హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వోక్స్‌వ్యాగన్ నుండి టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

Written By:

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ప్రపంచ వ్యాప్తంగా 19 నూతన ఎస్‌యూవీలను ప్రపంచ విపణిలో పరిచయం చేయడానికి సిద్దమవుతోంది. అందులో ఒకటి టి-క్రాస్ ఎస్‌యూవీ(SUV). వోక్స్‌వ్యాగన్ ప్రవేశపెట్టనున్న అతి చిన్న ఎస్‌యూవీ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

తాజాగా అందిన సమాచారం మేరకు, ప్రొడక్షన్ వెర్షన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2018 మలిసగంలో విపణిలోకి ఆవిష్కరించే అవకాశం ఉంది. దేశీయంగా ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వనున్న వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

Recommended Video
[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

కాన్సెప్ట్ దశలో ఉండే టి-క్రాస్ ఎస్‌యూవీ డిజైన్‌ను పోలి ఉండేలా, ప్రొడక్షన్ దశకు రూపంలో ఉన్న టి-క్రాస్ ఎస్‌యూవీని అచ్చం అదే డిజైన్‌ శైలిని పోలి రూపొందించారు. నెక్ట్స్ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేసారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వర్చస్ సెడాన్ కారును కూడా అభివృద్ది చేస్తున్నారు.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

పోలో మరియు వర్చస్ సెడాన్ కారులో వినియోగించిన ఇంజన్, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ ఎలిమెంట్లను వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీలో కూడా అందించింది. సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు సుమారుగా 4.1 మీటర్లు మరియు వీల్ బేస్ 2.5 మీటర్లుగా ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

టి-క్రాస్ ఎస్‌యూవీ సాంకేతికంగా 1-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గతంలో కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించిన టి-క్రాస్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాన్సెప్ట్‌ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ ముందు చక్రాలకు అందుతుంది. భవిష్యత్తులో టి-క్రాస్ ఎస్‌యూవీలో శక్తివంతమైన నాలుగు సిలిండర్ల టుర్భో ఛార్జ్‌డ్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

అతి ముఖ్యమైన దక్షిణ అమెరికా వంటి దేశాల్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో టి-క్రాస్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. అంతే కాకుండా తక్కువ ధరలో అందించేందుకు స్పెసిఫికేషన్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్, జీప్ రెనిగేడ్ మరియు రెనో క్యాప్చర్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే కాంపాక్ట్ ఎస్‌యూవీల మార్కెట్ వృద్ది నానాటికీ పెరుగుతోంది. కాబట్టి వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీకి మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Volkswagen T-Cross Compact SUV To Rival Hyundai Creta
Story first published: Wednesday, November 22, 2017, 12:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark