ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు సర్వం సిద్దం: తేదీ, అడ్రస్, టికెట్స్, టైమింగ్స్, ఈవెంట్ సమస్త సమాచారం మీకోసం

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఆటో ఎక్స్‌పో(delhi auto expo 2018) కోసం ఎదురుచూస్తున్నారా....? అయితే, ఆటో ఎక్స్‌పో తేదీలు, వేదిక వివరాలు, టికెట్ ధరలు, టైమింగ్స్, మ్యాప్స్ మరియు ఇంకా ఎన్నో వివరాలు...

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఫెస్టివల్ "ఇండియన్ ఆటో ఎక్స్‌పో" 14 వ ఎడిషన్ ఫిబ్రవరి 7, 2018వ తేది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దేశీయ మరియు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలు మరియు ఆటోమొబైల్ టెక్నాలజీలను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి.

ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఆటో ఎక్స్‌పో కోసం ఎదురుచూస్తున్నారా....? అయితే, ఆటో ఎక్స్‌పో తేదీలు, వేదిక వివరాలు, టికెట్ ధరలు, టైమింగ్స్, మ్యాప్స్ మరియు ఇంకా ఎన్నో వివరాలు ఇవాళ్టి కథనంలో...

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో 2018 తేదీలు

14 వ ఎడిషన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పో జరిగే తేదీలను ఆటో ఎక్స్‌‌పో సభ్యులు వెల్లడంచారు. ఫిబ్రవరి 9 నుండి 14, 2018 మధ్య పబ్లిక్ కోసం షెడ్యూల్ చేయగా, ఫిబ్రవరి 7 మరియు 8 వ తేదీలను మీడియాకు ప్రతినిధులకు మాత్రమే కేటాయించారు.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో 2018 జరిగే వేదిక వివరాలు

ఈ సారి ఆటో ఎక్స్‌పో రెండు వేదికలలో(గ్రేటర్ నోయిడా, న్యూ ఢిల్లీ) జరగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఆటో ఎక్స్‌పో మార్ట్‌లో 2018 ప్రధాన ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తారు. అన్ని కార్ల ఆవిష్కరణ ఇక్కడే జరుగుతుంది. ఇకపోతే విడిభాగాలకు సంబంధించిన ఆటో ఎక్స్‌పోను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తారు.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో 2018 అడ్రస్ వివరాలు

దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా జరగబోయే భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఆటో ఎక్స్‌పో 2018 చిరునామా.

ఇండియా ఎక్స్‌పొజిషన్ మార్ట్ లిమిటెడ్,

ప్లాట్ నెంబర్: 25, 27, 28, 29,

నాలెడ్జ్ పార్క్, గ్రేటర్ నోయిడా,

ఉత్తర్ ప్రదేశ్.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో 2018 టికెట్లు

ఆటో ఎక్స్‌పో 2018లో ఫిబ్రవరి 9 నుండి 14, 2018 మధ్య తేదీలలో ప్రజా సందర్శనకు మాత్రమే అనుమతిస్తారు. మొదటి రెండు రోజులు కేవలం ప్రెస్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఆటో ఎక్స్‌పో 2018 టెకెట్లను బుక్‌మైషో ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో కూడా ఆటో ఎక్స్‌పో టికెట్లు లభ్యమవుతున్నాయి.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో2018 టైమింగ్స్

ఆటో ఎక్స్‌పో 2018 తేదీలు, ప్రతి రోజూ ప్రారంభమయ్యే సమయాలు మరియు టికెట్ ధరలు

Date Business Hour & Price Public Hours &Price
Feb 9 10:00 AM & Rs 750 1:00 PM & Rs 350
Feb 10 No Business Hours 10:00 AM & Rs 475
Feb 11 No Business Hours 10:00 AM & Rs 475
Feb 12 10:00 AM & Rs 750 1:00 PM & Rs 350
Feb 13 10:00 AM & Rs 750 1:00 PM & Rs 350
Feb 14 No Business Hours 10:00 AM & Rs 450
ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

ఆటో ఎక్స్‌పో 2018 వద్ద అత్యవసర ఫోన్ నెంబర్లు

ఆటో ఎక్స్‌పోలో అగ్ని ప్రమాదం లేదా ఏదైనా ఊహించని సంఘటన జరిగితే అత్యంతవసర సమయాల్లో సహాయం కోసం క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.

