ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
Kia Motors India New Models Walkaround - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ దేశీయ లగ్జరీ కార్ల విపణిలోకి నూతన ఎమ్5(F 90) ను లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 ప్రారంభ ధర రూ. 1.43 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ప్రతినిధులు వెల్లడించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం....

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5(F90) అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన మోడల్. అంతే కాకుండా ఎమ్5 తొలిసారి ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎమ్5 లగ్జరీ సెడాన్ కారును మొట్టమొదటిసారిగా 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 ఇంజన్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 లో 4.4-లీటర్ కెపాసిటి గల ట్విన్-టుర్భో వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 592బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పాత ఎమ్5 తో పోల్చుకుంటే ఎమ్5 (F 90)వెర్షన్ 40బిహెచ్‌పి పవర్ మరియు 75ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

అంతే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా తమ ఎమ్5 లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందించింది. 8-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా ఎమ్ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నప్పటికీ డ్రిఫ్టింగ్ పిచ్చి ఉన్న కొందరు బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఓనర్లు ఎక్కువ శబ్దం మరియు పొగను తెప్పించేందుకు రియర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ సెలక్ట్ చేసుకుంటారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

కొత్తగా విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, 200కిమీల వేగాన్ని 11.1 సెకండ్లలో అందుకుంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5లో 250కిమీల వేగానికి ఎలక్ట్రికల్‌గా పరిమితి పెట్టారు. పరిమితి లేకపోతే గరిష్టంగా 306కిమీల స్పీడ్ రీచ్ అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 పొడవు 4,965ఎమ్ఎమ్, వెడల్పు 1,903ఎమ్ఎమ్, ఎత్తు 1,473ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,98ఎమ్ఎమ్‌గా ఉంది. మునుపటి తరం ఎమ్5తో పోల్చుకుంటే చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. అయితే, 100కిలోల వరకు బరువు తగ్గింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 నలు దిక్కుల్లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటిలో, ముందు చక్రాలకు 275/40 జడ్ఆర్ 19 కొలతల్లో ఉన్న టైర్లు మరియు వెనుక చక్రాలకు 285/40 జడ్ఆర్ 19 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

బ్రేకింగ్ వ్యవస్థ కోసం ముందు చక్రాలకు 394ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న స్టీల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 381ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఓనర్లు కార్బన్ సిరామిక్ బ్రేకులను మరియు పెద్ద పరిమాణంలో ఉన్న 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఎంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 డిజైన్

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 మునుపటి వెర్షన్‌ ఎమ్5 తో పోల్చుకుంటే అత్యంత అగ్రెసివ్ డిజైన్ కలిగి ఉంది. అగ్రెసివ్ డిజైన్ స్టైల్లో ఉన్న ఫ్రంట్ బంపర్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు లోయర్ స్ల్పిట్టర్ ఎలిమెంట్ వంటివి ఫ్రంట్ డిజైన్‌లో గుర్తించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

సైడ్ డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. అయితే,లావుగా ఉన్నా వీల్ ఆర్చెస్ గమనించవచ్చు. రియర్ డిజైన్ విషయానికి వస్తే, భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న రియర్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు(మొత్తం నాలుగు) ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ లగ్జరీ మరియు పర్ఫామెన్స్ కార్ల లైనప్‌లోకి సరికొత్త ఎమ్‌ 5 వచ్చి చేరింది. శక్తివంతమైన ఇంజన్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ జోడింపుతో ఇండియన్ కస్టమర్లను కొంత వరకు నిరుత్సాహపరిచిందని చెప్పవచ్చ. అయితే, బవేరియన్ మోటార్ వర్క్స్(BMW) రియర్ వీల్ డ్రైవ్ సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి విడుదల చేసిన సచిన్

English summary
Read In Telugu: Auto Expo 2018: BMW M5 Launched In India At Rs 1.43 Crore - Specifications, Features & Images
Story first published: Friday, February 9, 2018, 20:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark