ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ ఇదే!

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కార్ బ్రాండ్ రివీల్ అయ్యిందంటే ల్యాంబోర్గిని, ఫెరారి మరియు రోల్స్ రాయిస్ లేదంటే ఆడి, బిఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిజెస్ బెంజ్ అనుకుంటాం. కానీ ఇవేవీ కాదు. జపాన్‌కు చెందిన ఓ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కార్ బ్రాండ్‌గా నిలిచింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్‌గా తొలిస్థానంలో నిలిచింది. ప్రతి ఏటా 100 అత్యధిక విలువైన ప్రపంచ స్థాయి బ్రాండ్ల మీద బ్రాండ్‌జ్(BrandZ) నిర్వహించిన స్టడీలో మొత్తం బ్రాండ్ విలువ కన్నా ఈ కార్ల తయారీ సంస్థ యొక్క విలువ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక విలువైన కార్ల సంస్థగా నిలిచింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

గత 12 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా తన మొదటి స్థానాన్ని యథావిధిగా కొనసాగిస్తూ వస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే 2017లో టయోటా విలువ అంతర్జాతీయంగా మూడు శాతం తగ్గినప్పటికీ ఇదే మొదటి స్థానంలో నిలిచింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

టయోటా బ్రాండ్ మొత్తం విలువు 28.7బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ విలువ 24.6బిలియన్ డాలర్లుగా ఉంది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది బిఎమ్‌డబ్ల్యూ విలువ 8 శాతం వరకు తగ్గుముఖం పట్టింది. అమెరికాలో పెట్టుబడులు మరియు సేల్స్ పరంగా ఖర్చులు అధికమైన నేపథ్యం ఈ 8 శాతం లోటుకు కారణం తెలిసింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

ప్రపంచపు రెండవ అత్యంత విలువైన కార్ల బ్రాండ్‌గా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జర్మనీకి చెందిన దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నుండి తీవ్రపోటీని ఎదుర్కుంటోంది. మెర్సిడెస్ బెంజ్ సంస్థ మొత్తం విలువ 4 శాతం పెరిగి 23.5బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ప్రపంచపు మూడవ అతి పెద్ద బ్రాండ్ విలువ గల కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ నిలిచింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

జాబితాలో ఉన్న మిగిలిన ఏడు సంస్థల్లో ఈ మూడు సంస్థల(టయోటా, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్) వ్యాల్యూ అధికంగా ఉంది. గత ఏడాదిలో టెస్లా మెరుగైన ఫలితాలు సాధించింది. టెస్లా బ్రాండ్ విలువ 32 శాతం పెరిగింది.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

నాణ్యత మరియు నమ్మకం పరంగా విలువైన బ్రాండ్‍‌గా టయోటా ప్రపంచ వ్యాప్తంగా ఆదరించబడుతోందని బ్రాండ్‌జ్ అంతర్జాతీయ డైరక్టర్ పీటర్ వాల్‌షే యూరోప్‌లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టయోటా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తూ వచ్చింది, "అయితే నా కారులో ఎలాంటి సమస్యలేదు, టయోటా డబ్బుకు తగ్గ విలువైన కార్లను ఉత్పత్తి చేస్తోందని కస్టమర్లు తెలిపినట్లు" ఆయన వివరించాడు.

ప్రపంచపు అత్యంత విలువైన కార్ బ్రాండ్ టయోటా మోటార్స్

టెస్లా ఆటోమొబైల్ మార్కెట్లో ఓ భిన్నమైన సంస్థ సంస్థ అని పీటర్ తెలిపాడు. మిగితా ఏ కార్ల తయారీ సంస్థకు కూడా దీనితో పోలిక లేదు. భవిష్యత్తు రవాణాలో కీలకంగా వ్యవహరించనున్న టెస్లా అత్యుత్తమ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అనుభవపూర్వకంగా కూడా ఒక సారి టెస్లా కార్లను నడిపిన వారు ఖచ్చితంగా ఓ టెస్లా కారును తమ సొంతం చేసుకోవాలనుకుంటారని తన స్వీయ అనుభవాన్ని వివరించాడు.

English summary
Read In Telugu World's Most Valuable Car Brand Revealed
Story first published: Thursday, June 8, 2017, 10:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark