2018 మారుతి స్విఫ్ట్ సేఫ్ కారు కాదా....? నిగ్గు తేల్చిన యూరో ఎన్‌సిఎపి!

Written By:

మారుతి సుజుకి ఇటీవల విపణిలోకి సరికొత్త థర్డ్ జనరేషన్ 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. తొలుత ప్రపంచ మార్కెట్లోకి విడుదలైన, స్విఫ్ట్ చివరిగా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి. కనీవిని ఎరుగని సేల్స్ సాధిస్తోంది.

మైలేజ్, డిజైన్ మరియు ఫీచర్లను చూసి 2018 మారుతి స్విఫ్ట్ కారును ఇష్టమొచ్చినట్లుగా కొంటున్నారు. కానీ, కొత్త తరం మారుతి స్విఫ్ట్ ఎంత వరకు సేఫ్...? ఊహించని ప్రమాదం జరిగితే ఎంత వరకు ప్రాణాలను రక్షిస్తుంది...? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి 2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ కథనంలో చూద్దాం రండి.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

సుజుకి హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన 2018 మారుతి స్విఫ్ట్ కారుకు ఇటీవల యూరో ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో ఢీ పరీక్షలు (క్రాష్ టెస్ట్) నిర్వహించారు. ఈ పరీక్షల్లో స్టాండర్డ్ వేరియంట్ స్విఫ్ట్ మీద ఐదింటికి గాను మూడు స్టార్ల రేటింగ్ లభించింది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

అదే విధంగా ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్లు ఉన్న స్విఫ్ట్ వేరియంట్ ఐదుకు నాలుగు స్టార్లను దక్కించుకుంది. కానీ, ఇవే క్రాష్ టెస్టుల్లో మునుపటి తరానికి మారుతి స్విఫ్ట్ ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ పొంది అన్ని అంశాల పరంగా సురక్షితమైన కారుగా నిరూపించుకుంది. కానీ, కొత్త తరం స్విప్ట్ విషయంలో భద్రత ఒక మెట్టు క్రిందకు దిగింది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

యూరో న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాంలో స్విఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ 3 స్టార్ల రేటింగుకే పరిమితమైంది. ఢీ పరీక్షలు జరిపినపుడు పెద్దల భద్రత పరంగా 83 శాతం, చిన్న పిల్లల భద్రత పరంగా 75శాతం వరకు మాత్రమే సురక్షితమైనట్లు తెలిసింది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

అదే విధంగా పూర్తి స్థాయి సేఫ్టీ ఫీచర్లతో ఆప్షనల్‌గా లభించే స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్ మీద ఐదుకు 4 స్టార్ల రేటింగ్ లభించింది. ఇది పెద్దల భద్రత విషయంలో 88 శాతం మరియు చిన్న పిల్లల భద్రత విషయంలో 75 శాతం వరకు సురక్షితమైనదని తేలింది.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

డమ్మీ ప్యాసింజర్లతో కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఫలితాల్లో మోకాలు మరియు తొడ వంటి శరీర భాగాలకు ఎలాంటి ప్రమాదం జరగుండా ముందు వైపు ప్రయాణికులకు హై లెవల్ ప్రొటెక్షన్ అందుతుంది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

బ్యారియర్ క్రాష్ టెస్టులో ముందు వైపు ప్రయాణికులతు ఛాతి పరంగా కొద్ది మేర భద్రత లభిస్తుంది. అంతే కాకుండా, సైడ్ పోల్స్ మరియు సైడ్ బ్యారీయర్ క్రాష్ టెస్టులో కొత్త తరం స్విఫ్ట్ ఎక్కువ పాయింట్లను సాధించింది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

మెడ బెణకడాన్ని నివారించడంలో స్విఫ్ట్ మంచి మార్కులో సొంతం చేసుకున్నప్పటికీ, వెనుక వైపు ప్యాసింజర్ విషయంలో పెద్దగా సహాయపడలేదు. మారుతి స్విఫ్ట్ పాదచారుల భద్రత విషయంలో 695 పాయింట్లను పొందింది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

పాదచారుల భద్రత కోసం అటానమస్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. ఇది కారుకు అడ్డంగా పాదచారులు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా కారు వేగాన్ని తగ్గించేస్తుంది. దీంతో పాదచారుల సేఫ్టీ విషయంలో సురక్షితమైనది ఈ మంచి మార్కులు దక్కించుకుంది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలు నిర్వహించిన కారు, మారుతి స్విఫ్ట్ రైడ్ హ్యాండ్ డ్రైవ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కారు. దీని మొత్తం బరువు 855కిలోలు. స్విఫ్ట్ స్టాండర్డ్ వేరియంట్లో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీటు మరియు సీటు బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్‌లో కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉన్నాయి, కానీ అంతర్జాతీయ విపణిలో లభించే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ ఆరు ఎయిర్ బ్యాగులతో లభ్యమవుతోంది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

ఏదేమైనప్పటికీ, మైలేజ్, ఫీచర్లు మరియు స్టైలిష్ డిజైన్ అంశాలతో కారు బరువు మరియు దాని భద్రత మీదను ప్రక్కన పెట్టేసింది. దీంతో బరువు తగ్గడంతో మైలేజ్ పెరిగింది. కానీ, మునుపటి వెర్షన్ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే సేఫ్టీ విషయంలో కొత్త తరం స్విఫ్ట్ ఒక స్టార్ రేటింగ్ కోల్పోయింది. దీని ప్రభావ ప్రయాణికుల భద్రత మీద అధికంగా ఉంటుంది.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

కారు కొనే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, మైలేజ్ కోసం కారు తీసుకోవద్దు, సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించే సేఫ్ కారును ఎంచుకోండి. ప్రాణాలతో బ్రతికుంటే... మైలేజ్ ద్వారా నష్టపోయే సొమ్మును ఎప్పటికైనా తిరిగి సంపాదించుకోవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్ క్రాష్ పరీక్షలు

1. విపణిలోకి 7-సీటర్ మారుతి సుజుకి సోలియో

2. డిజైర్ మీద మారుతి చేస్తున్న ప్రయోగం బట్టబయలు

3. కొత్త స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య తేడా ఏమిటి?

4. ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!

5. కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్

English summary
Read In Telugu: 2018 Swift gets 3 star safety rating as against 5 star rating of old Swift

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark