మహిళా దినోత్సవ ప్రత్యేకం: ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు డ్రైవింగ్ అనేది పురుషులు వృత్తి మాత్రమే, ఇప్పుడు మహిళలు కూడా క్యాబ్ మరియు అద్దె కార్ల సర్వీసులను నిర్వహిస్తూ డ్రైవర్లు రాణిస్తున్నారు.

By Anil Kumar

మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు డ్రైవింగ్ అనేది పురుషులు వృత్తి మాత్రమే, ఇప్పుడు మహిళలు కూడా క్యాబ్ మరియు అద్దె కార్ల సర్వీసులను నిర్వహిస్తూ డ్రైవర్లు రాణిస్తున్నారు. ఫ్యామిలీలో భర్తతో పాటు భార్యలు కూడా కార్లను డ్రైవ్ చేస్తున్నారు. సొంత అవసరాలకు తామే స్వయంగా కార్లను నడుపుతున్న మహిళా మణులు కూడా ఎందరో ఉన్నారు.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ కార్ల గురించి స్పెషల్ స్టోరీ...

ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

13. వోక్స్‌వ్యాగన్ పోలో

అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో వోక్స్‌వ్యాగన్ పోలో ఒకటి. పవర్‌ఫుల్ కార్లను కోరుకునే మహిళలు శక్తివంతమైన పోలో హ్యాచ్‌బ్యాక్‌ను ఎంచుకోవచ్చు. వోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరింయట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభ్యమవుతోంది.

  • వోక్స్‌వ్యాగన్ పోలో ధరల శ్రేణి రూ.5.93 లక్షల నుండి రూ. 10.60 లక్షల మధ్య ఉంది.
  • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

    12. హోండా జాజ్ ఆటోమేటిక్

    ఈ జాబితాలో 12 స్థానంలో నిలిచిన హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ అత్యంత స్టైలిష్ కారు. మహిళలు, పురుషులతో పాటు యువ కస్టమర్లకు కూడా ఇది బాగా నప్పుతుంది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. హోండా జాజ్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 19కిమీలుగా ఉంది.

    • హోండా జాజ్ ధరల శ్రేణి రూ. 6.06 లక్షల నుండి రూ. 9.41 లక్షల మధ్య ఉంది.
    • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

      11. మారుతి సుజుకి బాలెనో ఆటోమేటిక్

      భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మరియు మోస్ట్ పాపులర్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో. మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనిస్తూ విపణిలోకి విడుదలైన మారుతి బాలెనో భారీ విక్రయాలు సాధించింది. బాలెనో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మహిళలకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 21.4 కిమీలుగా ఉంది.

      • మారుతి సుజుకి బాలెనో ధరల శ్రేణి రూ. 5.46 లక్షల నుండి రూ. 8.46 లక్షల మధ్య ఉంది.
      • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

        10. ఫోర్డ్ ఫిగో

        అత్యంత శక్తివంతమైన మరియు సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఫోర్డ్ ఫిగో ఒకటి. ఫిగో హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తోంది. గేర్లను మార్చడంలో తికమకపడేవాళ్లు ఫిగో ఆటోమేటిక్ ఎంచుకోవచ్చు. ఇది లీటర్‌కు 17కిమీల మైలేజ్ ఇస్తుంది.

        • ఫోర్డ్ ఫిగో ధరల శ్రేణి రూ. 5 లక్షల నుండి రూ. 8.09 లక్షల మధ్య ఉంది.
        • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

          09. నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్

          నిస్సాన్ మైక్రా హ్యాచ్‍‌బ్యాక్ డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఆఫీసులకు మరియు కాలేజీలకు వెళ్లే మహిళలు రోజు వారి అవసరాలకు నిస్సాన్ మైక్రా చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. నిస్సాన్ మైక్రా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభ్యమవుతోంది. నిస్సాన్ మైక్రా పెట్రోల్ ఆటోమేటిక్ లీటర్‌కు 19.34కిమీల మైలేజ్ ఇస్తుంది.

          • నిస్సాన్ మైక్రా ధరల శ్రేణి రూ. 5.99 లక్షల నుండి రూ. 7.43 లక్షల మధ్య ఉంది.
          • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

            08. మారుతి సుజుకి స్విఫ్ట్ ఆటోమేటిక్

            మారుతి సుజుకి భారీ డిజైన్ మార్పులు మరియు అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లతో మూడవ తరానికి చెందిన సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా విపణిలోకి లాంచ్ చేసింది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 22కిమీలుగా ఉంది.

            • కొత్త తరం మారుతి స్విఫ్ట్ ధరల శ్రేణి రూ. 4.99 లక్షల నుండి రూ. 8.29 లక్షల మధ్య ఉంది.
            • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

              07. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఏఎమ్‌టి

              హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కారు. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించే గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‍‌ను మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు. సిటీ మరియు ఇరుకైన రోడ్ల మీద గ్రాండ్ ఐ10 కారును చాలా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. గ్రాండ్ ఐ10 పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ 17.49కిమీలుగా ఉంది.

              • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10ధరల శ్రేణి రూ. 4.72 లక్షల నుండి రూ. 7.49 లక్షల మధ్య ఉంది.
              • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                06. హోండా బ్రియో ఆటోమేటిక్

                హోండా బ్రియో విపణిలో ఉన్న ఒక గుడ్ లుకింగ్ కారు. బ్రియో ఆశించిన మేర ఫలితాలు సాధించలేదు. అయినప్పటికీ మహిళలకు దీనిని డ్రైవ్ చేయడం ఎంతో తేలిక. డ్రైవర్ సీటులో కూర్చుకునే రోడ్డును క్లియర్‌గా చూడవచ్చు. ప్రస్తుతం, బ్రియో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. బ్రియో పెట్రోల్ ఏఎమ్‌టి మైలేజ్ లీటర్‌కు 16.5కిమీలుగా ఉంది.

                • హోండా బ్రియో ధరల శ్రేణి రూ. 4.81 లక్షల నుండి రూ. 6.9 లక్షల మధ్య ఉంది.
                • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                  05. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

                  ఇండియన్ ఫ్యామిలీలు ఎక్కువగా ఎంచుకుంటున్న కార్లలో మారుతి వ్యాగన్ఆర్ ఒకటి. వయసు పైబడి వ్యక్తులు మరియు అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్న యువతీ యువకులకు వ్యాగన్ఆర్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. గత పదేళ్ల కాలంలో భారీ విక్రయాలు సాధిస్తున్న వ్యాగన్ఆర్ పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. వ్యాగన్ఆర్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 20.5కిమీలుగా ఉంది.

                  • మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధరల శ్రేణి రూ. 4.29 లక్షల నుండి 5.49 లక్షల మధ్య ఉంది.
                  • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                    04. రెనో క్విడ్ ఆటోమేటిక్

                    రెనో క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సంచలనం సృష్టించిన మోడల్. తొలుత 800సీసీ ఇంజన్‌తో పరిచయమై తరువాత 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యింది. రెనో క్విడ్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 24.04కిలోమీటర్లుగా ఉంది.

                    • రెనో క్విడ్ ధరల శ్రేణి రూ. 2.78 లక్షల నుండి రూ. 4.7 లక్షల మధ్య ఉంది.
                    • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                      03. మారుతి సుజుకి సెలెరియో ఆటోమేటిక్

                      మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును ఇటీవల క్రాసోవర్ వెర్షన్‌లో సెలెరియో ఎక్స్ పేరుతో లాంచ్ చేసింది. స్పోర్టివ్ శైలిలో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకునే వారికి సెలెరియో ఎక్స్ అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. సెలెరియో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. సెలెరియో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 23.1కిమీలుగా ఉంది.

                      • మారుతి సుజుకి సెలెరియో ధరల శ్రేణి రూ. 4.32 లక్షల నుండి రూ. 5.51 లక్షల మధ్య ఉంది.
                      • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                        02. మారుతి సుజుకి ఆల్టో కె10 ఆటోమేటిక్

                        ఆల్టో 800 సక్సెస్‌కు కొనసాగింపుగా ఆల్టో కె10 మోడల్‌ను మారుతి విపణిలోకి ప్రవేశపెట్టింది. ఆల్టో 800 మరియు ఆల్టో కె10 సంయుక్తంగా విడుదలైనప్పటి నుండి 35 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కె10 ఆటోమేటిక్‌ కారును మహిళలకు బాగా సెట్ అవుతుంది. మారుతి ఆల్టో కె10 ఆటోమేటిక్ మైలేజ్ లీటర్‌కు 24.07కిమీలుగా ఉంది.

                        • మారుతి ఆల్టో కె10 ధరల శ్రేణి రూ. 3.45 లక్షల నుండి రూ. 4.3 లక్షల మధ్య ఉంది.
                        • ఇండియన్ మార్కెట్లో మహిళల కోసం ఉన్న బెస్ట్ కార్లు

                          01. టాటా నానో

                          టాటా నానో ఇండియన్ మార్కెట్లోనే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా ఇదే చీపెస్ట్ కారు. కారు కొనాలనుకునే ప్రతి మహిళ కలను టాటా నానో ద్వారా తీర్చుకోవచ్చు. సిటీ అవసరాలకు మరియు తక్కువ పరిధి ప్రయాణాలకు యంగ్ ఉమెన్స్ నానో కారును ఎంచుకోవచ్చు. 624సీసీ ఇంజన్ గల నానో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. నానో ఏఎమ్‌టి మైలేజ్ 21.9కిమీ/లీగా ఉంది.

                          • టాటా నానో ధరల శ్రేణి రూ. 2.37 లక్షల నుండి రూ. 3.29 లక్షల మధ్య ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Womens Day Special- 13 best cars for womens in india
Story first published: Thursday, March 8, 2018, 17:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X