  • ప్రమాదం మరియు శారీరక గాయాలు: 10999
  • అగ్నిమాపక సేవలు: 101
  • అంబులెన్స్: 102
  • పోలీస్: 100
  • Centralised Accident and Trauma Services వారి అంబులెన్స్: 1099
  • ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    ఆటో ఎక్స్‌పో 2018 మ్యాప్

    ఆటో ఎక్స్‌పో 2018 లో పలు రకాల ప్రదర్శన వేదికలు, సమావేశ సౌకర్యాలు, బిజెనెస్ సంబంధిత చర్చాగోష్టి వేదికలు, ఎంట్రీ మరియు ఎక్సిట్ ద్వారాలు ఉన్నాయి.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    మోటార్ షో:

    ఆటో ఎక్స్‌పో మార్ట్ మొత్తం 58 ఎకరాల్లో ఉంది. సుమారుగా 65,000 చదరపు మీటర్లలో ప్రదర్శన వేదికలు, సమావేశ సౌకర్యాలు, బిజినెస్ మరియు విఐపి లాంజ్, ఫుడ్ కోర్ట్స్, పార్కింగ్ ఏరియా, స్టోరేజ్ చేసే గోదాములు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రదర్శన ప్రదేశాల్లో ఉచిత వై-ఫై మరియు భద్రత కోసం సీసీటీవి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    ఆటో ఎక్స్‌పో జరిగే ప్రదేశం మొత్తంలో 12 ఎంట్రీ మరియు ఎక్సిట్ ద్వారాలు ఉన్నాయి. వీటిలో 3 మరియు 4 ప్రధాన ఎంట్రీలు. 16 ఎగ్జిబిషన్ హాల్స్, పలు రకాల ఫుడ్ స్టాళ్లు, మెడికల్ సెంటర్లు, ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ లాట్ మరియు మీడియా హాల్స్ ఉన్నాయి.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    కాంపోనెంట్ షో

    కాంపోనెంట్ షోలో కార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు, టెక్నాలజీ మరియు ఆటోమొబైల్స్‌కు సంబంధించిన విడిభాగాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రగతి మైదాన్‌లోని 7A-H, 8-12A, lake hangar (hall A-C) హాళ్లలో ఏర్పాటు చేశారు.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    ఆటో ఎక్స్‌పో 2018లో పాల్గొంటున్న సంస్థలు

    2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 37 వాహన తయారీ సంస్థలు మరియు పలు రకాల బహుళజాతి సంస్థలు వివిధ కార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఆటోమొబైల్ టెక్నాలజీలను ప్రదర్శిస్తాయి. విడిభాగాల ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 20 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి. ఇందులో చాలా వరకు ఇండియన్ కెంపెనీలే అధికంగా ఉండనున్నాయి.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    14 వ ఎడిషన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, టయోటా మోటార్స్, మహీంద్రా మరియు ఇతర సంస్థలు పాల్గొంటున్నాయి.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    భారత్‌లో ఇది వరకే ఉన్న కంపెనీలతో పాటు, కొత్తగా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న కియా మోటార్స్ మరియు ఎమ్‌జి మోటార్స్ తమ అధునాతన కార్లు, ఎస్‌యూవీలు మరియు ఎమ్‌పీవీ వాహనాలతో ఆటో ఎక్స్‌పోకు వస్తున్నాయి.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    కొన్ని కంపెనీలు భారీ అంచనాలతో ఆటో ఎక్స్‌పో 2018 కోసం సన్నద్దమవుతుంటే, మరికొన్ని సంస్థలు ఈ ఎక్స్‌పోకు దూరంగా ఉన్నాయి. అవి, వోక్స్‌వ్యాగన్ గ్రూప్(వోక్స్‌వ్యాగన్, ఆడి, స్కోడా మరియు ఇతర కంపెనీలు), నిస్సాన్ ఇండియా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ మరియు ఇంకా ఎన్నో కంపెనీలు.

    ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    భారత్‌లో వాహన పరిశ్రమ శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు బడ్జెట్ ఫ్రెండ్లీ మరియు లగ్జరీ కార్ల కంపెనీలు భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో ఎక్స్‌పో వేదికగా పలు కొత్త మోడళ్లతో ఆటోమొబైల్ ఔత్సాహికులను ఆకర్షించడానికి కంపెనీలు సిద్దమయ్యాయి. మరి మీరు సిద్దమయ్యారా...?

    వారం రోజుల పాటు జరిగే ఆటో ఎక్స్‌పోను డ్రైవ్‌స్పార్క్ బృందం ఢిల్లీ నుండి కవర్ చేయనుంది. ఆటో ఎక్స్‌పో మినిట్-మినిట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: All You Need To Know - Dates, Venue Address, Ticket Price, Timings, Map & More
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X