2017 లో విడుదల కానున్న నాలుగు సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిలు

నాలుగు మీటర్ల లోపు పొడవున్న నాలుగు కాంపాక్ట్ ఎస్‌యువిలు 2017 ఏడాదిలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

By Anil

2017 ఏడాది అనేక కొత్త కార్లు మరియు బైకుల విడుదలకు వేదికగా మారనుంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలన్నీ కూడా తమ ప్రధాన ఉత్పత్తుల విడుదలను ఈ ఏడాదిలోనే చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం దేశీయంగా "కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్" మార్కెట్లో విక్రయాల పరంగా మంచి వృద్దిని సాధించిపెడుతోంది (ఉదా.. మారుతి వితారా బ్రిజా).

2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

ఈ జాబితాలో తమ కంటూ ఓ మోడల్ ఉండాలనుకునే సంస్థలు చాలానే ఉన్నాయి. నాలుగు మీటర్ల లోపు పొడవున్న నాలుగు కాంపాక్ట్ ఎస్‌యువిలు 2017 ఏడాదిలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

1. టాటా నెక్సాన్

1. టాటా నెక్సాన్

టియాగోతో మంచి విజయాన్ని అందుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు ప్యాసింజర్ కార్ల విభాగంలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్దమవుతోంది. టియాగో విజయ ప్రేరణతో నాలుగు మీటర్ల లోపు పొడవున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

ఇంపాక్ట్ డిజైన్ భాషలో టియాగోను అభివృద్ది చేసిన వేదిక ఆధారంగా రూపొందుతున్న ఈ నెక్సాన్ కాంపాక్ట్‌ ఎస్‌యువిలో చాలా వరకు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు పరిచయం అవుతున్నాయి. టాటా మోటార్స్ ఈ నెక్సాన్ ఎస్‌యువిని ఇప్పటికే పలు దశలలో దేశీయ రోడ్ల మీద పరీక్షించింది.

2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో పరిచయం కానుంది. ఇందులోని డీజల్ ఇంజన్ గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో పరిచయం కానుంది.

  • ధర అంచనా: రూ. 7 నుండి 10 లక్షల మధ్య
  • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
  • 2. హోండా డబ్ల్యూఆర్-వి

    2. హోండా డబ్ల్యూఆర్-వి

    హోండా మోటార్స్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి తమ మొదటి 7-సీటింగ్ సామర్థ్యం గల ఎస్‌యువి బిఆర్-వి ని విడుదల చేసింది. జపాన్‌ ఆధారిత హోండా మోటార్స్ ఈ యేడు విపణిలోని కాంపాక్ట్ ఎస్‌యువిలో తన ప్రభావాన్ని చాటుకోవడానికి డబ్ల్యూఆర్-వి ని సిద్దం చేస్తోంది.

    2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

    హోండా తమ జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ప్రేరణతో దీనిని డిజైన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు పోటీగా అభివృద్ది చేసిన ఇందులో అధునాతన ఫ్రంట్ గ్రిల్, స్మోక్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి పగటి పూట వెలిగే లైట్లు, రూఫ్ రెయిల్స్, ప్లాస్టిక్ క్లాడింగ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

    2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

    జాజ్ డిజైన్ ఆధారంతో రానున్న ఇందులో అవే 89బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం గల ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్‌ లతో రానుంది.

    • ధర అంచనా: రూ. 6.5 నుండి 10 లక్షల మధ్య
    • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
    • 3. డాట్సన్ గో క్రాస్

      3. డాట్సన్ గో క్రాస్

      జపాన్‌కు చెందిన అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థ డాట్సన్ తమ నాలుగవ ఉత్పత్తిగా కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి గో క్రాస్ ను విడుదల చేస్తోంది. డాట్సన మొదటి సారిగా ఈ గో క్రాస్ ను కాన్సెప్ట్ రూపంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సందర్శనార్థం ప్రదర్శించింది.

      2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

      ఎంట్రీ లెవర్ వేరియంట్లో అత్యంత సరసమైన ఉత్పత్తులను అందించే సంస్థగా డాట్సన్ ప్రసిద్దింగాంచింది. కాబట్టి ఈ గో క్రాస్ ను కూడా అతి తక్కువ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా ముందువైపు హెక్సా గోనల్ క్రోమ్ గ్రిల్, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, క్రోమ్ పూత పూయబడిన అల్లాయ్ వీల్స్, ప్రకాశవంతమైన రంగులో ఉన్న రూఫ్ రెయిల్స్, వంటివి కలవు.

      2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

      డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ రెండు విభిన్న ఇంజన్‌లతో రానుంది. అవి 1.2-లీటర్ మరియు 1.5-లీటర్ టిడిసిఐ డీజల్. నిస్సాన్ తమ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లో వినియోగించిన ఇంజన్‌లనే ఈ గో క్రాస్ లో అందిస్తోంది.

      • ధర అంచనా: రూ. 6 నుండి 8 లక్షల మధ్య
      • విడుదల అంచనా: 2017 చివరకు
      • 4. 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

        4. 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

        ఇండియన్స్‌కు సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి రుచిని మొదటి సారిగా చూపించింది ఫోర్డ్ మోటార్స్, దేశీయంగా కొత్తగా కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్‌ని సృష్టిస్తూ తమ ఎకోస్పోర్ట్ ను విడుదల చేసింది. అయితే తరువాత వచ్చిన ఎస్‍‌యువిలు దీనికి గట్టి పోటీగా నిలిచాయి.

        2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

        అంతర్జాతీయ విపణిలో ఫోర్డ్ అందుబాటులో ఉంచిన కుగా ఎస్‌యువి డిజైన్ ఆధారంతో దీనిని ఫ్రంట్ డిజైన్ రూపొందిస్తోంది ఫోర్డ్. ముందు వైపున డ్యూయల్ స్లాట్ గ్రిల్, రీ డిజైన్ చేయబడిన ఫోర్డ్ లోగో, సరికొత్త హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌తో రానుంది.

        2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

        ఈ నూతన అప్‌డేటెడ్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లో మునుపటి ఇంజన్‌లతో వస్తోంది. 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో విడుదల కానుంది.

        • ధర అంచనా: రూ. 7 నుండి 10.50 లక్షల మధ్య
        • విడుదల అంచనా: 2017 దీపావళి సీజన్ నాటికి
        • 2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

          2017 లో మారుతి విడుదల చేయనున్న కార్లు

          మారుతి సుజుకి 2017 లో ఇండియన్ మార్కెట్లోకి భారీ సంఖ్యలో కార్లను విడుదల చేయనుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో....

          2017 లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యువిలు

          2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు...

          2016 ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన అత్యుత్తమ కార్లు - దేశీయ ఆటోమొబైల్ అమ్మకాల మీద అత్యంత ప్రభావం కనబరిచిన కార్లకు గురించిన ప్రత్యేక జాబితా...

ఎక్కువ మంది వీక్షించిన కొత్త కార్లు మరియు బైకుల ఫోటో గ్యాలరీ...

Most Read Articles

English summary
Upcoming Compact Suvs In 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X