భారత్‌లో రీకాల్‌కు గురైన ఆ 3.23 లక్షల కార్ల పరిస్థితిపై వోక్స్‌వ్యాగన్ నివేదిక

Written By:

గత ఏడాది తెరపైకి వచ్చిన వోక్స్‌వ్యాగన్ డీజల్ కుంభకోణం ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రప్రభావం చూపింది. వోక్స్‌వ్యాగన్ డీజల్ కుంభ కోణానికి గురైన కార్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నట్లు ఆయా దేశాలు గుర్తించాయి. ఇండియాలో వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార కుంభకోణం కారణంగా 3.23 లక్షల కార్లను వోక్స్‌వ్యాగన్ తాత్కాలికంగా వెనక్కి పిలిచింది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

ఇంజన్ విడుదల చేసే ఉద్గారాలాను తక్కువ మోతాదులో చూపించేందుకు నకిలీ సాఫ్ట్‌వేర్‌ను వోక్స్‌వ్యాగన్ వినియోగించింది. దీంతో అధిక ఉద్గారాలను విడుదల చేసే వోక్స్‌వ్యాగన్ డీజల్ కార్లు రోడ్లెక్కాయి. తరువాత పరీక్షల్లో ఈ కార్ల పర్యావరణానికి హానికరం అని బుజువు కావడంతో వోక్స్‌వ్యాగన్ డీజల్ కుంభకోణం బయటపడింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన కార్లలో నకిలీ సాఫ్ట్‌వేర్ వినియోగించి 3.23 లక్షల కార్లను వోక్స్‌వ్యాగన్ తాత్కాలికంగా వెనక్కిపిలిచింది. రీకాల్‌కు గురైన కార్లకు సంభందించిన నివేదికను వోక్స్‌వ్యాగన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు సమర్పించింది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

డీజల్ ఉద్గారాల విషయంలో తప్పుడు సాఫ్ట్‌వేర్ గల సుమారుగా 3.23 లక్షల డీజల్ కార్లను డిసెంబర్ 2015లో దేశవ్యాప్తంగా రీకాల్ చేసింది. అమెరికా, యూరప్ మరియు ఇతర ప్రపంచ మార్కెట్లను కలుపుకొని మొత్తం 110 లక్షల కార్లు డీజల్ ఉద్గార కుంభకోణానికి గురయ్యాయి.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

వోక్స్‌వ్యాగన్‌కు చెందిన 4 నుండి 7 మందితో కూడిన బృందం ఈ డీజల్ ఉద్గార కుంభకోణం కారణంగా రీకాల్ అయిన కార్లకు సంభందించిన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బెంచ్ న్యాయమూర్తి జవాద్ రాహిమ్‌కు సమర్పించింది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

గతంలో, డీజల్ ఉద్గార కుంభకోణం వెలుగులోకి వచ్చాక ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) వోక్స్‌వ్యాగన్ డీజల్ కార్లను పరీక్షించింది. పరీక్షల అనంతరం ఈ సమస్యను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఇఎ 189 డీజల్ ఇంజన్ గల 3.23 లక్షల కార్లను వెనక్కి పిలిచి వాటిలో సాఫ్ట్‌వేర్‌ను ఫిక్స్ చేసింది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

ఇలా రీకాల్‌కు గురైన కార్ల గురించి వోక్స్‌వ్యాగన్ ఇండియా స్పందిస్తూ, ఇది తాత్కాలిక రీకాల్ మాత్రమే అని తెలిపింది. మరియు ఉద్గార నియమాలను పాటించని కార్లను అక్రమంగా విడుదల చేసినందుకు వోక్స్‌వ్యాగన్ మీద ఎలాంటి జరిమానా విధించలేదు.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

రీకాల్‌కు గురైన వాటిలో డీజల్ ఉద్గారాలను తగ్గించడానికి 70 శాతం కార్లకు నూతన సాఫ్ట్‌వేర్ అందించడానికి ఏఆర్ఐఏ అంగీకరించింది. ఇదే విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెల్లడించడం జరిగింది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

వోక్స్‌వ్యాగన్‌ ఎన్‌జిటికి ఇచ్చిన నివేదికలో 70 శాతం రీకాల్‌కు గురైన కార్లలో సాఫ్ట్‌వేరే ఫిక్స్ చేయడం జరిగింది, మిగిలిన 30 శాతం కార్లలో నూతన సాఫ్ట్‌వేర్ అందివ్వనున్నట్లు పేర్కొంది.

రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డీజల్ కుంభకోణం కారణంగా వోక్స్‌వ్యాగన్ ప్రపంచ దేశాల నుండి భారీ మొత్తంలో జరిమానాలు అందుకొంది. వోక్స్‌వ్యాగన్ గ్రూపు‌లో ఉన్న ఆడి, పోర్షే వంటి సంస్థలు కూడా భారీ మూల్యం చెల్లించుకున్నాయి.

English summary
Read In Telugu: Volkswagen Submits Recall Roadmap Of 3.23 Lakh Cars Before NGT
Story first published: Saturday, August 19, 2017, 16:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark