మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

2018 సంవత్సరం భారత వాహన పరిశ్రమకు అతి ముఖ్యమైనది కానుంది. ఈ ఏడాదిలోనే 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో జరగనుంది. దీనికి తోడు ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల విడుదలకు కంపెనీలు సిద్దమయ్యాయి.

By Anil

ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కొత్త కార్లు మరియు బైకుల విడుదలకు నిలయమైన 2017 మరపురాని సంవత్సరంగా నిలిచిపోయింది. అయితే, ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్, అప్‌గ్రేడెడ్ మోడళ్లు, ఎంట్రీ లెవల్ మరియు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల విడుదలకే పరిమితమైంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

ఏదేమైనప్పటికీ, 2018 సంవత్సరం భారత వాహన పరిశ్రమకు అతి ముఖ్యమైనది కానుంది. ఈ ఏడాదిలోనే 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో జరగనుంది. దీనికి తోడు ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల విడుదలకు కంపెనీలు సిద్దమయ్యాయి. మధ్య తరగతి కుటుంబాలను ఆకట్టుకోవడానికి వస్తున్న కార్ల జాబితా ఇవాళ్టి స్టోరీలో...

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur Near Nandi Upachar - DriveSpark
బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

2018 హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో, శాంట్రో విడుదల అనంతరం 16 ఏళ్ల తరువాత మార్కెట్ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు మళ్లీ కొత్త వెర్షన్‌లో డెవలప్ చేసి 2018 శాంట్రో కారును రీలాంచ్ చేయడానికి హ్యుందాయ్ సిద్దమైంది. అధునాతన సాంకేతిక ఫీచర్లతో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా వస్తోంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

హ్యుందాయ్ కొత్త తరం శాంట్రోకు సంభందించిన సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, 800సీసీ ఇంజన్‌ను మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

  • విడుదల అంచనా: 2018 మధ్య భాగానికి
  • ధర అంచనా: రూ. 3.5 లక్షల నుండి రూ. 4.5 లక్షల మధ్య
  • బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

    డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్

    జపాన్‌కు చెందిన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల తయారీ దిగ్గజం డాట్సన్ రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును 800సీసీ ఇంజన్ మరియు 1.0లీ ఇంజన్‌లతో అందుబాటులో ఉంచింది. అయితే, రెడి-గో పవర్‌ఫుల్ వెర్షన్ 1.0-లీటర్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మిస్సయ్యింది.

    బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

    డాట్సన్ తమ రెడి-గో ఆటోమేటిక్ కారును ఈ ఏడాదిలో లాంచ్ చేయనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశపు అత్యంత సరసమైన ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలవనుంది.

    • విడుదల అంచనా: 2018 ప్రారంభంలో
    • ధర అంచనా: రూ. 3.8 లక్షల నుండి రూ. 4 లక్షల మధ్య
    • Trending On DriveSpark Telugu:

      2018 మారుతి స్విఫ్ట్ ధరలు వచ్చేశాయ్!!

      2017లో పెద్ద డిజాస్టర్‌గా మిగిలిన కార్లు

      12 ఏళ్ల సుదీర్ఘ స్విఫ్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మారుతి

      బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

      నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి ఆల్టో

      భారతదేశపు అతి పెద్ద బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి ఆల్టో. మారుతి ఆల్టో విపణిలోకి విడుదలైనప్పటి నుండి తిరుగులేని ఫలితాలు సాధిస్తూ ఎన్నో సంవత్సరాల పాటు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఆల్టో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూనే వస్తోంది. దీని స్థానంలో భారీ మార్పులు చేర్పులతో అభివృద్ది చేసిన సరికొత్త ఆల్టో కారును మారుతి ప్రవేశపెట్టనుంది.

      బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

      మారుతి గత ఏడాది విడుదల చేసిన ఇగ్నిస్ డిజైన్ శైలిలో కొత్త తరం ఆల్టో కారును డెవలప్ చేసి, సరికొత్త డిజైన్ సొబగులు, కొత్త ఫీచర్లు మరియు తప్పనిసరి భద్రత ఫీచర్లుగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను అందివ్వనుంది. సాంకేతికంగా 800సీసీ ఇంజన్ మరియు కె-సిరీస్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందివ్వనుంది.

      • విడుదల అంచనా: 2018 మలిసగంలో
      • ధర అంచనా: రూ. 2.5 లక్షల నుండి రూ. 3.5 లక్షల మధ్య
      • బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

        2018 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

        మారుతి ఇండియా లైనప్‌లో ఆల్టో తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ వ్యాగన్ఆర్. విడుదలయ్యి కొన్ని సంవత్సరాలు కావస్తున్నా... ఎలాంటి అప్‌డేట్స్ చేయకపోయినా... మారుతికి నిరంతరం అత్యుత్తమ విక్రయాలు సాధించిపెడుతోంది. ఏదేమైనప్పటికీ, మారుతి తమ వ్యాగన్ఆర్‌లో ఎన్నో మార్పుల చేసి, అధునాతన డిజైన్ శైలి మరియు కొత్త ఫీచర్లతో 2018 వ్యాగన్ఆర్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది.

        బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

        మారుతి కొత్త వ్యాగన్ఆర్ చూడటానికి అచ్చం ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉండనుంది. అదే టాల్ బాయ్ బాడీ డిజైన్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో ఫ్రెష్ లుక్‌ అందివ్వనుంది. ఇంటీరియర్‌లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా రానున్నాయి.

        • విడుదల అంచనా: 2018 చివరి నాటికి
        • ధర అంచనా: రూ. 4.2 లక్షల నుండి రూ. 5.5 లక్షల మధ్య
        • బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

          కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్

          2018లో విడుదలకు సిద్దమైన కొత్త తరం స్విఫ్ట్ సంచలనాత్మకంగా మారనుంది. గత ఏడాది విడుదలైన కొత్త తరం డిజైర్ కారు మార్కెట్‌లో సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. డిజైర్‌తో పోల్చుకుంటే స్విఫ్ట్ కారుకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మారుతి తమ పాత మోడళ్లను పునరుద్దరించే క్రమంలో మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ కారును కొత్త డిజైన్ అప్‌డేట్స్ మరియు ఇప్పటి వరకు పరిచయమవ్వని ఫీచర్లతో స్విఫ్ట్ లాంచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

          బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

          కొత్త తరానికి చెందిన 2018 మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో వస్తోంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా ఇది వరకు లభించే స్విఫ్ట్‌లో ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తప్పనసరి కానున్నాయి.

          • విడుదల అంచనా: 2018 ఫిబ్రవరి లో
          • ధర అంచనా: రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య
          • బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

            డాట్సన్ గో క్రాస్

            డాట్సన్ గో క్రాస్ ప్రొడక్షన్ వెర్షన్‌ను జనవరి 18, 2017 న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ డాట్సన్ గో క్రాస్ కాన్సెప్ట్ రూపంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. స్పోర్టివ్ మరియు పదునై డిజైన్ లాంగ్వేజ్‌లో ప్రొడక్షన్ దశకు చేరుకున్న గో క్రాస్ పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైంది.

            బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

            డాట్సన్ ఈ గో క్రాస్ కారును గో హ్యాచ్‌బ్యాక్ మరియు డాట్సన్ ఇండియా లైనప్‌లో ఉన్న ఇతర మోడళ్ల ఆధారంగా రూపొందించింది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు వంటి ఫీచర్లతో అత్యంత స్టైలిష్ లుక్‌ను సొంతం చేసుకుంది.

            • విడుదల అంచనా: 2018 చివరి నాటికి
            • ధర అంచనా: రూ. 4.5 లక్షల నుండి రూ. 5.5 లక్షల మధ్య
            • బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

              ఫోర్డ్ ఫిగో క్రాస్

              ఫోర్డ్ ఫిగో ఇంజన్ పరంగా అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకుంది. అయితే, డిజైన్ పరంగా ఫోర్డ్ ఫిగో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు ఫిగో ఆధారిత క్రాసోవర్ కారును ప్రవేశపెట్టి ఇండియన్ కస్టమర్లను చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.

              బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

              ఫోర్డ్ ఫిగో క్రాస్ నిజానికి ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత మోడల్ అయినప్పటికీ, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో క్రాసోవర్ తరహా మార్పులకు పెద్దపీట వేస్తోంది. బాడీ క్లాడింగ్, ముందు మరియు వెనుక వైపున ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్(185ఎమ్ఎమ్) మరియు ఎన్నో ప్రీమియమ్ ఫీచర్లను అందిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Affordable Cars Launching In India During 2018; All-New Hyundai Santro Is One Of Them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X