వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ విడుదల: ధర రూ. 27.68 లక్షలు

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ నేడు(24 మే, 2017) విపణిలోకి టిగువాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 27.68 లక్షలు ఎక్స్-షోరూమ్ ముంబాయ్‌గా ఉన్నట్లు వోక్స్‌వ్యాగన్ తెలిపింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ వేరియంట్లు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ వేరియంట్లు

టిగువాన్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి - కంఫర్ట్ లైన్ మరియు హైలైన్. టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్ టిగువాన్‌లో సెల్ఫ్ సీలింగ్ మరియు ప్యానరోమిక్ సన్ రూఫ్ ఫీచర్లు ఉన్నాయి.

 వేరియంట్ల వారీగా ధరలు

వేరియంట్ల వారీగా ధరలు

 • టిగువాన్ కంఫర్ట్ ధర రూ. 27.68 లక్షలు
 • టిగువాన్ హైలైన్ ధర రూ. 31.04 లక్షలు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్‌)గా ఇవ్వబడ్డాయి.
టిగువాన్ లోని ఇంజన్ వేరియంట్

టిగువాన్ లోని ఇంజన్ వేరియంట్

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ వివరాలు

ఒకే ఒక్క ఇంజన్ ఆప్షన్‌లో ఉన్న ఈ టిగువాన్‌లోని రెండు వేరియంట్లు 7-స్పీడ్ ఆటోమేటిక్ డిఎస్‌జి గేర్‌బాక్స్ కలదు. ఈ గేర్‌బాక్స్ వచ్చే పవర్ అల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

స్పీడ్ మరియు మైలేజ్

స్పీడ్ మరియు మైలేజ్

ప్రీమియమ్ ఎస్‌యూవీ అంటే అందుకు తగ్గ పనితీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. టిగువాన్ కేవలం 9.3 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 200కిమీలుగా ఉంది. టిగువాన్ మైలేజ్ 17.06కిమీ/లీ.

టిగువాన్ కొలతలు

టిగువాన్ కొలతలు

ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన టిగువాన్ ఐదు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యాన్ని కలదు.

 • పొడవు - 4,486ఎమ్ఎమ్,
 • వెడల్పు - 1,839ఎమ్ఎమ్,
 • ఎత్తు - 1,643ఎమ్ఎమ్,
 • వీల్ బేస్ - 2,681ఎమ్ఎమ్.
డిజైన్ ఫీచర్స్

డిజైన్ ఫీచర్స్

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫ్రంట్ డిజైన్ అగ్రెసివ్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్‌ల్యాంప్స్‌కు ఇరువైపులా ఆకర్షణీయమైన ట్రిపుల్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది. రెండు వేరియంట్లలో కూడా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

టిగువాన్ రూఫ్ మీద స్పోర్టివ్ రూఫ్ స్పాయిలర్ కలదు. స్వల్పవాలుతో ఉన్న రియర్ విండోకి పైభాగంలో ఈ స్పోర్టివ్ రూఫ్ స్పాయిలర్ గుర్తించవచ్చు. ఇక రియర్ డిజైన్‌లో ఉన్న టెయిల్ లైట్ క్లస్టర్ ఎల్ఇడి లైట్లను కలిగి ఉంది.

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్ ఫీచర్లు

టిగువాన్ ఇంటీరియర్‌లో వోక్స్‌వ్యాగన్ ప్రపంచ స్థాయి ఫీచర్లను అందించింది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు ఆంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లున్నాయి.

టిగువాన్ క్రాష్ టెస్ట్ ఫలితాలు

టిగువాన్ క్రాష్ టెస్ట్ ఫలితాలు

యూరో ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో టిగువాన్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఇండియన్ మోడల్ టిగువాన్ ఐదు స్టార్ల ర్యాంకింగ్ పొందింది. వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి ముందే క్రాష్ పరీక్షలు నిర్వహించింది.

 టిగువాన్ లోని ప్రధాన భద్రత ఫీచర్లు

టిగువాన్ లోని ప్రధాన భద్రత ఫీచర్లు

 • ఆరు ఎయిర్ బ్యాగులు,
 • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్,
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,
 • హిల్ డిసెంట్ కంట్రోల్,
 • హిల్ హోల్డ్,
 • పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ మరియు
 • రివర్స్ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి.
లభించు రంగులు

లభించు రంగులు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఇంటీరియర్‌లోని అప్‌హోల్‌స్ట్రే స్పోర్టివ్ బ్లాక్ వియన్నా లెథర్‌తో కలదు మరియు ఇది నాలుగు విభిన్న ఎక్ట్సీరియర్ రంగుల్లో లభించును. అవి,

 • టంగ్‌స్టన్ సిల్వర్,
 • అట్లాంటిక్ బ్లూ,
 • ఇండియమ్ గ్రే మరియు
 • డీప్ బ్లాక్.
English summary
Read In Telugu Volkswagen Tiguan Launched In India.Get more details about volkswagen Tiguan price, engine, features, specifications and photos
Story first published: Wednesday, May 24, 2017, 15:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark