ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలవుతున్న కొత్త కార్లు, బైకుల లైవ్ అప్‌డేట్స్

Posted By:

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఆటో ఎక్స్‌పో 2018 ప్రత్యేక కవరేజ్‌కు స్వాగతం. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఢిల్లీ మరియు గ్రేటర్ నోయిడాలో జరిగే వాహన ప్రదర్శన ప్రారంభమైంది. 14 వ ఎడిషన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే మరియు ప్రదర్శించబడే కొత్త కార్లు, బైకులు మరియు ఇతర కాన్సెప్ట్ వాహనాల లైవ్ కవరేజ్‌ కోసం డ్రైవ్‌స్పార్క్ బృందం ఇప్పటికే ఆటో ఎక్స్‌పో వేదికను చేరుకుంది.

ఆటో ఎక్స్‌పోలో కార్లు మరియు బైకుల కంపెనీలు ఆవిష్కరించే ప్రతి కొత్త మోడళ్ల గురించి పూర్తి వివరాలు, ఫోటోలు మరియు వీడియోలను డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనాల ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తోంది.

ఆటో ఎక్స్‌పో 2018 డ్రైవ్‌స్పార్క్ లైవ్ అప్‌డేట్స్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018లో ఈ సారి 37 వాహన తయారీ సంస్థలు మరియు ఆటోమొబైల్ ఆధారిత పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదికలో నూతన కార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఎన్నో కొత్త వాహనాలను వేదికను అలకరించనున్నాయి.

Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight
ఆటో ఎక్స్‌పో 2018 డ్రైవ్‌స్పార్క్ లైవ్ అప్‌డేట్స్

భారత్‌లో ఉన్న దిగ్గజ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, టీవీఎస్, యమహా మరియు లగ్జరీ బ్రాండ్లు అయిన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, కవాసకి వంటి సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించబోతున్నాయి.

ఆటో ఎక్స్‌పో 2018 డ్రైవ్‌స్పార్క్ లైవ్ అప్‌డేట్స్

ఆటో ఎక్స్‌పో 2018 వద్ద డ్రైవ్‌స్పార్క్ బృందం

భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక నూతన కార్లు మరియు బైకుల ఆవిష్కరణకు పూర్తి స్థాయిలో సిద్దమైంది. ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే కార్లు మరియు బైకుల లైవ్ కవరేజ్ కోసం డ్రైవ్‌స్పార్క్ టీమ్ ఆటో ఎక్స్‌పో మార్ట్‌ను చేరుకుంది. మినిట్-టు-మినిట్ అప్‍‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

English summary
Read In Telugu: Auto Expo 2018 LIVE Updates: New Car & Bike Launches, Unveils, Concepts, Showcases, Images & More

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark