కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీద నుండి 40 అడుగుల ఎత్తుల్లో ఉన్న రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు ట్రాఫిక్‌తో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మీద కుప్పకూలిపోయాయి.

By Anil Kumar

నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీద నుండి 40 అడుగుల ఎత్తుల్లో ఉన్న రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు ట్రాఫిక్‌తో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మీద కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో నెమ్మదిగా కదులుతున్న వాహనాల్లో ప్రయాణిస్తున్న 19 మంది మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వారణాసిలో చోటు చేసుకుంది.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

వివరాల్లోకి వెళితే త్వరలో ప్రారంభానికి సిద్దమైన ఫ్లైఓవర్ క్రింది నెమ్మదిగా కదులుతున్న వాహనాల మీద ఒక్కసారిగా కూలిపోయింది. అత్యంత బరువైన రెండు అతి పెద్ద కాంక్రీట్ పిల్లర్లు క్రింద ఉన్న వాహనాలను నుజ్జునుజ్జు చేశాయి.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

ట్రాఫిక్‌లో నెమ్మదిగా వెళుతున్న బస్సు, రెండు ఎస్‌‌యూవీలు, రెండు కార్లు మరియు కొన్ని టూ వీలర్లు మీద ఈ పిల్లర్లు జారిపడ్డాయి. ఈ ప్రదేశంలో గురత్వాకర్షణ శక్తి అధికంగా ఉండటంతో ఫ్లైఓవర్ మీద ఉన్న కాంక్రీట్ కూలిపోయినట్లు తెలిసింది.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

సుమారుగా 350 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ వైద్య అధికారులు మరియు ప్రాంతీయ పోలీసు అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు గంటలు శ్రమించి వంతెన క్రింద ఉన్న మృతదేహాలను మరియు క్షతగాత్రులను వెలికితీశారు.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కంటే ముందుగా స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ మరియు ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

ఫ్లైఓవర్ మీద నుండి క్రింద పడిపోయిన కాంక్రీట్ దూలాలు(బీమ్స్) 79 మరియు 80 వ పిల్లర్ల మీద నిర్మించారు. వారం రోజుల క్రితమే ఈ సిమెంట్ దిమ్మెలను పిల్లర్లు మీదకు చేర్చారు. అయితే, వీటిని మెకానికల్ లాకింగ్ సిస్టమ్‌తో భద్రత పరచడం విస్మరించారు.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

ఫ్లైఓవర్ వంతెన కూలిపోయిన వెంటనే కాంట్రాక్టర్ మరియు కూలీలు అక్కడి నుండి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సులో ఉన్న ప్రయాణికులను సిమెంట్ దిమ్మెలు క్రిందపడిన వెంటనే శిధిలాల నుండి తప్పించి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, పిల్లర్ల క్రింద ఉన్న కార్లు మరియు టూ వీలర్లో ఉన్న వారిని రక్షించలేకపోయామని చెప్పుకొచ్చారు.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల మరియు తీవ్రంగా గాయబడిన బాధితులకు 2 లక్షల రుపాయలు చెప్పున సీఎం యోగి ఆధిత్యనాథ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాంట్రాక్టర్ అజాగ్ర్తత్త కారణంగా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

కదిలే వాహనాల మీద కుప్పకూలిన వంతెన: 19 మంది దుర్మరణం

దేశవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో మెట్రో మరియు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరే ఇతర ప్రదేశాల్లో ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Bridge falls on cars moving in service lane, 19 dead
Story first published: Thursday, May 17, 2018, 13:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X