ఎట్టకేలకు నిలదొక్కుకున్న వోక్స్‌వ్యాగన్

Written By:

వోక్స్‌వ్యాగన్ జూలై 2017 సేల్స్ రిపోర్ట్ ప్రకారం, రికార్డ్ స్థాయి సేల్స్ సాధించినట్లు వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన 2017 జూలై విక్రయాల్లో వోక్స్‌వ్యాగన్ 10.5 శాతం వృద్దిని సాధించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

వోక్స్‌వ్యాగన్ గడిచిన జూలై 2017లో దేశవ్యాప్తంగా 4,753 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో 4,301 యూనిట్లను విక్రయించింది. వార్షిక విక్రయాల పరంగా 2016 తో పోల్చుకుంటే 2017లో ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ది నమోదైంది.

Recommended Video
Tata Nexon Review: Specs
వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

వోక్స్‌వ్యాగన్ ఈ మధ్య కాలంలో విడుదల చేసిన టిగువాన్ ఎస్‌యూవీకి ఇండియన్ కస్టమర్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. సేఫ్టీ, స్టైల్, లగ్జరీ కలయికలో వచ్చిన టిగువాన్ మీద ఇప్పుడు మూడు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది. వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీలో 4మోషన్ ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

టిగువాన్ ఎస్‌యూవీలో క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ మరియు లైట్ సెన్సార్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ గల ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, ఈజీ ఓపెన్ డిక్కీ, ఎలక్ట్రిక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ప్యానరోమిక్ సన్ రూఫ్, కీలెస్ ఎంట్రీ మరియు సెల్ఫ్ సీలింగ్ టైర్లు ఇందులో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జూలై కాకుండా అంతకుమునుపు సేల్స్ వివరాలు డ్రైవ్‌స్పార్క్ తెలుగు వద్ద ఉన్నాయి. వాటితో జూలై సేల్స్ పోల్చుకుంటే వోక్స్‌వ్యాగన్ అత్యుత్తమ వృద్దిని సాధించింది. కొత్తగా విడుదలైన వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ మరియు జిఎస్‌టి అమలుతో ధరలు తగ్గముఖం పట్టడం వంటి కారణాలతో విక్రయాలు పెరిగాయి.

English summary
Read In Telugu: Volkswagen India Registers 10.5 Percent Growth In July 2017
Story first published: Wednesday, August 2, 2017, 19:01 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark