పోలో జిటిఐ మీద రూ. 6 లక్షలు ధర తగ్గించి షాకిచ్చిన వోక్స్‌వ్యాగన్

Written By:

వోక్స్‌వ్యాగన్ తమ శక్తివంతమైన పోలో జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా ఇండియన్ మార్కెట్ కోసం కేవలం 99 యూనిట్లను మాత్రమే కేటాయించింది. జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇప్పుడు పోలో జిటిఐ లిమిటెడ్ ఎడిషన్ స్టాక్ క్లియర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ లిమిటెడ్ ఎడిషన్ పవర్ హ్యాచ్‌బ్యాక్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించి రూ. 19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంచింది. 2016 నవంబర్‌లో దేశీయ విపణిలోకి విడుదలైన దీని ధర అప్పట్లో 25.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉండేది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

ఓ ఆటోమొబైల్ వార్తా వేదిక ప్రచురించిన కథనం మేరకు, ముంబాయ్ లోని వోక్స్‌వ్యాగన్ డీలర్లు పవర్ ఫుల్ పోలో జిటిఐ మీద భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిసింది. అయితే స్టాక్ క్లియర్ చేసుకునేందుకే ఇలా ఆఫర్లు ప్రకటించినట్లు తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

సాధారణంగా వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో లభించే పోలో జిటిఐకు ఇప్పుడు ధరలు తగ్గిన లిమిటెడ్ ఎడిషన్ శక్తివంతమైన ఇంజన్ గల పోలో జిటిఐకు చాలా వ్యత్యాసం ఉంది. మూడు డోర్లతో మాత్రమే లభించే ఈ పోలో జిటిఐ విపణిలో ఉన్న ఫియట్ అబర్త్ 595 మరియు మిని కూపర్ ఎస్ కార్లకు పోటీగా ఉంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

సాంకేతికంగా శక్తివంతమైన వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో 1.8-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ ఆటోమేటిక్ డైరక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 189బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకునే దీని గరిష్ట వేగం గంటకు 233కిమీలుగా ఉంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

ఓవరాల్ డిజైన్ పోలో జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌నే పోలి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బంపర్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు ఫాగ్ లైట్లు వంటి ఫీచర్లును స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది. పెద్ద పరిమాణంలో ఉన్న హై గ్లాస్ బ్రాక్ రూఫ్ స్పాయిలర్, బంపర్‌లో డిఫ్యూసర్, జిటిఐ స్పెసిఫిక్ డ్యూయల్ టెయిల్ పైప్, ఎల్ఇడి లైట్లు మరియు జిటిఐ బ్యాడ్జ్ కలదు.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

భద్రత పరంగా వోక్స్‌వ్యాగన్ తమ పోలో జిటిఐలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు డ్రైవర్ స్టీరింగ్ రెకమెండేషన్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు హిల్ స్టార్ట్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లూవ్ బాక్స్, ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటి సపోర్ట్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆరు స్పీకర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మీద తగ్గిన ధర

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆరు లక్షల రుపాయలు ధర తగ్గించి రూ. 19.99 లక్షల ధరతో పోలో జిటిఐ కార్లను సేల్స్ చేయడం వోక్స్‌వ్యాగన్‌కు ఇప్పటికీ కత్తి మీద సామే. అత్యంత శక్తివంతమైన ఇంజన్ గల హ్యాచ్‌బ్యాక్ భారీ ధరతో ఇండియాలో అమ్ముడుపోవడం దాదాపు అసాధ్యమే.

English summary
Read In Telugu: Volkswagen Polo GTI Sold At A Discounted Price In India
Story first published: Monday, July 17, 2017, 11:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark