2019 నాటికి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తాం: వోల్వో

Written By:

ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యాధునిక టెక్నాలజీ ఆవిష్కరణ మరియు అద్బుతమై సేఫ్టీ ఫీచర్లను అందివ్వడంలో స్వీడన్‌కు చెందిన వోల్వో పేరుగాంచింది. ఇప్పడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి వోల్వో సిద్దం అవుతోంది.

వోల్వో ఎలక్ట్రిక్ కార్లు

వోల్వో ఇండియా ప్రణాళికల్లో భాగంగా 2018 నాటికి తమ అన్ని కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీని మరియు 2019 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తామని వోల్వో ప్రకటించింది.

వోల్వో ఎలక్ట్రిక్ కార్లు

నూతన జిఎస్‌టి ప్రకారం హైబ్రిడ్ వాహనాల మీద ట్యాక్స్ రేట్లు కాస్త నిరాశనే మిగిల్చినప్పటికీ, వోల్వో తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. బెంగళూరులోని వోల్వో ప్లాంటు 2018 నుండి ఉత్పత్తిని ప్రారంభించనుంది. కాబట్టి, ఎక్స్‌సి90 మరియు ఎస్90 లను పూర్తిగా ఇండియాలోనే తయారుచేయనుంది.

వోల్వో ఎలక్ట్రిక్ కార్లు

వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టామ్ వాన్ బాన్స్‌డోర్ఫ్ మాట్లాడుతూ, "దేశీయంగానే ఉత్పత్తి జరగతుండటంతో దీనికి పోటీగా ఉన్న కార్ల ధరలకు సమానంగా వీటి ధరలు ఉండనున్నాయి. ప్రాంతీయంగా ఉత్పత్తి చేయడంతో ధరలు భారీగా తగ్గే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చని తెలిపారు."

వోల్వో ఎలక్ట్రిక్ కార్లు

2032 నాటికి ఇండియాలో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గురించి వోల్వో స్పందిస్తూ, ప్రభుత్వాలు ఇలాంటి లక్ష్యాలను పెట్టుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడంలో మంచి మార్పులు జరగనున్నాయని పేర్కొంది.

వోల్వో ఎలక్ట్రిక్ కార్లు

వోల్వో వద్ద ఉన్న ఎక్స్‌సి60 మరియు ఎస్90 కార్ల ఆధారంగానే ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసి, విడుదల చేసే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2032 నాటికి మార్కెట్లో కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉండాలి, పెట్రోల్ మరియు డీజల్ కార్లకు స్వస్తి పలకాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వోల్వో తరహా అన్ని కార్ల తయరీ సంస్థలు స్వతహాగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more on: #వోల్వో #volvo
English summary
Read In Telugu: Volvo To Launch Electric Car In India In 2019
Story first published: Tuesday, June 27, 2017, 15:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark