంటారు. ప్రతి ఏడాది చివర్లోని మూడు నెలల్లో వచ్చే సాంప్రదాయ పండుగలు ఈ దీపావళితోనే ప్రారంభమవుతాయి.

దీపావళి పండుగ కోసం ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటాయి. ఈ ఏడాది దీపావళి కోసం మాత్రమే ఏకంగా ఐదు కొత్త కార్లు విడుదలకు సిద్దమయ్యాయి. ఇవాళ్టి కథనంలో ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు...

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో తననుతాను పునర్నిర్మించుకుందని చెప్పవచ్చు. దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించిన కార్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు హెక్సా భారీ సక్సెస్ అందుకున్నాయి. ఇదే డిజైన్ ఫిలాసఫీతో వచ్చిన నెక్సాన్ ఎస్‌యూవీని దీపావళికి సిద్దం చేసింది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి తమ తొలి ఉత్పత్తిని ప్రవేశపెడుతోంది. నెక్సాన్ ఎస్‌యూవీని 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభించనుంది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసుకోవడానికి 6.5-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లతో రానుంది. టాటా నెక్సాన్ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు గట్టి పోటీనివ్వనుంది.

  • విడుదల అంచనా: సెప్టెంబర్ 2017 నాటికి
  • ధర అంచనా: 6 నుండి 9 లక్షల మధ్య
ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లోకి రెనో తరువాత ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ను భారతదేశపు రెండవ కాంపాక్ట్ ఎస్‌యూవీగా విడుదలయ్యింది. 2013 లో విడుదలైన ఎకోస్పోర్ట్‌ను రీఫ్రెష్డ్ స్టైల్లో అందించేందుకు ఎకోస్పోర్ట్‌ ఫేస్‌లిఫ్ట్‌ను సిద్దం చేసింది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సింగల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ గల ఫ్రంట్ బంపర్ వంటి ప్రధానమైన ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు సంభవించాయి. సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి రానున్నాయి. అంతే కాకుండా శక్తివంతమైన 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో పరిచయం చేయనుంది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

కొత్త పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు మునుపు లభించే నాలుగు సిలిండర్ల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా లభించనుంది. సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్, వితారా బ్రిజా మరియు హోండా డబ్ల్యూఆర్-వి లకు గట్టి పోటీనివ్వనుంది.

  • విడుదల అంచనా: సెప్టెంబర్ 2017 చివరి నాటికి,
  • ధర అంచనా: 7 నుండి 11 లక్షల మధ్య.
ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి విపణిలోకి నిజమైన భారతదేశపు క్రాసోవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీని ఎస్-క్రాస్ పేరుతో 2015 లో విడుదల చేసింది. అయితే హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ లక్షణాలున్న ఎస్-క్రాస్ ఆశించిన సంఖ్యలో ఇండియన్ కస్టమర్లను చేరుకోవడంలో విఫలమైంది. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎస్-క్రాస్ ను ఈ దీపావళికి సిద్దం చేసింది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

పదునైన డిజైన్ లక్షణాలతో, కారు ఎక్ట్సీరియర్ బాడీ మీద ఆకట్టకునే క్యారెక్టర్ లైన్స్‌తో మునుపటి ఎస్-క్రాస్‌తో పోల్చుకుంటే అత్యంత ఆకర్షణీమైన ఎస్‌యూవీ భారీ మార్పులకు విడుదలకు సిద్దమైంది. ఎస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో సరికొత్త ఇన్పోటైన్‍‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు స్వాగతం పలుకుతాయి.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

మునుపటి మారుతి ఎస్-క్రాస్ 1.3-లీటర్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించేది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి తమ 1.6-లీటర్ డీజల్ వెర్షన్ ఎస్-క్రాస్ ను తొలగించినట్లు తెలిసింది. కాబట్టి, అప్ కమింగ్ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ కేవలం 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో మాత్రమే రానుంది.

  • విడుదల అంచనా: సెప్టెంబర్ 2017 చివరి నాటికి,
  • ధర అంచనా: 10 నుండి 13 లక్షల మధ్య
ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

రెనో కప్తుర్

ఈ ఏడాదిలో మార్కెట్లోకి వస్తోన్న కొత్త మోడల్ కప్తుర్. అంతర్జాతీయ విపణిలో క్యాప్చర్(Capture) అనే పేరుతో విక్రయిస్తున్న రెనో ఇండియన్ మార్కెట్లో దీనిని కప్తుర్(Kaptur) పేరుతో ఈ దీపావళికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. డస్టర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రెనో అభివృద్ది చేసిన ఇది డస్టర్ పై స్థానాన్ని భర్తీ చేయనుంది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

డస్టర్‌ను డెవలప్ చేసిన ఫ్లాట్‌ఫామ్ మీదనే కప్తుర్ ఎస్‌యూవీని అభివృద్ది చేసినప్పటికి డిజైన్ మరియు కొలతల పరంగా రెండింటికి మధ్య ఎలాంటి సంభందం ఉండదు. 5-మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యంతో వస్తున్న కప్తుర్ రెనో వారి రెండవ కాంపాక్ట్ ఎస్‌యూవీ.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

సాంకేతికంగా రెనో కప్తుర్ డస్టర్ ఎస్‌యూవీలో లభించే ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లు ఖచ్చితంగా రానున్నాయి. రెనో కప్తుర్ హ్యుందాయ్ క్రెటా, మారుతి ఎస్-క్రాస్ లతో పోటీపడనుంది.

  • విడుదల అంచనా: అక్టోబర్ 2017లో
  • ధర అంచనా: 13 నుండి 15 లక్షల మధ్య
ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

స్కోడా కొడియాక్

లగ్జరీ ఫీచర్ల సదుపాయాలతో సెడాన్ కార్లను తయారు చేసే సంస్థగా పేరుగాంచిన స్కోడా, ఇండియన్ మార్కెట్లోకి తొలిసారిగా 7-సీటర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దమైంది.

ఈ దీపావళి కోసం విడుదలవుతున్న కొత్త కార్లు

స్కోడా కొడియాక్ 2.0-లీటర్ టిడిఐ డీజల్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది. కొడియాక్ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు ఈ సెగ్మెంట్లో గట్టి పోటీనివ్వనుంది.

  • విడుదల అంచనా: అక్టోబర్ 2017 నాటికి
  • ధర అంచనా: 25 నుండి 30 లక్షల మధ్య

English summary
Read In Telugu: 2017 Upcoming Cars & SUVs In India During Diwali
Story first published: Wednesday, September 6, 2017, 13:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark