సాంకేతిక లోపంతో కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో కాలి బూడిదయ్యింది. పబ్లిక్ టీవీ కథనం మేరకు, యాదిగిరి నియోజకర్గ బిజేపీ అభ్యర్థి డాక్టర్ శరణ బోపాల్ రెడ్డికి చెందిన ఎస్‌యూవీ

By Anil Kumar

కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో కాలి బూడిదయ్యింది. పబ్లిక్ టీవీ కథనం మేరకు, యాదిగిరి నియోజకర్గ బిజేపీ అభ్యర్థి డాక్టర్ శరణ బోపాల్ రెడ్డికి చెందిన ఎస్‌యూవీ అని తెలిసింది.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

బోపాల్ రెడ్డి సరిగ్గా నెల రోజుల క్రితం ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. ఎండీవర్‌ ఎస్‌యూవీలో సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఎండీవర్ ఎస్‌యూవీలో మంటలు చెలరేగడానికి గల కారణాలను గుర్తించడానికి పరీక్షల నిమిత్తం కంపెనీకి తరలించినట్లు తెలిసింది.

Picture credit: AppuGouda Talikoti

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

టలు చెలరేగిన వెంటనే ఎండీవర్ ఎస్‌యూవీ యజమాని బోపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులు మరియు డ్రైవర్‌తో సహా అందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎస్‌యూవీ మొత్తం పూర్తిగా దహనమయ్యింది.

Picture credit: Prajavani

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

సాధారణంగా వేసవి కాలంలో కార్లు అధిక సంఖ్యలో మంటల్లో కాలిపోతాయి. వేసవి కాలంలో వచ్చే వేడి మరియు కారు ఎక్కువ సేపు ప్రయాణించడంతో వచ్చే వేడి కారణంగా వైర్లు మరియు ఇంజన్ పరిసర ప్రాంతాల్లో నిప్పులు రాజుకున్న మంటలు చెలరేగే అవకాశం ఉంది.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్ తొలుత 2016లో విపణిలోకి లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఇది మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రెండ్ మరియు టైటానియం మరియు పెద్ద వెర్షన్ 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ టైటానియం.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

ఇందులోని శక్తివంతమైన 2.2-లీటర్ ఇంజన్ 155బిహెచ్‌పి పవర్ మరియు 358ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా, 3.2-లీటర్ ఐదు సిలిండర్ల ఇంజన్ 194బిహెచ్‌పి పవర్ మరియు 470ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతున్నాయి.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD) ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 28.29 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటా ఫే, శాంగ్‌యాంట్ రెక్ట్సాన్, మిత్సుబిషి పజేరో మరియు ఇసుజు ఎమ్‌యు-7 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాలం చెల్లిన వాహనాలు ఎక్కువగా అగ్నికి ఆహుతైపోతాయి. కానీ, కొన్న నెల రోజులకే మంటల్లో కాలి బూడిదవ్వడం సాధారణ విషయమేమీ కాదు. తయారీ లోపం లేదా మరే ఇతర సాంకేతిక కారణంతోనైనా ఇలా జరగవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ ఘటన నుండి ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ వేసవిలో మీ వాహనాలు మంటల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి.

కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

1. వేసవిలో మంటల నుండి కారును రక్షించుకునేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం....

2.కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

3.మీ కార్ మైలేజీని లెక్కించడం ఎలా?

4.అధిక వేడి వలన కారు బ్యాటరీ తగలబడుతుందా?

5.టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

Most Read Articles

English summary
Read In Telugu: Ford Endeavour Catches Fire — Passengers Safe! Escape Without Injuries
Story first published: Tuesday, April 10, 2018, 19:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X