ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా తొమ్మిది కార్లను సిద్దం చేసిన హ్యుందాయ్

Written By:

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మరియు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఏకంగా తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్దమైంది. మారుతి సుజుకి మరియు అన్ని ప్రధాన సెగ్మెంట్లలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్లను ఎదుర్కొనేందుకు మొత్తం తొమ్మిది కార్లను ఖరారు చేసింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

ఈ 9 మోడళ్లలో ఇప్పటికే విపణిలో ఉన్న నాలుగు మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరియు ఐదు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఈ జాబితాలో ఎలక్ట్రిక్ కారును కూడా ఖాయం చేసింది. అతి త్వరలో విపణిలోకి విడుదల్యే ఈ తొమ్మిది కార్ల గురించి పూర్తి వివరాలు క్రింది జాబితాలో చూద్దాం రండి...

హ్యుందాయ్ కొత్త కార్లు

9. కొత్త తరం శాంట్రో

దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ విడుదలతో విపణిలోకి ప్రవేశించింది. ఈ మధ్య కాలంలో మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగించినప్పటికీ, కస్టమర్ల నుండి వస్తున్న ఆదరణకు అనుగుణంగా రీలాంచ్ చేయడానికి హ్యుందాయ్ సన్నద్దమవుతోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

సరికొత్త డిజైన్ ఫిలాసఫీలో మునుపటి శాంట్రోతో పోల్చుకుంటే అధిక పొడవు మరియు వెడల్పుతో శక్తివంతమైన మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో రానుంది.

విడుదల అంచనా: ఏప్రిల్ 2018

హ్యుందాయ్ కొత్త కార్లు

8. కార్లినో కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఇండియాకు క్రెటా స్మాల్ ఎస్‌యూవీ అత్యధిక అమ్మకాలు సాధించి భారీ లాభాన్ని తెచ్చిపెడుతోంది. అయితే, విపణిలో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని చాటుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో సబ్ 4-మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్ కోసం ఆటో ఎక్స్ పో 2016లో కార్లినో ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

మార్కెట్లో భారీ సేల్స్ సాధిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా టియువి300 వంటి మోడళ్లకు పోటీగా హ్యుందాయ్ కార్లినో కాంపాక్ట్ ఎస్‌యూవీ అతి త్వరలో విడుదల కానుంది. శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు అత్యాధునిక ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో కార్లినో ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది.

Recommended Video - Watch Now!
Kia Motors India New Models Walkaround - DriveSpark
హ్యుందాయ్ కొత్త కార్లు

7. క్రెటా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఇండియా విభాగం అతి త్వరలో క్రెటా ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఫ్రంట్ డిజైన్‌లో స్వల్ప స్టైలింగ్ మార్పులు, ఇంటీరియర్ కొన్ని అదనపు ఫీచర్ల జోడింపు, పెద్ద పరిమాణంలో ఉన్న ఏవిఎన్ డిస్ల్పే, ఎలక్ట్రానికి సన్ రూఫ్ వంటి అప్‌డేట్స్‌తో రానుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

సాంకేతికంగా ప్రస్తుత క్రెటా మోడల్‌లో లభించే అవే ఇంజన్ ఆప్షన్స్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో రానున్నాయి. క్రెటా విడుదలైన అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు హ్యుందాయ్ క్రెటాకు సరాసరి పోటీనిచ్చే మోడల్ ఒక్కటి కూడా లేదు. ఈ తరుణంలో హ్యుందాయ్ తమ క్రెటాను ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో విడుదలైతే విక్రయాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

6. సరికొత్త గ్రాండ్ ఐ10

గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ ఇండియాకు అతి పెద్ద విజయాన్ని సాధించి పెట్టింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదలైనప్పటి నుండి భారీ విక్రయాలతో హ్యుందాయ్ ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే, ఇటీవల విడుదలైన న్యూ మారుతి స్విఫ్ట్ నుండి అధిక పోటీని ఎదుర్కుంటోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రాండ్ ఐ10 స్థానంలోకి అతి త్వరలో పూర్తిగా కొత్త గ్రాండ్ ఐ10 కారును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. హ్యుందాయ్ గత ఏడాది చివరిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలయ్యింది. కాబట్టి మరో రెండేళ్లలో కొత్తగా అభివృద్ది చేసిన గ్రాండ్ ఐ10 కారును విడుదలకు సిద్దం చేస్తోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

5. సరికొత్త ఎక్సెంట్

గ్రాండ్ ఐ10 ఆధారంగా హ్యుందాయ్ ఈ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారును రూపొందించి. ఎక్సెంట్ ఇప్పటికే పలుమార్లు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. అయినుప్పటికీ సెగ్మెంట్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో కొత్త తరం ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ అభివృద్ది చేసే పనిలో పనిపడింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

4. సరికొత్త ఐ20

చివరి దశలో ఉన్న మరో మోడల్ హ్యుందాయ్ ఐ20. ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న పోటీ పరంగా చూస్తే ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు తక్కువ. కాబట్టి, మరో రెండేళ్లలోపు ఇదే ఐ20 బ్రాండ్ పేరుతో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

3. కొత్త క్రెటా

మొదటి తరం క్రెటా ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేస్తూ అతి త్వరలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ విపణిలోకి విడుదల కానుంది. అయితే, క్రెటా ఫేస్‌లిఫ్ట్ స్థానాన్ని భర్తీ చేయడానికి క్రెటా సెకండ్ జనరేషన్‌ను అభివృద్ది చేస్తోంది. ఎక్కువ బరువు మరియు ధృడమైన క్యాబిన్‌తో ప్రీమియమ్ మోడల్ తరహాలో కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఆధారంగా డెవలప్ చేస్తోంది. రెండవ తరానికి చెందిన క్రెటా గురించి పూర్తి వివరాలు లేవు, అయితే మరో రెండేళ్లలో క్రెటా విడుదలయ్యి ఐదేళ్లు పూర్తవుతుంది. కాబట్టి సెకండ్ జనరేషన్ క్రెటా ఖాయం అని చెప్పవచ్చు.

హ్యుందాయ్ కొత్త కార్లు

2. టుసాన్ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ టుసాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తోంది. గత ఏడాది విపణిలోకి విడుదలైన జీప్ కంపాస్ ఎస్‌యూవీ పోటీని ఎదుర్కునేందుకు టుసాన్ ఫేస్‌లిఫ్ట్ సహాయపడనుంది. డిజైన్ పరంగా స్వల్ప మార్పులు, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీయర్ ఫీచర్లను అప్‌డేట్ చేసిన టుసాన్ ఫేస్‌లిఫ్ట్‌ను హ్యుందాయ్ ఇప్పటికే ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

1. కోనా ఎలక్ట్రిక్ వెహికల్

దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా నిర్మించిన కోనా ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

సరికొత్త డిజైన్, అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లతో ప్రీమియమ్ ఫీల్ కలిగించే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు రకాల వేరియంట్లో లభ్యం కానుంది. వీటిలో, 39.2kWh బ్యాటరీ వేరియంట్ సింగల్ ఛార్జింగ్‌తో 240కిమీలు మరియు 64kWh వేరియంట్ గరిష్టంగా 390కిమీలు ప్రయాణిస్తుంది.

English summary
Read In Telugu: 9 new Hyundai cars & SUVs for India revealed; Santro to all-new Creta!
Story first published: Monday, March 19, 2018, 16:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark