బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లతో మారుతి, హ్యుందాయ్‌ సంస్థలకు దిమ్మతిరిగే షాకిచ్చిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మన్‌కు చెందిన అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోని ప్రతి సెగ్మెంట్లో కూడా ఖరీదైన కార్లనే విక్రయిస్తోంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'పోలో' నుండి లగ్జరీ సెడాన్ 'పస్సాట్' వరకు వాటికి పోటీగా ఉన్న కార్లతో పోల్చుకుంటే ఖరీదైనవే.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి దశాబ్దానికిపైగా కావస్తున్నా... ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. ఎలాగైనా దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడానికి వోక్స్‌వ్యాగన్ ప్రయత్నిస్తోంది.

Recommended Video - Watch Now!
Best Cars Of 2017 In India - DriveSpark
వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

ఈ నేపథ్యంలో మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ మోటార్స్ విక్రయిస్తున్న మోడళ్లకు పోటీగా అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మాల్ కార్లను అభివృద్దిచేసి, విడుదల చేయాలని భావిస్తోంది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

అందుకోసం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ విక్రయిస్తున్న కార్ల స్థానంలో, కొత్త మోడళ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. ఇటిఆటో కథనం మేరకు భారత్ కోసం కొత్త కార్లను అభివృద్ది చేసేందుకు 7,600 కోట్ల రుపాయల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

వోక్స్‌వ్యాగన్ పెట్టుబడి మొత్తాన్ని పూనేలోని చకన్ తయారీ ప్లాంటులో అదనపు ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు, నూతన ఇంజనీరింగ్ సెంటర్ మరియు కొత్త మోడళ్ల అభివృద్దితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఖర్చు చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

ఈ ఏడాది ఆగష్టులో వోక్స్‌వ్యాగన్-టాటా మోటార్స్ మధ్య భాగస్వామ్యపు ఒప్పందం రద్దయ్యింది. ఇదే ఒప్పందం జరిగి ఉంటే ఇరు సంస్థలు ఇండియన్ మార్కెట్ కోసం అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను ఉత్పత్తి చేసేవి.

Trending On DriveSpark Telugu:

కారులో వెళ్లినా సరే హెల్మెట్ ధరించాల్సిందే

ఆడి కారులో వచ్చి అంబులెన్స్‌ తీసుకెళ్లిన మందు బాబు

వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుందో తెలుసా?

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించి 15 ఏళ్లు కావస్తున్న తన భాగస్వామ్యపు సంస్థ స్కోడాతో కలిపి ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కనీసం రెండు శాతం వాటాను మాత్రమే సొంతం చేసుకుంది. మారుతి మరియు హ్యుందాయ్ మోటార్స్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో ఖరీదైన కార్లను విక్రయించే ప్రీమియమ్ బ్రాండ్‌గా ముద్ర వేసుకుని మారుతి మరియు హ్యుందాయ్ కంపెనీలకు పై స్థానంలో నిలిచింది. అందుకే ఈ రెండు సంస్థలను ఎదుర్కునేందుకు ఎమ్‌క్యూబి-ఏఒ ఫ్లాట్‌ఫామ్ ఆదారంగా ప్రాంతీయంగా విడి భాగాలను సేకరించి, అతి తక్కువ ధరకే తమ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

అన్ని కొత్త మోడళ్లను వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా ఉమ్మడి భాగస్వామ్యం క్రింద ఎమ్‌క్యూబి-ఏఓ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా డెవలప్ చేసి, ఉత్పత్తి చేయనుంది. దేశీయ మార్కెట్‌తో పాటు పలు విదేశీయ మార్కెట్లకు కూడా వీటిని ఎగుమతి చేయాలని వోక్స్‌వ్యాగన్ భావిస్తోంది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

వోక్స్‌వ్యాగన్ కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక ప్రణాళికల ప్రకారం, ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు మారుతి సుజుకి బాలెనో అదే విధంగా మిడ్ సైజ్ సెడాన్, మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు పోటీని తయారు చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా రెండూ కూడా ఖరీదైన కార్లను ఉత్పత్తి చేసే ప్రీమియమ్ బ్రాండ్ సంస్థలు. దేశీయంగా రాణించేందుకు, ఇండియన్స్ అధికంగా ఎంచుకుంటున్న మోడళ్ల ఆధారంగా అత్యంత సరసమైన కార్లను ఉత్పత్తి చేయడానికి సన్నద్దమవుతోంది.

మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ మోటార్స్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని, వాటి ఉత్పత్తులకు తగ్గ పోటీని సృష్టించడానికి వోక్స్‌వ్యాగన్ నిర్ణయించుకుంది. ఈ రెండు కంపెనీలను ఎదుర్కుంటుందో లేదో చూడాలి మరి.

*ఫోటోలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించబడ్డాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Volkswagen To Launch Affordable Cars In India — To Rival Maruti And Hyundai

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark