అత్యధిక మైలేజ్ ఇవ్వగల పది భారతదేశపు ఎస్‌యూవీలు

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

మంచి మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు కావాలన్నపుడు... మంచి మైలేజ్ కావాలా... ఎస్‌యూవీ కావాలా... ఏదో ఒకటే వీలవుతుందని చాలా మంది అంటుంటారు. అయినప్పటికీ, మంచి మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలనే ఇండియన్స్ కోరుకుంటారు.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

ఇండియన్ కొనుగోలుదారుల నాడి పసిగట్టిన కార్ల కంపెనీలు మైలేజ్ అంశంతో ఆకట్టుకునేలా తమ ఎస్‌యూవీలను అందుబాటులోకి తెచ్చాయి. మరి హ్యాచ్‌బ్యాక్ తరహా మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు దొరికితే కస్టమర్లకు అంతకన్నా ఏం కావాలి....? కాబట్టి, ఇవాళ్టి స్టోరీలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే ఇండియన్ ఎస్‌యూవీలు ఏవి ఉన్నాయో చూద్దాం రండి...

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా మోటార్స్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అతి కొద్ది కాలంలోనే మన మార్కెట్ నుండి హోండాకు డబ్ల్యూఆర్-వి బెస్ట్ సెల్లింగ్ మోడల్‍‌గా నిలిచింది. అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హోండా డబ్ల్యూఆర్-విలోని 99బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది. మరియు ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది.

  • హోండా డబ్ల్యూఆర్-వి డీజల్ మైలేజ్: 25.5కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మైలేజ్ కార్లకు రారాజుగా చెప్పుకునే మారుతి సుజుకి ఎస్‌యూవీల విభాగంలో మైలేజ్ పరంగా ఓ మెట్టు క్రిందకు దిగింది. మారుతి సుజుకి గత ఏడాది ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎక్ట్సీరియర్‌లో భారీ మార్పులు జరిపినప్పటికీ, అంతర్గతంగా ఎస్-క్రాస్‌లో మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ పరిచయం చేసింది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఎస్‌యూవీలో 1.6-లీటర్ డీజల్ ఇంజన్ తొలగించి 1.3-లీటర్ డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజన్ గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • మారుతి ఎస్-క్రాస్ డీజల్ మైలేజ్: 25.1కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీ విడుదలతో భారతదేశపు సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ విభాగంలో ఆలస్యంగా పరిచయం అయినప్పటికీ వితారా బ్రిజా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచి మారుతికి భారీ సక్సెస్ సాధించి పెట్టింది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

మారుతి సుజుకి వితారా బ్రిజా కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • మారుతి వితారా బ్రిజా డీజల్ మైలేజ్: 24.3కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ 2017 సంవత్సరంలో సరికొత్త నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదలతో భారతదేశపు సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తొలిసారిగా ప్రవేశించింది. విభిన్నమైన డిజైన్ మరియు ఇంటీరియర్ మరియు ఇంజన్ ఆప్షన్‌ల పరంగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

టాటా నెక్సాన్ లోని 1.5-లీటర్ గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో పాటు 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ యూనిట్లో కూడా లభిస్తోంది.

  • టాటా నెక్సాన్ డీజల్ మైలేజ్: 23.97కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్

ఫోర్డ్ ఇండియా గత ఏడాది విపణిలోకి ఫేస్‌లిఫ్ట్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త పెట్రోల్ ఇంజన్ వెర్షన్ మరియు ఇంటీరియర్, ఎక్టీరియర్ పరంగా పలు మార్పులు చేర్పులు నిర్వహించి లాంచ్ చేసింది. ఏదేమైనప్పటికీ డీజల్ ఇంజన్ ఇకోస్పోర్ట్ అత్యుత్తమ పర్ఫామెన్స్ మరియు మైలేజ్ ఇస్తుంది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 98.5బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో పాటు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో కూడా ఇకోస్పోర్ట్ అందుబాటులో ఉంది.

  • ఫోర్డ్ ఇకోస్పోర్ట్ డీజల్ మైలేజ్: 23కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హోండా బిఆర్-వి

హోండా బిఆర్-వి వెహికల్‌ను ఎస్‌యూవీ మరియు ఎమ్‌పీవీగా చెప్పవచ్చు. హోండా మోటార్స్ బ్రియో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా బిఆర్-వి ఎస్‌యూవీని 7-సీటింగ్ కెపాసిటీతో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో పరిచయం చేసింది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హోండా బిఆర్-వి 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • హోండా బిఆర్-వి డీజల్ మైలేజ్: 21.9కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హ్యుందాయ్ క్రెటా

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. అయితే, ధర విషయంలో మిగతా అన్ని కాంపాక్ట్ ఎస్‌‌యూవీల కంటే ఖరీదైనది. ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, 1.4-లీటర్ డీజల్, 1.6-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

హ్యుందాయ్ క్రెటాలో లభించే 1.4-లీటర్ డీజల్ ఇంజన్ మిగతా ఇంజన్‌లతో పోల్చితే అధిక మైలేజ్ ఇస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88.7బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఇది కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‍‌లో లభిస్తోంది.

  • హ్యుందాయ్ క్రెటా 1.4-లీటర్ డీజల్ మైలేజ్: 21.38కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

నిస్సాన్ టెర్రానో

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీని రెనో డస్టర్ యొక్క జిరాక్స్ కాపీగా చెప్పుకోవచ్చు. నిస్సాన్ మరియు రెనో భాగస్వామ్యంలో నిస్సాన్ ఇండియా డస్టర్ ఆధారంగా టెర్రానో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అయితే, డస్టర్ కంటే టెర్రానో మైలేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీలో 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 85 మరియు 110బిహెచ్‌పి రెండు రకాల పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 85బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే టెర్రానో వేరియంట్ గరిష్టంగా 20.5కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

రెనో క్యాప్చర్

రెనో కొత్తగా విడుదల చేసిన క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ రెనో ఇండియా లైనప్‌లో అతి ముఖ్యమైన మోడల్. డస్టర్‌ను నిర్మించిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే క్యాప్చర్‌ను అభివృద్ది చేసింది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

రెనో క్యాప్చర్ 1.5-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. డస్టర్ నుండి సేకరించిన అదే డీజల్ ఇంజన్ క్యాప్చర్‌లో అత్యుత్తమ మైలేజ్ ఇస్తోంది. ఇది గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • రెనో క్యాప్చర్ డీజల్ మైలేజ్: 20.37కిమీ/లీ
అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

రెనో డస్టర్

భారత్‌లో రెనోకు సక్సెస్ రుచి చూపించిన తొలి మోడల్ డస్టర్. రెనో డస్టర్ విడుదలైన తొలినాళ్లలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇండియన్స్‌కు తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని డస్టర్ ద్వారా పరిచయం అయ్యింది. విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు డస్టర్ ఇప్పటికీ గట్టి పోటీనిస్తోంది.

అధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

రెనో డస్టర్ ఎస్‌యూవీలో 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. డీజల్ వెర్షన్ డస్టర్ 85బిహెచ్‌పి మరియు 110బిహెచ్‌పి పవర్ వేరియంట్లలో లభిస్తోంది. వీటిలో, 85వెర్షన్ ఆటోమేటిక్ మరియు 110వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

  • రెనో డస్టర్ డీజల్ 85బెర్షన్ మైలేజ్: 19.87కిమీ/లీ
గమనిక: పైన పేర్కొన్న కార్ల కంపెనీలకు ఏఆర్ఏఐ ఆమోదించిన మైలేజ్ ఆధారంగా ఆయా ఎస్‌యూవీల మైలేజ్ వివరాలు ఇవ్వబడ్డాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Best mileage suvs in india
Story first published: Friday, January 19, 2018, 14:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark