10 లక్షల ధరతో విలాసవంతమైన ఫీచర్లు ఉన్న 12 బెస్ట్ కార్లు

By Anil Kumar
Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

కార్లు కేవలం ప్రయాణం కోసమే అనే కాలం పోయింది. ఒకరు హుందాతనం కోసం, మరొకరు స్టేటస్ కోసం, కొందరు డ్రైవింగ్ ఫీల్ కోసం ఎంచుకుంటే, మరి కొంత మంది విలాసవంతమైన ఫీచర్లు కోసం కొనుకుంటున్నారు. ఇలా ఒక్కో కస్టమర్ తమ తమ అవసరాలకు అనుగుణంగా కార్లను ఎంచుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో కార్లలోని మైలేజ్ మరియు వాటిలోని ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి, ఇవాళ్టి స్టోరీలో 10 లక్షల లోపు బడ్జెట్ ధరలో విలాసవంతమైన ఫీచర్లతో లభించే 12 బెస్ట్ కార్ల గురించి తెలుకుందాం రండి....

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

12. ఫోర్డ్ ఆస్పైర్

ధరకు తగ్గ విలువలతో అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్లు గల కార్ల జాబితాలో ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ 12 వ స్థానంలో నిలిచింది. ఫిగో ఆస్పైర్ 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తోంది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ లభించే ఫోర్డ్ ఆస్పైర్ ధరల శ్రేణి రూ. 5.57 లక్షల నుండి 8.53 లక్షలు.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఇందులో అత్యంత సౌకర్యకరమైన స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 12వోల్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఫుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, ఎత్తు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, ఆర్మ్ రెస్ట్ మరియు కప్ హోల్డర్స్ వంటివి ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

11. వోక్స్‌వ్యాగన్ అమియో

వోక్స్‌వ్యాగన్ ప్రత్యేకించి ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్ కోసం అమియో సెడాన్ కారును అభివృద్ది చేసింది. విపణిలో ఉన్న డిజైర్, ఎక్సెంట్, అమేజ్ మరియు ఫిగో ఆస్పైర్ వంటి కార్లకు పోటీగా వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‍‌బాక్స్‌తో అమియో లభిస్తోంది. వోక్స్‌వ్యాగన్ అమియో ధరల శ్రేణి రూ. 5.56 లక్షల నుండి రూ. 9.91 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

వోక్స్‌వ్యాగన్ అమియో సెడాన్ కారులో పవర్ డోర్ లాక్స్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, సెగ్మెంట్ ఫస్ట్ రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

10. మారుతి ఇగ్నిస్

మారుతి సుజుకి గత ఏడాది ప్రారంభంలో క్రాసోవర్ స్టైల్ ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. మారుతి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఇగ్నిస్ ధరల శ్రేణి రూ. 4.72 లక్షల నుండి రూ. 7.87 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

యువ కొనుగోలు దారులను టార్గెట్ చేస్తూ మారుతి తీసుకొచ్చిన ఇగ్నిస్‌లో ఎయిర్ కండీషనర్, హీటర్, స్టీరింగ్ అడ్జెస్ట్‌మెంట్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, 12వోల్ట్ పవర్ అవుట్‌పుట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, ఎలక్ట్రికల్ ORVM, పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, కీ లెస్ ఎంట్రీ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ గల టచ్ స్క్రీన్ డిస్ల్పే, యుఎస్‌బి, ఏయుఎక్స్, బ్లూటూత్ కనెక్టివిటి, MP2, CD, DVD మరియు AM/FM ప్లేయర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

09. ఫోర్డ్ ఫిగో

ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన మరియు సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఫోర్డ్ ఫిగో ఒకటి, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఫిగో ధరల శ్రేణి రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12వోల్ట్ పవర్ అవుట్‌పుట్, కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్, హీటర్, ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్, కీలెస్ సెంటర్ లాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ కలదు. ఇందులో యుఎస్‌బి, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివి ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

08. మారుతి డిజైర్

మారుతి సుజకి గత ఏడాది సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. న్యూ మారుతి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 5.56 లక్షల నుండి రూ. 9.43 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

న్యూ డిజైర్‌లో మునుపెన్నడూ పరిచయం చేయని ఎన్నో కొత్త ఫీచర్లను జోడించింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూవ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఎంటర్‌టై‌మెంట్ పరంగా... ఇంటిగ్రేడెట్ మ్యూజిక్ సిస్టమ్ గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

07. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ బరిలోకి హ్యుందాయ్ నుండి వచ్చిన మోడల్ గ్రాండ్ ఐ10. స్టైలిష్ డిజైన్‌లో ఉండే గ్రాండ్ ఐ10 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరల శ్రేణి రూ. 4.72 లక్షల నుండి రూ. 7.49 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. జీపీఎస్ న్యావిగేషన్, ఎమ్‌పి3 ప్లేయర్, నాలుగు స్పీకర్లు, యుఎస్‌బి, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

06. టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ ఎస్‌యూవీని గత ఏడాది విపణిలోకి లాంచ్ చేసింది. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యుల్ గేర్‌బాక్స్‌లో లభిస్తోంది. టాటా నెక్సాన్ ధరల శ్రేణి రూ. 6.11 లక్షల నుండి రూ. 9.71 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

డ్యాష్‌బోర్డులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌కు ప్రక్కన 6.5-అంగుళాల పరిమాణం ఉన్న హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ మ్యాప్స్ ఆధారిత టర్న్ బై టర్న్ న్యావిగేషన్ ఉన్నాయి, ఆపిల్ కార్ ప్లే ఫీచర్‌ను కాస్త ఆలస్యంగా పరిచయం చేయనుంది. గ్లోసీ పియానో బ్లాక్ ఫినిషింగ్‌ గల సెంటర్ కన్సోల్ కలదు. ఇక్కడ నుండి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ కండీషన్‌ను కంట్రోల్ చేయవచ్చు. అదనంగా రెండు 12వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు వెనుక ప్రయాణికుల కోసం ఏ/సి వెంట్స్ ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

05. 2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో థర్డ్ జనరేషన్ స్విఫ్ట్‌ను లాంచ్ చేసింది. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. న్యూ మారుతి స్విఫ్ట్ ధరల శ్రేణి రూ. 4.99 లక్షల నుండి రూ. 8.29 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

మారుతి స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌లో ఇప్పటి వరకు పరిచయం చేయని ఫీచర్లను అందించింది. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూవ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

04. ఫోర్డ్ ఇకోస్పోర్ట్

అమెరికాకు చెందిన ఫోర్డ్ టెక్నాలజీకి పెట్టింది పేరు. ఇండియాలో విక్రయించే తమ అన్ని కార్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచింది. అందులో ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీ ఇకోస్పోర్ట్ ఒకటి. ఇకోస్పోర్ట్ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. ఇకోస్పోర్ట్ ధరల శ్రేణి రూ. 7.67 లక్షల నుండి రూ. 11.2 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఫోర్డ్ గత ఏడాది ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలదు. ఇది, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను మరియు 7-స్పీకర్ ఆడియో సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, లెథర్ అప్‌హోల్‌స్ట్రే, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

03. మారుతి బాలెనో

మారుతి ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో బాలెనో కారును పరిచయం చేసింది. బాలెనో కూడా మారుతి లైనప్‌లోని అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది. బాలెనో ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.63 లక్షలుగా ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, కీ లెస్ ఎంట్రీ మరియు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటితో పాటు జిపిఎస్ న్యావిగేషన్ మరియు 4-స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

02. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మొట్టమొదటి సారిగా ఎలైట్ ఐ20 విడుదలతో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను సృష్టించింది. సాంకేతికంగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. ఎలైట్ ఐ20 ధరల శ్రేణి రూ. 5.35 లక్షల నుండి రూ. 9.16 లక్షల మధ్య ఉంది.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఎలైట్ ఐ20 ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల దీనికి ఇంటిగ్రేటెడ్ రేడియో మరియు ఎమ్‌పి3 అనుసంధానం కలదు. ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ గుర్తించే టెక్నాలజీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

01. టాటా టియాగో

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన మొట్టమొదటి మోడల్ టియాగో హ్యాచ్‌బ్యాక్. విడుదలైన అనతి కాలంలోనే ఊహించని సక్సెస్ అందుకుంది. టాటా టియాగో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యమవుతోంది.

టాటా టియాగో ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.37 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 5.95 లక్షలు.

పది లక్షల లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఫీచర్లను అంతగా ఆశించలేము. కానీ టియాగో విషయంలో టాటా అద్బుతమే చేసిందని చెప్పవచ్చు. కనెక్ట్ నెక్ట్స్ న్యావిగేషన్, వాయిస్ కంట్రోల్, 8-స్పీకర్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వంటి హై ఎండ్ కార్లలో వచ్చే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనికి పోటీగా ఉన్న కార్లలో ఈ ఫీచర్లను రాలేదు. అదనంగా, పవర్ విండోస్, ఏబిఎస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 12 Feature Rich Cars in India
Story first published: Friday, March 2, 2018, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more