వర్టస్ సెడాన్ కారును ఆవిష్కరించిన వోక్స్‌వ్యాగన్

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తమ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత వర్టస్ సెడాన్ కారును విడుదలకు సిద్దం చేస్తోంది.

By Anil

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తమ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత వర్టస్ సెడాన్ కారును విడుదలకు సిద్దం చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ తాజాగ ఆరవ తరానికి చెందిన పోలో హ్యాచ్‌బ్యాక్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. అతి త్వరలో దీనిని ప్రపంచ విపణిలోకి విడుదల చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్

వోక్స్‌వ్యాగన్ తమ అన్ని భవిష్యత్తు మోడళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఎమ్‌క్యూబి ఏఒ(MQB Ao) వేదికను వినియోగించుకుని పోలో ఆధారంతో వర్టస్ సెడాన్ కారును అభివృద్ది చేసింది. దీని ఆవిష్కరణ అతి త్వరలో ఉంటుందని పరోక్షంగా వివరిస్తూ కొన్ని ఫోటోలను రివీల్ చేసింది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ టీజర్ ఫోటోలను పరీశిలిస్తే, సరికొత్త అల్లాయ్ వీల్స్, నూతన ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక వైపున రీడిజైన్ చేయబడిన బంపర్లు, రియర్ డిజైన్‌లో ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను అందించింది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్

వర్టస్ సెడాన్ ఇంటీరియర్ విషయానికి వస్తే, నూతన పోలో కారులో వస్తున్న అదే డ్యూయల్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ ఇందులో రానుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ తొలుత దక్షిణ అమెరికా మార్కెట్లో విడుదల కానుంది. సాంకేతికంగా ఇది రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందులో 115బిహెచ్‌పి పవర్ మరియు 162ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్

అదే విధంగా, వర్టస్ లోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించనుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్

వర్టస్ సెడాన్ ఇండియా విడుదల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు, అయితే వోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా లో-కాస్ట్ ఎకో ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ది చేస్తున్నాయి. ఈ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కొన్ని కొత్త మోడళ్లను స్కోడా మరియు వోక్స్‌వ్యాగన్ సంయుక్తంగా అభివృద్ది చేయనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా వర్టస్ సెడాన్ కారును నిర్మిస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న అమియో కాంపాక్ట్ సెడాన్ కంటే మరిన్ని ఎక్కువ సెడాన్ లక్షణాలను కలిగి ఉంది. వర్టస్ దేశీయంగా లాంచ్ అయితే వెంటో మరియు పస్సాట్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Next-Generation Volkswagen Polo Based Virtus Sedan Teased Ahead Of Launch
Story first published: Saturday, October 14, 2017, 20:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X