కాన్సెప్ట్ రూపంలో జెన్.ఇ ఎలక్ట్రిక్ కారును రూపొందించిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మనీలో జరుగుతున్న ఫ్యూచర్ మొబిలిటి ఈవెంట్లో జెన్.ఇ కాన్సెప్ట్ పేరుతో ఓ వాహనాన్ని ఆవిష్కరించింది వోక్స్‌వ్యాగన్. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసేందుకు ఈ జెన్.ఇ కాన్సెప్ట్‌ను వినియోగించుకోనున్నట్లు సమాచారం.

వోక్స్‌వ్యాగన్ జెన్ఇ కాన్సెప్ట్

తరువాత తరానికి చెందిన వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ తరహాలో ఉన్న జెన్.ఇ కాన్సెప్ట్ కారులో మలచబడినట్లుగా ఉండే డిజైన్, రియర్ విండ్ షీల్డ్, రియర్ వ్యూవ్ కెమెరాలు మరియు స్లిమ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ జెన్ఇ కాన్సెప్ట్

గాలి ద్వారా కలిగే ఘర్షణను నివారించడానికి ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ముందు వైపు పదునైన డిజైన్ లక్షణాలతో రూపొందించారు. వోక్స్‌వ్యాగన్ జెన్.ఇ కాన్సెప్ట్ కారు గరిష్ట పరిధి 400కిలోమీటర్లుగా ఉంది. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, ప్రమాదాల్లో అధిక భద్రతో తేలికపాటి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తున్నట్లు తెలిసింది. అయితే వోక్స్‌వ్యాగన్ దీని గురించి ఏ విధంగా స్పందించలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మీద దృష్టి పెట్టాయి. అయితే వోక్స్‌వ్యాగన్ తమ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా ఫ్యూచర్‌లో అనేక ఎలక్ట్రిక్ కార్లను రూపొందించనుంది.

English summary
Volkswagen Unveils Gen.E Concept Read In Telugu
Story first published: Wednesday, July 5, 2017, 10:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark