సెకండ్ హ్యాండ్ కార్ల మీద జిఎస్‌టి విషయంలో వివరణ ఇచ్చిన కేంద్రం

Written By:

కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2017 న దేశవ్యాప్తంగా వస్తు మరియు సేవల పన్ను (GST) విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. జిఎస్‌టి మేరకు ఆటోమొబైల్స్ మీద గరిష్ట ట్యాక్స్ 28 శాతంతో పాటు వెహికల్ బాడీ టైప్ మరియు అందులో వినియోగించే ఇంజన్ కెపాసిటీ ఆధారంగా అదనపు సెస్ నిర్ణయించడమైంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పాత కార్ల మీద జిఎస్‌టి

ఆటోమొబైల్స్ మీద నిర్ణయించిన ట్యాక్స్ కేవలం కొత్త వాహనాలకు వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే యూస్డ్ బైకు మరియు కారు అమ్మకం మరియు కొనుగోలు మీద జిఎస్‌టి వర్తిస్తుందా లేదా అనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. అయితే కేంద్రం తాజాగా యూస్డ్ ఆటోమొబైల్స్ మీద జిఎస్‌టి గురించి వివరణ ఇచ్చింది.

పాత కార్ల మీద జిఎస్‌టి

వ్యక్తిగతంగా యూస్డ్ వెహికల్‌ను విక్రస్తున్నపుడు, వ్యాపార అవసరాలకు కాకుండా వ్యక్తిగతంగా వినియోగించడానికి కొనుగోలు చేస్తున్నపుడు అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ సేల్స్ మీద జిఎస్‌టి చెల్లించాల్సిన అవసరంలేదని కేంద్ర ఆదాయ శాఖ విభాగం స్పష్టం చేసింది.

పాత కార్ల మీద జిఎస్‌టి

అయితే, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేని సంస్థ ఫోర్ వీలర్ లేదా టూ వీలర్లను రిజిస్టర్ చేసుకున్న సంస్థకు విక్రయించినపుడు(వ్యాపార అవసరాల కోసం కొనుగోలు చేస్తే) జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది.

పాత కార్ల మీద జిఎస్‌టి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాత కార్లు మరియు బైకుల క్రయవిక్రయాలపై జిఎస్‌టి గురించిన సందేహాలకు కేంద్రం ఇచ్చిన వివరణలో వక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే యూస్డ్ వెహికల్స్ మీద జిఎస్‌టి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టత లభించింది. అయితే రిజిస్టర్ చేయించుకున్న యూస్డ్ కార్ అండ్ బైక్ అవుట్‌లెట్లకు విక్రయిస్తే జిఎస్‌టి చెల్లించాలని గుర్తుంచుకోండి.

English summary
Read In Telugu: Government Clarifies GST On Sale Of Used Cars
Story first published: Friday, July 14, 2017, 15:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark