పదేళ్లు పూర్తి చేసుకున్న వోక్స్‌వ్యాగన్: స్పెషల్ ఎడిషన్ పోలో, వెంటో మరియు అమియో విడుదల

Written By:

వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో పదేళ్లు పూర్తి చేసుకుంది. పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వోక్స్‌ఫెస్ట్ 2017ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణిలోకి స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పదేళ్లు పూర్తి చేసుకున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణిలోకి పోలో ఆల్‌స్టార్, పోలో జిటి స్పోర్ట్, అమియో మరియు పోలో యానివర్సరీ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వోక్స్‌వ్యాగన్ డీలర్ల వద్ద వోక్స్‌ఫెస్ట్ సందర్భంగా తమ అన్నిఉత్పత్తుల మీద అందిస్తున్న ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, సర్వీస్ ఆఫర్లు మరియు ఖచ్చితమైన బహుమతులను పొందవచ్చు.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
పదేళ్లు పూర్తి చేసుకున్న వోక్స్‌వ్యాగన్

పోలో జిటి టిఎస్ఐ మరియు జిటి టిడిఐ వేరియంట్ల ఆధారంగా పోలో జిటి స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. ఇందులో 16-అంగుళాల పరిమాణం గల పోర్టాగో అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. పోలో యానివర్సరీ ఎడిషన్ 15-అంగుళాల డ్యూయల్ రాజోర్ అల్లాయ్ చక్రాలు మరియు డైమండ్ బ్లాక్ సీట్ కవర్లను కలిగి ఉంది. వీటితో పాటు గ్లోజీ బ్లాక్ రూఫ్, సైడ్ గ్రాఫిక్స్, సరికొత్త స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

పదేళ్లు పూర్తి చేసుకున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ అమియో యానివర్సరీ ఎడిషన్‌లో 15-అంగుళాల టోసా అల్లాయ్ వీలస్ మరియు హానికాంబ్ సీట్ కవర్లు ఉన్నాయి. ఇకపోతే వెంటో ఆల్‌స్టార్ వేరియంట్ సరికొత్త లినాస్ అల్లాయ్ వీల్స్, అల్ల్యూమినియం పెడల్స్, అల్‌స్టార్ బ్యాడ్జ్ గల గ్రే ఇంటీరియర్స్ ఇందులో ఉన్నాయి.

పదేళ్లు పూర్తి చేసుకున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వోక్స్‌ఫెస్ట్ నిర్వహించి కస్టమర్లకు తమ ఉత్పత్తుల మీద వివిధ రకాల ఆఫర్లనందించి ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమవడం కూడా వోక్స్‌వ్యాగన్‌కు కలిసొచ్చింది.

English summary
Read In Telugu: Volkswagen Launches Special Editions Of The Polo, Ameo And Vento In India
Story first published: Friday, September 8, 2017, 18:45 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark