ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

ఆటో రిక్షాల నుండి వచ్చే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయించుకుంది.

By Anil Kumar

రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం నుండి పట్టణాలను కాపాడుకునేందుకు దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేపడుతున్నాయి. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి గల చక్కటి ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడమే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపడుతోంది.

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

ట్రాఫిక్ అంతరాయం కారణంగా పెట్రోల్ మరియు డీజల్ వాహనాలు వెదజల్లే కాలుష్య కారకాల ద్వారా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇందులో ప్రత్యేకంగా ఆటో రిక్షాల నుండి వచ్చే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయించుకుంది.

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పెట్రోల్ మరియు డీజల్ ఆటోలను వదిలి ఇ-ఆటో రిక్షాలను కోనుగోలు చేసే విధంగా ప్రోత్సహించడానికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

గుంటూరు జిల్లా అధికారి కోన శశిధర్ మరియు జీఎమ్‌సీ కమీనషనర్ శ్రీకేష్ బి లథ్కర్ మరియు ఇతర అధికార బృందం భారత్ ఆటోమొబైల్ వర్క్స్ తయారు చేసిన ఇ-ఆటోలను పరిశీలించారు. వీటికి ట్రయల్ ట్రన్ నిర్వహించిన అనంతరం వీటి పనితీరు మరియు ప్రయోజనాలు సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా సుమారుగా 30,000 ఆటోలు ఉన్నాయి. గాలి కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇ-ఆటో రిక్షాలను ఉపయోగించేందుకు వీటి రిజిస్ట్రేషన్ మరియు రోడ్డు మీద తిరగడానికి అనుమతులు మంజూరు చేస్తామని వివరించాడు."

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

నగరంలో ఇప్పటికే పెట్రోల్ లేదా డీజల్ ఆటోల రిజిస్ట్రేషన్‌ను బ్యాన్ చేశామని పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా సరే మెరుగైన ఫలితాలు అందించే ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే వినియోగదారులను మరియు తయారీదారులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 1.5 లక్షలుగా ఉంటే, డీజల్ మరియు ఇతర ఇంధనాలతో నడిచే ఆటోల ధరలు రూ. 3.5 లక్షల వరకు ఉన్నాయి. ఎలక్ట్రిక్-ఆటో రిక్షాలను రీ-ఛార్జ్ చేసుకోవచ్చు మరియు వీటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.

Most Read Articles

English summary
Read In Telugu: Andhra Pradesh: E-Autos to hit roads in Guntur
Story first published: Saturday, July 7, 2018, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X