అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

By Anil Kumar

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే, చాలా వరకు తక్కువ ధరలో లభించే కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు, ప్యాసింజర్ కార్ల మార్కెట్ మొత్తం ఆటోమేటిక్ కార్లతో నిండిపోయింది.

అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అతి తక్కువ బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఆటోమేటిక్ కార్లను ఎంచుకోవడంలో చాలా మంది తికమకపడుతుంటారు. మీరు కూడా అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా....? 5 లక్షల ధరల శ్రేణిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే 7 బెస్ట్ ఏఎమ్‌టి కార్ల మీద ఓ లుక్కేసుకుందాం రండి....

అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

7. టాటా నానో జెన్ఎక్స్

అతి తక్కువ ధరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు ఉన్న బెస్ట్ ఛాయిస్ టాటా నానో. టాటా నానో యొక్క ఆటోమేటిక్ వెర్షన్ భారతదేశపు అత్యంత సరసమైన ఏఎమ్‌టి మోడల్. అయితే ఆశించిన మేర నానో ఏఎమ్‌టి సక్సెస్ సాధించలేకపోయింది.

అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

సాంకేతికంగా టాటా నానో ఏఎమ్‌టి వెర్షన్‌లో 624సీసీ కెపాసిటి గల ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 37బిహెచ్‌పి పవర్ మరియు 51ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 • టాటా నానో జెన్ఎక్స్ ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 3.23 లక్షలు
 • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

  6. డాట్సన్ రెడి-గో

  యువ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు డాట్సన్ రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రెడి-గో హ్యాచ్‌బ్యాక్ పదునైన డిజైన్ అంశాలతో, ఎంతో విభిన్నంగా ఉంటుంది. జపాన్ దిగ్గజం డాట్సన్ రెడి-గో కారును తొలుత 800సీసీ ఇంజన్‌తో లాంచ్ చేసింది. తరువాత 1.0-లీటర్ ఇంజన్ పరిచయం చేసింది.

  అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

  1.0-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 3.96 లక్షలు
  • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

   5. రెనో క్విడ్

   ఇండియాలో ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్ రెనో క్విడ్. ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలతో విడుదలైన రెనో క్విడ్ తొలినాళ్లలో భారీ సేల్స్ సాధించింది. తొలుత 800సీసీ ఇంజన్‌తో విడుదలైన రెనో క్విడ్, తరువాత 1.0-లీటర్ ఇంజన్‌తో పరిచమయ్యింది.

   అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

   రెనో క్విడ్ 1.0-లీటర్ వెర్షన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తోంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 999సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

   • రెనో క్విడ్ ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 4.01 లక్షలు
   • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

    4. మారుతి ఆల్టో కె10

    మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో ఉన్న అత్యంత సరసమైన ఆటమేటిక్ కారు మారుతి ఆల్టో కె10. మొదటిసారిగా కారును కొనుగోలు చేసే కస్టమర్లు ఎక్కువగా ఆల్టో మోడల్‌నే ఎంచుకుంటున్నారు. మారుతి ఆల్టో 800సీసీ మరియు 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తోంది. అయితే, 1.0-లీటర్ ఇంజన్ గల ఆల్టో కె10లో మాత్రమే ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఉంది.

    అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

    1.0-లీటర్ కెపాసిటి గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

    • మారుతి ఆల్టో కె10 ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 4.3 లక్షలు
    • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

     3. మారుతి వ్యాగన్ఆర్

     మారుతి సుజుకి విడుదల చేసిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఎన్నో సంవత్సరాలు పాటు నిలకడగా అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. ఆల్టో తరువాత ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ మారుతి వ్యాగన్ఆర్. ఎస్‌యూవీ తరహా ఎత్తైనా బాడీ మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్ దీని సొంతం.

     అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

     మారుతి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కస్టమర్లు అభిరుచి మేరకు, మారుతి వ్యాగన్ఆర్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లభ్యమవుతోంది.

     • మారుతి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 5.01 లక్షలు
     • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

      2. మారుతి సెలెరియో

      భారతదేశపు అత్యంత సరసమైన మరియు మొట్టమొదటి ఆటోమేటిక్ కారు మారుతి సెలెరియో. అవును, దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలోకి పరిచయమైన తొలి ఆటోమేటిక్ మోడల్ ఇదే. విడుదలయ్యి సంవత్సరాలైనా ఇప్పటికీ, సెలెరియో ఆటోమేటిక్ అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది.

      అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

      మారుతి సెలెరియో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించేది. అయితే, కొన్నాళ్ల తరువాత డీజల్ వెర్షన్ సెలెరియో అమ్మకాలను శాశ్వతంగా నిలిపివేసింది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే సెలెరియోలో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటి గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

      • మారుతి సెలెరియో ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 5.07 లక్షలు
      • అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

       1. టాటా టియాగో

       దేశీయ దిగ్గజం టాటా మోటార్స్‌కు టాటా టియాగో భారీ విజయాన్ని సాధించిపెట్టింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఎన్నో ఫీచర్లు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో వచ్చాయి. హార్మన్ స్పీకర్లు, న్యావిగేషన్ మరియు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.

       అత్యంత సరసమైన ధరలో లభించే 7 ఆటోమేటిక్ కార్లు

       అన్నిటికంటే టాటా టాయాగో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. అయితే, టియాగో పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. 1.2-లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

       • టాటా టియాగో ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 5.1 లక్షలు
Most Read Articles

English summary
Read In Telugu: 7 super affordable AMT cars of India priced under Rs. 5 lakhs: Renault Kwid to Tata Tiago
Story first published: Tuesday, May 29, 2018, 20:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X