అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ తన్నుకుపోయిన వోక్స్‌వ్యాగన్ పోలో

Written By:

ప్రపంచ కారు అవార్డుల్లో, గత ఏడాది అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ కెటగిరీని కొత్తగా చేర్చారు. ఈ కెటగిరీలో ఈ ఏడాది 2018 వోక్స్‌వ్యాగన్ పోలో కారు ప్రపంచపు 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ ఆవార్డును సొంతం చేసుకుంది.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

ఇలా వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధానోత్సవం 14 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యింది. ఇందులో, ఈ ఏడాదితో పాటు వోక్స్‌వ్యాగన్ వరుసగా ఆరవ సారి పలు కెటగిరీల క్రింద వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

గతంలో, వరల్డ్ కార్ ఇఫ్ ది ఇయర్ టైటిల్‌ వోక్స్‌వ్యాగన్‌ను నాలుగు సార్లు వరించింది. 2013లో గోల్ఫ్, 2012లో అప్!, 2010లో పోలో మరియు 2009లో గోల్ప్ విఐ కార్ల ద్వారా అవార్డులను సొంతం చేసుకుంది.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

ఆరవ తరానికి చెందిన పోలో హ్యాచ్‌బ్యాక్ కారును వోక్స్‌వ్యాగన్ 2017లో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. మునుపటి మోడల్‌తో పోల్చితే కొలతల పరంగా ఇది పెద్దగా ఉంటుంది. 351-లీటర్ల కెపాసిటీ గల డిక్కీతో లగేజ్ స్టోరేజ్ స్పేస్ మరింత పెరిగింది.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌‌‌వ్యాగన్ డిజైన్ హెడ్ క్లాస్ బిస్చోఫ్ మాట్లాడుతూ, "పోలో హ్యాచ్‌బ్యాక్ ద్వారా వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడం మొత్తం వోక్స్‌వ్యాగన్ బృందానికే చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా170 లక్షల పోలో కార్లను విక్రయించాము. వోక్స్‌వ్యాగన్‌కు అత్యధిక విక్రయాలు సాధించి, కంపెనీకి బ్రాండ్ పిల్లర్‌గా నిలిచిందని చెప్పుకొచ్చాడు.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కెటిగిరీల్లోని వివిధ కార్లను 24 దేశాలకు చెందిన 82 మంది దిగ్గజ ఆటోమోటివ్ జర్నలిస్టులు జ్యూరీ సభ్యులు ఎన్నుకున్నారు. సభ్యులందరనీ నైపుణ్యం, అనుభవం, విశ్వసనీయత మరియు ప్రభావం ఆధారంగా సభ్యులందరినీ ప్రపంచ కార్ స్టీరింగ్ కమిటీచే నియమించారు.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

అన్నింటి కంటే, ప్రతి జ్యూరీ సభ్యుడు కూడా తమ వృత్తిలో భాగంగా ఎన్నో కొత్త కార్లను డ్రైవ్ చేసి మరియు ఆ కార్ల లోటు పాట్లను పాఠకులతో పంచుకుంటారు. ఏదేమైనప్పటికీ, వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్లు పోటీపడ్డాయి. అందులో తుది జాబితాకు ఫోర్డ్ ఫియస్టా, సుజుకి స్విఫ్ట్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో వంటి కార్లు నిలిచియాయి.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

ఈ యేడు వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు సుజుకి స్విఫ్ట్‌ను వరిస్తుందని చాలా మంది భావించారు. అయితే, జర్మన్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్ ద్వారా అవార్డును డేగలా తన్నుకుపోయింది.

 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ వోక్స్‌వ్యాగన్ పోలో

1. సేప్టీలో ఈ కారును మించి తోపు లేదు

2. ఇండియాలో కెల్లా 10 అత్యుత్తమ ఎయిర్‌లైన్స్

3.55 లక్షల బిల్లుతో కస్టమర్‌కు భారీ షాక్ ఇచ్చిన ఓలా

4. 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు: ఎందుకంటే?

5. హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి బాలెనో లక్ష్యంగా వస్తోన్న నిస్సాన్ కొత్త కారు

English summary
Read In Telugu: 2018 Volkswagen Polo Wins Urban Car Of The Year Title
Story first published: Saturday, March 31, 2018, 10:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark