స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

బ్రాండ్ న్యూ హోండా యాక్టివా స్కూటర్‌కు వెంచ్చించే ధరలోపే చీపెస్ట్ ధరలో లభించే 10 బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి.

By Anil Kumar

భారత్‌లో గల కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో టూ వీలర్లలో కంటే కార్లలో ప్రయాణించడం ఎంతో సురక్షితం. ఎండైనా... వానైనా కార్లలో ప్రయాణించడం ఎంతో మంచింది. అయితే, కారు కొనే పరిస్థితుల్లో చాలా మంది ఉండకపోవచ్చు. కానీ, ఈ జాబితాలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల గురించి తెలుసుకుంటే... ఒక స్కూటర్ కొనే ధరతోనే ఓ సెకండ్ హ్యాండ్ కారును ఎలా ఎంచుకోవచ్చో తెలుస్తుంది....

ఆశ్చర్యంగా ఉంది కదూ...? నిజమే మరి, బ్రాండ్ న్యూ హోండా యాక్టివా స్కూటర్‌కు వెంచ్చించే ధరలోపే చీపెస్ట్ ధరలో లభించే 10 బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి. వాటి మీద ఓ లుక్కేసుకుందాం రండి...

స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

10. మారుతి 800

ప్రస్తుతం మారుతి 800 మార్కెట్లో లేదు, దీని స్థానాన్ని సరికొత్త ఆల్టో 800 భర్తీ చేసింది.మారుతి 800 సుదీర్ఘ కాలం పాటు మార్కెట్లో ఉన్న మోడల్. పరిచయం అయ్యి, దశాబ్దాలు అవుతున్నా మార్కెట్ నుండి వైదొలగడానికి ససేమిరా అంటోంది.

స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

భారతీయులు పెంచుకున్న బలమైన సెంటిమెంట్ విలువలు, ధర మరియు నిర్వహణ పరంగా ఇతర మోడళ్లతో పోల్చుకుంటే ఇప్పటికీ ఇదే బెస్ట్ మోడల్ అని నిరూపించుకుంది. అంతే కాకుండా, ఇండియాలో ఫోర్-వీల్-డ్రైవ్‌తో వచ్చిన మొదటి కారు కూడా ఇదే.

  • మారుతి 800 ధర రూ. 25,000 నుండి రూ. 1.25 లక్షల మధ్య ఉంది.
  • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

    09. మారుతి జెన్

    మారుతి జెనో మారుతి 800 తరువాత మరో లెజండరీ మోడల్. చాలా సింపుల్‌గా కనిపించే మరియు మంచి ఫన్ డ్రైవ్ ఫీల్‌నిచ్చే జెన్ కారును దేశవ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లు స్వాగతించారు. మరియు ఎన్నో కుటుంబాల మొట్టమొదటి కారు కూడా ఇదే.

    స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

    50బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూసే చేసే జెన్ కారు అంత సులభంగా రీపెరీకి రాదు. సాధారణ సర్వీసులతోనే ఏళ్ల కాలం పాటు నడుస్తుంది.

    • మారుతి జెన్ ధర రూ. 30,000 నుండి రూ. 1.25 లక్షల మధ్య ఉంది
    • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

      08. మారుతి ఎస్టీమ్

      మారుతి ఎస్టీమ్ భారతదేశపు మొట్టమొదటి సెడాన్ కారు, ఇది విడుదలైన అనతి కాలంలోనే మధ్య తరగతి కుటుంబాల స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. మారుతి ఎస్టీమ్ ప్రాక్టికల్‌గా మంచి కారు, అతి తక్కువ మెయింటనెన్స్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణం దీని సొంతం.

      స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

      మారుతి ఎస్టీమ్ మార్కెట్ నుండి నిష్క్రమించి చాలా కాలం అయినప్పటికీ, ఇంజన్ పనితీరు పరంగా ఆధునిక కార్లతో పోటీపడుతోంది. దీని విడి పరికరాలు కూడా అత్యంత నాణ్యమైన మరియు ఎక్కువ కాలం మన్నుతాయి.

      • మారుతి ఎస్టీమ్ ధర సుమారుగా రూ. 45,000 నుండి ప్రారంభమవుతుంది.
      • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

        07. హ్యుందాయ్ శాంట్రో

        దశాబ్ద కాలానికి పైగా ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారుగా రాణించిన శాంట్రో అతి త్వరలో రీఎంట్రీ ఇవ్వనుంది. తొలి ఇన్నింగ్స్‌లో శాంట్రో కారు ఎంతో మంది ఫస్ట్ టైం కారు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎన్నో మరపురాని అనుభూతుల్ని మిగిల్చాయి.

        స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

        ఒకానొక దశలో తన విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ మరియు అధిక విశ్వసనీయత పరంగా హ్యుందాయ్ శాంట్రో మారుతి 800 కారుకు గట్టిపోటీనిచ్చింది. మార్కెట్ నుండి వైదొలగిప్పటికీ శాంట్రో ప్రేమికుల ఓ మాత్రం తగ్గడం లేదు.

        • హ్యుందాయ్ శాంట్రో ధర సుమారుగా రూ. 45,000 నుండి ప్రారంభమవుతుంది.
        • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

          06. మారుతి ఓమ్నీ

          మార్కెట్లోకి ఎన్ని కొత్త కొర్లొచ్చినా... ఎన్ని ఫీచర్లు పరిచయమైనా మారుతి ఓమ్నీ కారుకు ఉన్న కస్టమర్లు, అభిమానాలు ఏ మాత్రం తగ్గడం లేదు. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ నిలకడైన ఫలితాలు సాధిస్తున్న కార్లలో మారుతి ఓమ్నీ ఒకటి.

          స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

          మారుతి ఓమ్నీ అతి తక్కువ ఇంజన్ సామర్థ్యంతో లభిస్తున్న కారు. రూరల్ ఏరియాల్లో చిన్నపాటి సరుకు రవాణాకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. మారుతి ఓమ్నీ సెకండ్ హ్యాండ్ కారును రూ. 50,000 ప్రారంభ ధరతో ఎంచుకోవచ్చు.

          స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

          05. టాటా ఇండికా

          ఇండియన్ మార్కెట్ సిద్దం చేసి, ఇండియాలో డిజైన్ చేయనటువంటి మొదటి మోడల్ టాటా ఇండికా. మారుతి నుండి ఎదురైన విపరీతమైన పోటీ కారణంగా టాటా ఇండియాకా ఆశించిన మార్కెట్ వాటాను పంచుకోలేకపోయింది.

          స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

          టాటాకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఇండికా పేరు మంచి పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు దేశీయ మార్కెట్లో అతి కష్టం మీద నెట్టుకుంటూ వచ్చిన ఈ మోడల్ సుమారుగా కొన్ని లక్షల సంఖ్యలో అమ్ముడయ్యింది. ఇటీవల ట్యాక్సీలు మరియు అద్దె కార్లుగా రాణిస్తున్నాయి.

          • టాటా ఇండికా సెకండ్ హ్యాండ్ కారు ప్రారంభ ధర రూ. 40,000 లు
          • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

            04. టాటా నానో

            టాటా నానో అత్యంత సరసమైన కారుగా ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ది చెందింది. అత్యంత సరసమైన కారు అనే ట్యాగ్ లైనుతో వచ్చినప్పటికీ, నానో విడుదల టాటా మోటార్స్‌‍కు ఎలాంటి లాభాన్ని తెచ్చిపెట్టలేదు.

            స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

            ఏదేమైనప్పటికీ, మొదటిసారి కారు డ్రైవ్ చేయాలనుకునే వారికి మరియు అత్యధికంగా నమ్మదగిన మోడల్ టాటా నానో. చూడటానికి చాలా చిన్నగా ఉండటం మరియు డ్రైవర్‌కు రోడ్డు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి మంచి డ్రైవింగ్ ఫీల్ పొందుతారు.

            • టాటా నానో సెకండ్ హ్యాండ్ కారును రూ. 45,000 ల ధరతో ఎంచుకోవచ్చు
            • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

              03. మారుతి వ్యాగన్ఆర్

              మారుతి ఆల్టో తరహాలో ఇండియాలో ఉన్న అత్యంత పాత కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారును విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలకడైన ఫలితాలు సాధిస్తూనే భారతదేశపు టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది.

              స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

              పెట్రోల్, ఎల్పీజీ మరియు సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‍‌లతో లభిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పాత వ్యాగన్ఆర్ కార్లకు మార్కెట్లో ఓ మోస్తారు డిమాండ్ ఉంది.

              • మారుతి వ్యాగన్ఆర్ యూజ్డ్ కారును రూ. 40,000 ధరతో ఎంచుకోవచ్చు.
              • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

                02. హోండా సిటీ

                మార్కెట్లోకి విడుదలైన 20 ఏళ్ల తరువాత కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు హోండా సిటీ. సమయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వివిధ జనరేషన్లలో విశ్వసనీయతకు అనుగుణంగా హోండా సిటీ మార్కెట్లోకి విడుదలవుతూ వచ్చింది.

                స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

                జపాన్ దిగ్గజం లాంచ్ చేసిన మొదటి తరం సిటీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే యువత ఎక్కువగా పాత కాలం నాటి హోండా సిటీ కార్ల మీద మోజు పడుతున్నారు.

                • హోండా సిటీ ప్రారంభ ధర రూ. 40,000
                • స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

                  01. మిత్సుబిషి ల్యాన్సర్

                  పవర్‌ఫుల్ సెడాన్ సెగ్మెంట్లో అసలైన కార్ రైడింగ్ ఔత్సాహికుల ఫేవరెట్ మోడల్. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదారణ పొందిన పురాతణ మోడళ్లలో మిత్సుబిషి ల్యాన్సర్. వయసు మీద పడుతున్నా కూడా కారు ప్రేమికులను ఏ మాత్రం నిరుత్సాహ పరచడం లేదు.

                  స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

                  యూజ్డ్/సెకండ్ హ్యాండ్ మిత్సుబిషి ల్యాన్సర్ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ కారును సొంతం చేసుకుని పూర్తి స్థాయిలో రిపేరీలు నిర్వహించి ఓల్డ్ ఈజ్ గోల్డ్‌గా చెప్పుకుంటున్నారు.

                  • యూజ్డ్ మిత్సుబిషి ల్యాన్సర్ కారును రూ. 45,000లతో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: 10 Reliable Cars At The Price Of An Activa
Story first published: Friday, June 29, 2018, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X