బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదలను ఖరారు చేసిన బజాజ్ ఆటో

గతంలో బజాజ్ ఆటో తమ క్యూట్ స్మాల్ కారును రూ. 60 వేలకే విడుదల చేస్తున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. అయితే, వాటిని పుకార్లుగా కొట్టిపారేశారు. కానీ బజాజ్ ఆటో ఈ ఏడాది తమ క్యూట్ స్మాల్ కారును ఇండియన్ మార్కెట్

By Anil Kumar

గతంలో బజాజ్ ఆటో తమ క్యూట్ స్మాల్ కారును రూ. 60 వేలకే విడుదల చేస్తున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. అయితే, వాటిని పుకార్లుగా కొట్టిపారేశారు. కానీ బజాజ్ ఆటో ఈ ఏడాది తమ క్యూట్ స్మాల్ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనుమతులు లభించాయి.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న బజజ్ క్యూట్ ఇండియన్ మార్కెట్లోకి వస్తోందంటే ఆశ్చర్యకరంగా ఉంది కదూ....? బజాజ్ క్యూట్ గురించి మరియు ఇండియాలో దీని విడుదల వెనకున్న సాధ్యాసాధ్యాలు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం...

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

బజాజ్ ఆటో సరిగ్గా ఏడేళ్ల క్రితం క్యూట్ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేసింది. ఇంత వరకు ఎన్నో దశలలో పరీక్షించబడుతూ వచ్చిన క్యూట్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. క్యూట్ పేరుతో పిలువబడే ఇది నిజానికి కారు కాదు, సాంకేతికంగా దీనిని క్వాడ్రిసైకిల్ అంటారు.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఇలాంటి క్వాడ్రిసైకిల్స్‌కు అనుతి లేదు. దాంతో బజాజ్ తమ క్యూట్ కార్లను ఇండియా నుండి క్వాడ్రిసైకిల్స్ విక్రయాలు మరియు వినియోగాన్ని అనుమతించే దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

ఫ్రాన్స్ వంటి దేశాలలో క్వాడ్రిసైకిల్స్‌ వినియోగించేందుకు అనుమతి ఉంది. ఫ్రాన్స్‌లో క్వాడ్రిసైకిల్స్ నడపడానికి కనీస వయస్సు మరియు ప్రత్యేక పరిమితులు అవసరం. అంతే కాకుండా ఇలాంటి వాహనాలకు ప్రత్యేకమైన భద్రతా పరీక్షలు మరియు క్రాష్ పరీక్షలు ఉంటాయి.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

ఇండియాలో ఉన్న రహదారి పరిస్థితులకు అనుగుణంగా క్వాడ్రిసైకిల్స్‌కు అనుమతి లేదు. కానీ, సుదీర్ఘ ప్రయత్నం అనంతరం క్వాడ్రిసైకిల్స్ విడుదలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొందిన తరువాత ఈ ఏడాదిలోనే దీని విడుదల ఉండనుంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

కేంద్ర రోడ్డు రవాణా మరియు మంత్రిత్వ శాఖ నుండి లభించిన అనుమతుల మేరకు బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయించనుంది. అంటే, వ్యక్తిగత అవసరాలకు ఇది లభించదు.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

ఇండియన్ రోడ్ల మీద మూడు చక్రాల ఆటో రిక్షాలను క్యూట్ క్వాడ్రిసైకిల్ భర్తీ చేయనుంది. మూడు చక్రాల ఆటోల కంటే క్వాడ్రిసైకిల్‌లో ప్రయాణం సురక్షితమైనది. కఠినమైన రోడ్ల మీద మూడు చక్రాల ఆటోల కంటే నాలుగు చక్రాలు క్వాడ్రిసైకిల్స్ ఎంతో మెరుగైనవి.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

నాలుగు డోర్లు ఉన్న ఇందులో డ్రైవర్‌తో సహా నలుగు మాత్రమే ప్రయాణించవచ్చు. ప్రస్తుతం దేశీయంగా క్వాడ్రిసైకిల్స్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో నెలకు 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌లో సాంకేతికంగా 217సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 13బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ కాస్త ఆలస్యంగా సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభించనుంది. తొలుత దీనిని ప్యాసింజర్ అవసరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. మార్కెట్లో ఉన్న అవకాశాలను అధ్యయనం చేసుకొని లగేజ్ క్యారీయర్‌గా కూడా పరిచయం చేయనుంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదల ఖరారు

బజాజ్ క్యూట్ స్మాల్ కారు టాటా నానో కంటే చిన్నది. బజాజ్ క్యూట్ పొడవు 2,750ఎమ్ఎమ్, వెడల్పు 1,312ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,650ఎమ్ఎమ్. బజాజ్ క్యూట్ గరిష్ట వేగం గంటకు 70కిలోమీటర్లుగా ఉంది.

Source: ETAuto

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Qute quadricycle’s launch timeline in India finally REVEALED
Story first published: Thursday, June 7, 2018, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X