టెస్లాను తొక్కేసిన రెనో-నిస్సాన్ భాగస్వామ్యం

Written By:

భవిష్యత్ రవాణా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే అని మనందరం చెప్పుకుంటాం. ఇందుకు అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టి తమకంటూ స్వంత పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

ఈ తరుణంలో కొన్ని సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను రూపొందించి ప్రపంచ విపణిలోకి అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటి విక్రయాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సేల్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ గురించి తెలుసుకుందాం రండి.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

2017 లోని తొలి త్రైమాసికంలో రెనో-నిస్సాన్ భాగస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా 37,000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. నిజానికి అమెరికాకు చెందిన టెస్లా ఇదే కాలానికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 25,000 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

మరో పెద్ద సర్‌ప్రైజ్ ఏమిటంటే టెస్లా లోని మోడల్ ఎస్ విక్రయాలను నిస్సాన్ లీఫ్ అధిగమించడం. వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో ఇప్పుడు ఇదే హాట్‌న్యూస్.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

జపాన్‌ దిగ్గజం నిస్సాన్‌కు చెందిన లీఫ్ ఎలక్ట్రిక్ కారు 2017 లో ప్రస్తుతానికి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిస్సాన్ తమ లీఫ్ డిజైన్‌ను పూర్తిగా మార్చేయనుంది. మరియు ఇందులో అటానమస్ ప్రిపైలట్ టెక్నాలజీ సాంకేతికతను అందివ్వనుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

యూరోపియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో రెనో-నిస్సాన్ భాగస్వామ్యానికి చెందినవే అధికంగా ఉన్నాయి. ఈ విపణిలో రెనో జాయ్ తొలి స్థానంలో మరియు నిస్సాన్ లీఫ్ రెండవ స్థానంలో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

యూరోపియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి జపాన్‌కు చెందిన మిత్సుబిషి లైనప్‌లో ఉన్న ఔట్‌ల్యాండర్ పిహెచ్ఇడబ్ల్యూ హైబ్రిడ్ ఎస్‌యూవీ వరుసగా మూడవ స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ పిహెచ్ఇడబ్ల్యూ హైబ్రిడ్ వెహికల్‌ను ఈ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల జాబితాలోకి తీసుకుంటే ప్రపంచం మొత్తం మీద చాలా వెహికల్స్ ఉన్నాయి. అయినప్పటికీ జాబితాలో రెనో-నిస్సాన్ భాగస్వామ్యం తొలిస్థానంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్న సంస్థ

టెస్లాను వెనక్కి నెట్టి రెనో-నిస్సాన్ భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో రాణించడానికి ప్రధానం కారణం వీరి లైనప్‌లో ఉత్పత్తుల సంఖ్య. సుమారుగా 50,000 లకు పైగా నిస్సాన్ ఇఎన్‌వి 200, రెనో కంగూ జడ్ఇ మరియు మిత్సుబిషి మినిక్యాబ్-ఎమ్‌ఐఇవి వ్యాన్లు సరకు రవాణా కోసం వినియోగించబడుతున్నాయి.

English summary
Read In Telugu World’s Leading Electric Vehicle Manufacturer Revealed
Story first published: Tuesday, May 23, 2017, 15:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark