15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఇటీవల విడుదలవుతున్న కాంపాక్ట్ ఎస్‍‌యూవీలు మరియు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా వస్తోంది. ఒకప్పుడు ఈ ఫీచర్ కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే లభించేది. మరి మీరు ఎంచుకునే కార్లలో సన్‌రూఫ్

By Anil Kumar

కార్ల తయారీ సంస్థలు మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని, వీలైనంత ఎక్కువ కస్టమర్లను చేరుకునేందుకు నాణ్యమైన అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. కస్టమర్లు కూడా నాలుగైదు మోడళ్లను పరిశీలించి అన్ని అంశాల పరంగా బెస్ట్ అని నిరూపించుకున్న వాటినే ఎంచుకుంటున్నారు.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఇటీవల విడుదలవుతున్న కాంపాక్ట్ ఎస్‍‌యూవీలు మరియు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా వస్తోంది. ఒకప్పుడు ఈ ఫీచర్ కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే లభించేది. మరి మీరు ఎంచుకునే కార్లలో సన్‌రూఫ్ ఉండాలనుకుంటున్నారా...? అయితే, 15 లక్షల ధరలో లభించే సన్‌రూఫ్ ఉన్న కార్ల గురించి కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి స్టోరీలో...

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి

ఈ జాబితాలో అత్యంత సరసమైన మోడల్ హోండా డబ్ల్యూఆర్-వి. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2017 మార్చిలో డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని సన్‌రూఫ్‌తో లాంచ్ చేసింది. ఏడాది వ్యవధిలో 50,000 లకు పైగా డబ్ల్యూఆర్-వి కార్లు బుక్ అయ్యాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి మొత్తం విక్రయాల్లో 80 శాతం మంది డబ్ల్యూఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్ మోడల్‌నే ఎంచుకున్నారు. ఇందుకు ప్రధానం కారణం ఇందులో వన్‌టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. దీంతో సన్‌రూఫ్‌తో లభించే భారతదేశపు అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచింది.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీలో పగటి పూట వెలిగే లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, శాటిలైట్ న్యావిగేషన్ గల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మిర్రర్ లింక్ స్మార్ట్ ఫోన్ లింకేజ్, వాయిస్ రికగ్నిషన్, బ్లూటూత్, యూఎస్‌బీ మరియు 1.5జీబీ స్టోరేజ్ గల ఇంటర్నల్ మెమొరీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా డబ్ల్యూఆర్-వి లోని విఎక్స్ వేరియంట్లలో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. దీనిని 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో ఎంచుకోవచ్చు. పెట్రోల్ విఎక్స్ ధర రూ. 9 లక్షలు మరియు డీజల్ విఎక్స్ ధర రూ. 10 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

టాటా నెక్సాన్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అనతి కాలంలో తెరమీదకు వచ్చిన మోడల్ టాటా నెక్సాన్. మార్కెట్ లీడర్‌గా రాణిస్తున్న మారుతి వితారా బ్రిజాకు టాటా నెక్సాన్ తన సొగసైన డిజైన్ శైలి, అద్భుతమైన ఫీచర్లు మరియు విభిన్నమైన రూపంతో ముచ్చెమటలు పట్టిస్తోంది. నెక్సాన్‌లో ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ మరియు ఏఎమ్‍‌టి ట్రాన్స్‌మిషన్ ప్రధానంగా నిలిచాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

విడుదలైన తొలి ఐదు నెలల్లోనే ఏకంగా 25,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది. నెక్సాన్ ఎస్‌యూవీకి డిమాండ్ పెరిగేకొద్దీ టాటా ఇందులో పలు విభిన్న యాక్ససరీలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి రూఫ్‌టాప్. అవును టాటా తమ నెక్సాన్‌లో సన్‌రూఫ్‌ను తప్పనిసరిగా ఫీచర్‌గా అందివ్వలేదు. రూ. 16,053 లు చెల్లిస్తే అదనపు యాక్ససరీగా పొందవచ్చు.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

టాటా నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్లో 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గల ఫ్లోటింగ్ డిస్ల్పే, రివర్స్ కెమెరా మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభిస్తోంది. నెక్సాన్ ధరల శ్రేణి రూ. 6.16న లక్షల నుండి రూ. 10.59 లక్షలు ఎక్స్-షోరూమ్.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్

ఫోర్డ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్లో సన్‌రూఫ్ ఫీచర్ పరిచయం చేసింది. ఎకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ పెట్రోల్ ధర రూ. 11.37 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 11.89 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ సన్‌రూఫ్‌తో పాటు సరికొత్త స్మోక్డ్ హెచ్ఐడి హెడ్‌ల్యాంప్స్, డార్క్ ఇన్సర్ట్స్ మరియు ప్రీమియం బ్లాక్ ట్రీట్‌మెండ్ గల ఫాగ్ ల్యాంప్ బెజెల్, బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ పెయింటెడ్ రూఫ్ మరియు రెయిల్స్ అదే విధంగా 17-అంగుళాల స్మోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ ఇంటీరియర్‌లో 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్(కెపాసిటివ్) ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ రికగ్నిషన్ గల సింక్3 సిస్టమ్, ఆపిర్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల మొబైల్ కనెక్టివిటి. అదనంగా క్రోమ్ ఫినిషింగ్ గల ప్రీమియం ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు మల్టీ కలర్ ఆంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ అత్యంత శక్తివంతమైన మరియు అధునాతన 1.0-లీటర్ కెపాసిటి గల ఇకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతోంది. అదే విధంగా ఎస్ వేరియంట్లో 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యమవుతోంది.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా సిటీ

జపనీస్ దిగ్గజం హోండా మోటార్స్ విక్రయిస్తున్న కార్లలో ఎక్కువగా ఎంచుకుంటున్న మోడల్ హోండా సిటీ మిడ్ సైజ్ సెడాన్. సుమారుగా రెండు దశాబ్దాల క్రితం పరిచయమైన హోండా సిటీ 7 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యింది.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా సిటీలోని విఎక్స్ మరియు జడ్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్లలో సన్‌రూఫ్ లభ్యమవుతోంది. అదనంగా, ఆటోమేటిక్ హెడ్‌‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హెడ్‌ల్యాంప్ ఆటో ఆఫ్ టైమర్, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఇడి ఇంటీరియర్ ల్యాంప్స్, 1.5-జీబీ ఇంటర్నల్ మెమొరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

ఇంటీరియర్‌లో డిజిప్యాడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మిర్రర్ లింక్ స్మార్ట్ ఫోన్ లింకేజ్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్ మరియు రివర్స్ కెమెరా ఫీచర్లతో పాటు, భద్రత పరంగా 6-ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్, ఇబిడి, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

హోండా సిటీలోని విఎక్స్ మరియు జడ్ఎక్స్ వేరియంట్లలో సన్‌రూఫ్ ఉంది. ఈ రెండు వేరియంట్లు కూడా రెండు రకాల ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ అనుసంధానంత లభిస్తున్నాయి.

  • సిటీ పెట్రోల్ విఎక్స్ మ్యాన్యువల్ ధర రూ. 11.84 లక్షలు
  • సిటీ పెట్రోల్ విఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 13.04 లక్షలు
  • సిటీ డీజల్ విఎక్స్ మ్యాన్యువల్ ధర రూ. 13.09 లక్షలు
  • సిటీ పెట్రోల్ జడ్ఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 13.70 లక్షలు
  • సిటీ డీజల్ జడ్ఎక్స్ మ్యాన్యువల్ ధర రూ. 13.78 లక్షలు
  • 15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

    హ్యుందాయ్ వెర్నా

    హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఏడాది ఆగష్టులో కొత్త తరానికి చెందిన వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కారును రీలాంచ్ చేసింది. ఎలంట్రా నుండి సేకరించిన డిజైన్ అంశాలతో సరికొత్త కె2 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. సిటీ సెడాన్‌కు పోటీగా ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించింది.

    15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

    వెర్నా టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే సన్‌రూఫ్ లభిస్తోంది. అదనంగా, 3.5-అంగుళాల మోనో టిఎఫ్‌టి-ఎల్‌సిడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ అడ్జెస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు స్లైడింగ్ ఫ్రంట్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

    15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

    హ్యుందాయ్ వెర్నా హై ఎండ్ వేరియంట్లలో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు పరిచయం అయ్యాయి. అందులో, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్ ట్రంక్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటి గల ఐపిఎస్ ప్యానల్, రియర్ ఏ/సి వెంట్స్, వాయిస్ రికగ్నిషన్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ మరియు హ్యుందాయ్ ఆటో లింక్ ఫీచర్లు ఉన్నాయి.

    15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

    హ్యుందాయ్ వెర్నా 1.6-పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌తో పాటు 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. సన్‌రూఫ్ లభించే వెర్నా వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు...

    • డీజల్ ఎస్ఎక్స్(ఆటోమేటిక్) ధర రూ. 12.95 లక్షలు
    • పెట్రోల్ ఎస్ఎక్స్(ఆప్షనల్) ధర రూ. 12.56 లక్షలు
    • డీజల్ ఎక్స్ఎక్స్(ఆప్షనల్) ధర రూ. 12.76 లక్షలు
    • 15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

      హ్యుందాయ్ క్రెటా

      హ్యుందాయ్ మోటార్స్ ఇటీవల 2018 సెకండ్ జనరేషన్ క్రెటా కాంపాక్ట్ ఎస్‌‌యూవీని విపణిలోకి లాంచ్ చేసింది. నూతన క్రెటా వేరియంట్లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశం సన్‌రూఫ్. భారీ మార్పులు చేర్పులతో విడుదలైన క్రెటా మీద కేవలం 10 రోజుల్లోనే 14,000 యూనిట్ల బుకింగ్స్ నమోదయ్యాయి.

      15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

      హ్యుందాయ్ క్రెటా హై ఎండ్ వేరియంట్లలో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. దీనితో పాటు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఐపిఎస్ డిస్ల్పే గల ఏవిఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, క్రెటా ఎస్ఎక్స్(ఒ) వేరియంట్లో 6-మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు, స్మార్ట్ కీ బ్యాండ్, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

      15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

      భారతదేశపు సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2018 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ 1.4-లీటర్ పెట్రోల్, 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో మూడు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా 1.6-లీటర్ ఇంజన్‌లు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

      15 లక్షల ధరల శ్రేణిలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న కార్లు

      ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌కతో లభించే హ్యుందాయ్ క్రెటా వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు

      • క్రెటా పెట్రోల్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 13.44 లక్షలు
      • క్రెటా డీజల్ ఎస్ఎక్స్ ధర రూ. 14.84 లక్షలు
      • క్రెటా పెట్రోల్ ఎస్ఎక్స్(ఒ) ధర రూ. 13.60 లక్షలు
      • క్రెటా డీజల్ ఎస్ఎక్స్(ఒ) ధర రూ. 15.04 లక్షలు

Most Read Articles

English summary
Read In Telugu: Cars with Sunroof under Rs 15 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X